ముస్లిం మహిళలను ట్రోల్ చేసేందుకు సృష్టించిన యాప్, ఏమిటీ వివాదం?

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
- రచయిత, కీర్తి దూబే
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
''సోషల్ మీడియాలో మహిళలను ట్రోల్ చేయడం చాలా సులభం. చాలాసార్లు ఈ ట్రోలింగ్ వ్యక్తిగతంగా ఉంటుంది. కానీ, ముస్లిం మహిళలను అవమానించడానికి కొందరు మరింత దిగజారుతున్నారు''
''ఇది ఎంత ప్రమాదకరంగా ఉందంటే, కొన్నిసార్లు ఈ ట్రోలింగ్ చూశాక అసలు నేను ఈ ప్లాట్‌ఫామ్‌లో ఎందుకు ఉన్నాను, నేను మాట్లాడటం, రాయడం మానేస్తే మంచిదేమో అనిపిస్తుంది''
''ఇది కేవలం జెండర్ సమస్య మాత్రమే కాదు, ఇందులో ఇస్లామోఫోబియా కూడా దాగి ఉంది''
ఈ మాటలన్న నస్రీన్ (పేరు మార్చాం) ట్రోలింగ్ కారణంగా తనలో ఏర్పడిన భయాన్ని, ఆవేదనను వెలిబుచ్చారు.
''మీరు పొద్దున్నే లేచేసరికి మీ ఫొటోలు, వ్యక్తిగత సమాచారం ఇంటర్నెట్‌లో ఫర్ సేల్ అని పెట్టి ఉంటే, కొందరు మీ గురించి నోటికొచ్చినట్లు అశ్లీలంగా మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది?'' అని ప్రశ్నించారు నస్రీన్
గత ఆది, సోమ వారాల్లో కొందరు ముస్లిం మహిళల ఫొటోలతో ఒక ఓపెన్ సోర్స్ యాప్ ఆన్‌లైన్‌లో కనిపించింది. దాని పేరు 'సుల్లి ఫర్ సేల్'
'సుల్లీ' అనేది ముస్లిం మహిళలపై ఉపయోగించే అవమానకరమైన పదం. ఈ యాప్‌లో ఉపయోగించిన ముస్లిం మహిళల సమాచారాన్ని ట్విటర్ నుంచి సేకరించారు.
ఈ యాప్‌లో 80 మందికి పైగా మహిళల ఫొటోలు, పేర్లు, ట్విట్టర్ హ్యాండిల్స్ ఇచ్చారు. ఈ యాప్ మీద 'ఫైండ్ యువర్ సుల్లీ డీల్' అని రాసి ఉంది.
దీనిపై క్లిక్ చేసినప్పుడు, ఒక ముస్లిం మహిళ ఫొటో, ఆమె పేరు, ట్విటర్ హ్యాండిల్ యూజర్‌కు షేర్ అవుతాయి.
మహిళా జర్నలిస్టులను బెదిరించడానికి, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకునే ఈ విధానం ఆందోళన కలిగిస్తోందని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చెప్పింది.
ముస్లిం మహిళలు, మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న ఇలాంటి దాడులను ఎడిటర్స్ గిల్డ్ ఖండించింది.

ఫొటో సోర్స్, EGI
'గిట్‌హబ్' స్పందన
ఈ ఓపెన్ సోర్స్ యాప్‌ను 'గిట్‌హబ్'(GitHub)లో సృష్టించారు. 'గిట్‌హబ్' అనేది ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ కమ్యూనిటీ. సోమవారం నాడు 'సుల్లీ డీల్' యాప్‌ను గిట్‌హబ్ తొలగించింది.
ఈ యాప్ గురించి తెలుసుకునేందుకు కొన్ని ప్రశ్నలతో బీబీసీ ఈ-మెయిల్ ద్వారా గిట్‌హబ్‌ను సంప్రదించింది.
''మేం ఆ యూజర్ ఎకౌంట్‌ను నిలిపేశాం. ఫిర్యాదులు రావడంతో ఈ అంశంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ చర్యలు వేధింపులు, వివక్ష, హింసను ప్రోత్సహించడం కిందికి వస్తాయి. ఇది గిట్‌హబ్ నిబంధనలను ఉల్లంఘించడమే. ఇలాంటి వాటిని మేం ప్రోత్సహించం'' అని సమాధానం ఇచ్చింది.
అకౌంట్ నిలిపేశామని తెలిపిన 'గిట్‌హబ్' చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎరికా బ్రెసియా, ఇదంతా ఎలా జరిగిందో మాత్రం చెప్పలేక పోయారు.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
భయం-కోపం
ఈ ఆన్‌లైన్ వేధింపుల తర్వాత నస్రీన్ చాలా భయపడ్డారు. ''నా పేరు రాయకండి. తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు'' అన్నారామె.
ఈ యాప్ ద్వారా ఫొటోలు, వ్యక్తిగత విషయాలు వేలానికి గురైన ముస్లిం మహిళలో నస్రీన్ కూడా ఒకరు.
''నాకు ఈ సమాచారం ఒక ట్వీట్ ద్వారా వచ్చింది. ఒక యూజర్ ఓ అమ్మాయి ఫొటో ఉన్న స్క్రీన్‌షాట్‌ను పంపుతూ-నేను మంచి డీల్ కోసం చూస్తున్నాను. నాకు దొరికింది. ఇది నా తప్పు కాదు అంటూ రాశారు'' అని నస్రీన్ బీబీసీకి వెల్లడించారు. .
''నేను ఆ యాప్‌ను క్లిక్ చేసినప్పుడు 'ఫైండ్ యువర్ సుల్లీ'' అని రాసి ఉంది. నేను దాన్ని నొక్కినప్పుడు, నా ఫొటో, ట్విటర్ ఎకౌంట్ వివరాలతోపాటు 'యువర్ డీల్ ఫర్ టుడే' అని కనిపించింది'' అని ఆమె చెప్పారు.
అది చూడగానే భయం కన్నా కోపం ఎక్కువగా కలిగిందని, ఇలాంటివి చూడటం తనకు మొదటిసారి కాదని ఆమె పేర్కొన్నారు.
ఇంతకు ముందు కూడా నా ముస్లిం ఫ్రెండ్స్ ఫొటోలను షేర్ చేస్తూ ఒక ట్విటర్ ఎకౌంట్ యూజర్ 'ఫర్ సేల్' అని రాశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కానీ, ఇప్పుడు తమ పై జరుగుతున్న వేధింపులు ట్విటర్ స్థాయిని దాటాయని, ఏకంగా ఒక యాప్‌ను తయారు చేసి మరీ వేధిస్తున్నారని, ముందు ముందు ఇంకేం చేస్తారోనని నస్రీన్ అన్నారు.
''ముస్లిం మహిళలు గట్టిగా మాట్లాడితే అత్యాచారం చేస్తామంటూ వారికి బెదిరింపులు వస్తాయి. మనం ఎంత ధైర్యంగా ఉన్నా,ఇలాంటి బెదిరింపులు, ఫొటోలు, వ్యక్తిగత సమాచారం బైటికి రావడంలాంటివి ఆందోళన కలిగిస్తాయి. మొదటిసారి ఇలాంటి వేధింపులను ఎదుర్కొన్న యువతులు చాలామంది భయపడిపోయి తమ ఖాతాలను డీయాక్టివేట్ చేశారు'' అన్నారు నస్రీన్
అయితే, ఎంత ఆవేశం, ఆగ్రహం ఉన్నప్పటికీ, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి నస్రీన్ సిద్ధంగా లేరు.
''నాకు పోలీసుల మీద నమ్మకం లేదు. గతంలో ఒకసారి ఇలాగే జరిగితే ఫిర్యాదు చేశాను. కానీ ఏమీ ఉపయోగం లేదు. ముస్లిం మహిళలను వేధించడం, చట్టానికి దొరక్కుండా తప్పించుకోవడం చాలా సులభం'' అన్నారామె.
ఆర్కైవ్ ద్వారా ఈ యాప్ గురించి సమాచారాన్ని తెలుసుకోవడానికి బీబీసీ ప్రయత్నించింది. జూన్ 14న ఈ యాప్‌ను ప్రారంభించినట్లు, జూలై 4-5 మధ్య అత్యధికంగా పోస్టులు వెళ్లినట్లు తేలింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫాంలు ఎలా పని చేస్తాయి?
ఓపెన్ సోర్స్ కోడ్ అంటే ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. బయటి వ్యక్తులు ఈ కోడ్‌కు కొత్త ఫీచర్లు జత చేయడం, లోపాలుంటే సరి చేయడంలాంటివి చేయవచ్చు.
ఒకవేళ ఈ యాప్‌ను డిజైనర్ తొలగించినా, డొమైన్ నేమ్ సిస్టమ్ ప్రొవైడర్ దగ్గర దీనికి సంబంధించిన సమాచారం ఉంటుంది.
''సుల్లీ ఫర్ సేల్'' యాప్‌ను ప్రస్తుతం గిట్‌హబ్ నుంచి తొలగించారు కాబట్టి, దానిని ఎవరు రూపొందించారు అనే సమాచారం అందుబాటులో లేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
''హిందువులు కూడా కలిసి రావాలి''
ఫరా ఖాన్( అసలు పేరు కాదు)కు స్నేహితుల నుండి యాప్ స్క్రీన్‌షాట్ వచ్చినప్పుడు ఆమె ఆఫీసు పనిలో ఉన్నారు.
''ఫర్ సేల్ అంటూ నా ఫొటోను వెబ్‌సైట్‌లో పెట్టారని తెలిసి చాలా బాధపడ్డాను, భయపడ్డాను. యాప్‌తో సహా ఈ ఫొటోలను కూడా డిలీట్ చేశారని చెప్పినా, ఇవి ఇంకా ఎంత దూరం వెళ్లాయోనని నాకు భయం వేసింది. అసలు ఏం జరుగుతుందో నాకు అర్ధం కాలేదు'' అన్నారు ఫరా
''అవతలి వ్యక్తులు నాలాంటి వాళ్లు భయపడటమే కోరుకుంటారు. హక్కుల కోసం పోరాడే ముస్లిం మహిళలను భయపెట్టాలన్నదే వారి లక్ష్యం. అందుకే, ఈ పోరాటంలో లిబరల్ హిందువులు కూడా మాతో కలిసి రావాలి'' అన్నారామె.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
మతం ఏదైనా తప్పు చేసిన వారిని తప్పుబట్టాల్సిందేనని ఫరా ఖాన్ అన్నారు. తన స్నేహితులతోపాటు పలువురు మహిళలు దీనిపై దిల్లీ మహిళా కమిషన్, దిల్లీ పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారని, కానీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి నేరాలు చేస్తున్న వారికి పోలీసులన్నా, చట్టాలన్నా భయం లేదని, తమకేమీ జరగదని వారి ధైర్యమని ఫరాఖాన్ అన్నారు.
నస్రీన్ మాదిరిగానే, ఫరా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారు. అయితే, ఈ వేధింపులపై కొందరు మహిళలు దిల్లీ పోలీసులకు, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
గిట్‌హబ్, ట్విట్టర్‌లకు పోలీసుల నోటీసులు
యాప్‌లో సమాచారం షేర్ అయిన ముస్లిం మహిళల్లో కొందరు దిల్లీకి చెందిన వారు, మరికొందరు ఇతర నగరాలకు చెందిన వారు కూడా ఉన్నారు.
దీనిపై సమాచారం కోసం బీబీసీ దిల్లీ పోలీసులను సంప్రదించగా, వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఇటు దిల్లీ మహిళా కమిషన్ త్వరలో వారికి నోటీసు పంపిస్తామని, ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తామని వెల్లడించింది.
ఈ యాప్ ద్వారా వేధింపులకు గురైన ముంబైకి చెందిన ఫాతిమా జూలై 5న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంపై ముంబై పోలీసులు గిట్‌హబ్, ట్విటర్‌లకు నోటీసులు పంపారు. యాప్ సృష్టికర్త ఎవరో చెప్పాలని గిట్‌హబ్‌ను, షేర్ చేసిన వారి వివరాలు ఇవ్వాలని ట్విటర్‌ను కోరారు.
ఇవి కూడా చదవండి:
- వైఎస్ షర్మిల: కృష్ణా నదిపై రెండేళ్లుగా ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ ఇప్పుడే తెలివిలోకి వచ్చారా?
- మోదీ కేబినెట్: దళిత, ఓబీసీ మంత్రులు యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించగలరా
- ప్యూ రీసెర్చ్: మతం పట్ల భారతీయుల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








