కరణం మల్లీశ్వరి నుంచి సింధు వరకు: భారత మహిళా క్రీడాకారిణుల విజయగాథలను వెలుగులోకి తీసుకొద్దాం.. - BBC ISWOTY

భావన

ఫొటో సోర్స్, BHAVNA

    • రచయిత, వందన
    • హోదా, బీబీసీ భారతీయ భాషల టీవీ ఎడిటర్

అంతర్జాతీయ స్థాయిలో ఫెన్సింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం తీసుకొచ్చిన తొలి క్రీడాకారిణి 26ఏళ్ల భవానీ దేవి. టోక్యో ఒలింపిక్స్‌లోనూ తన ప్రతిభ చూపేందుకు ప్రస్తుతం ఆమె కృషి చేస్తున్నారు.

భారత్‌లో ఫెన్సింగ్‌కు అంత ఆదరణ లేదు. ఇక్కడ ఫెన్సింగ్‌లో కెరియర్‌ను ముందుకు తీసుకెళ్లాలని భావించేవారు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్

కరోనావ్యాప్తి నడుమ ట్రైనింగ్ సెంటర్లు, జిమ్‌లు మూతపడ్డాయి. అయితే, ఇటుకలు, కిట్ బ్యాగ్‌తో తయారుచేసిన ఓ డమ్మీ పార్ట్‌నర్‌తో తన ఇంటి మేడపై భావన పోరాడుతున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ నడుమ ఫెన్సింగ్‌పై పట్టుకోల్పోకుండా ఉండేందుకే ఆమె అభ్యాసం చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

జిమ్‌లు తెరిచిన తర్వాత, ఒక రోజు మొత్తం మరో యువ క్రీడాకారిణి, రెజ్లర్ దివ్య కాక్రాన్‌తో గడిపాను. వీడియో కాల్‌లో జార్జియా కోచ్ నిరంతరం సూచనలు ఇస్తుంటే ఆమె రెజ్లింగ్‌లో మెలకువలు నేర్చుకుంటున్నారు.

కరోనావైరస్ సంక్షోభ సమయంలోనూ భారత క్రీడాకారుణుల్లో పట్టుదల, నిబద్ధతకు ఈ రెండు ఘటనలూ అద్దం పడుతున్నాయి. వాయిదాల మీద వాయిదాల పడుతూ వస్తున్న టోక్యో ఒలింపిక్స్‌కు వీరు సన్నద్ధం అవుతున్నారు.

ఈ నేపథ్యంలో భారత్‌లో మహిళా క్రీడాకారిణుల విజయాలను అందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రెండో ఎడిషన్‌ను ఫిబ్రవరి 8న బీబీసీ ఆవిష్కరిస్తోంది.

స్పోర్ట్స్‌లో మహిళలను వెలుగులోకి తీసుకురావడం, భారతీయ మహిళా క్రీడాకారిణులు, పారా అథ్లెట్లు సాధిస్తున్న విజయాలను ప్రజలకు పరిచయం చేయడంమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు.

భారత మహిళా క్రీడాకారిణుల విజయ గాథ

రియో ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన రెండు పతకాలూ మహిళలే తీసుకొని వచ్చారు. ఈ సారి కూడా చాలా మంది మహిళలు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత సంపాదించారు.

ఒలింపిక్స్‌లో ఓ భారత మహిళ తొలి పతకం సాధించి ఈ ఏడాదికి 20ఏళ్లు పూర్తయ్యాయి.

2000లో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి కాంస్య పతకాన్ని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించారు. ఆ రోజు 19, సెప్టెంబరు 2000 ఇప్పటికీ చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది.

ఆ తర్వాత సైనా నెహ్వాల్, సాక్షి మలిక్, మేరీ కామ్, మానసి జోషి, పీవీ సింధు కూడా ఒలింపిక్స్ పతకాలు, వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లు సాధించారు.

కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఈ ఏడాది స్పోర్ట్స్ క్యాలెండర్ కుదించుకుపోయింది. అయినప్పటికీ, ఆసియా అండ్ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్, చెస్ ఒలింపియాడ్‌లను నిర్వహిస్తున్నారు. మరోవైపు మహిళల హీకీ జట్టుకు కూడా ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. మరికొంత మంది భారత మహిళా క్రీడాకారిణులు కూడా తమ సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నారు.

ఇలా విజయ దుందుభి మోగిస్తున్న మహిళా క్రీడాకారిణులను వెలుగులోకి తీసుకురావడం, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై చర్చ తీసుకురావడమే బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ లక్ష్యం.

కరణం మల్లీశ్వరి
ఫొటో క్యాప్షన్, కరణం మల్లీశ్వరి

స్పోర్ట్స్‌లో లింగ సమానత్వం

గతేడాది మార్చిలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుండే ఉంటుంది.

మహిళల స్పోర్ట్స్‌కు విచ్చేసిన అతిథుల సంఖ్య విషయంలో ప్రపంచ రికార్డు సృష్టించే అవకాశం ఈ మ్యాచ్‌(90,185 మంది అతిథులు)కు తృటిలో తప్పిపోయింది. అయితే, మహిళల క్రికెట్‌కు ఈ స్థాయిలో మునుపెన్నడూ ప్రేక్షకులు రాలేదని ఐసీసీ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అంతర్జాతీయ టోర్నమెంట్లలో భారత క్రీడాకారిణులు పతకాలు సాధిస్తున్నప్పటికీ వారి విజయాలు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు.

వికీపీడియాలో సైతం చాలా మంది భారత క్రీడాకారిణులకు పేజీలే లేవు. మరికొందరి పేజీల్లో మగవారితో పోలిస్తే చాలా తక్కువ సమాచారం ఉంది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ కార్యక్రమంలో భాగంగా బీబీసీ ఓ హ్యాకథాన్‌ను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా 50 మంది భారత మహిళా క్రీడాకారిణుల ప్రొఫైల్స్‌ను విద్యార్థులు సిద్ధం చేయబోతున్నారు.

త్వరలో టోక్యో ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో స్పోర్ట్స్‌లో మహిళలవైపు దృష్టి మళ్లించేందుకు ఈ కార్యక్రమం సాయంతో బీబీసీ ప్రయత్నిస్తోంది.

పీవీ సింధు

ఫొటో సోర్స్, Getty Images

విజేతను ఎలా ప్రకటిస్తారు?

ఈ కార్యక్రమం కోసం భారత మహిళా క్రీడాకారిణుల్లో కొందరిని జ్యూరీ ఎంపిక చేసింది. ఈ జ్యూరీలో ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టులు, నిపుణులు, రచయితలు ఉన్నారు.

ఎంపిక అయిన క్రీడాకారిణుల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన ఐదుగురిని ఓటింగ్ కోసం నామినేట్ చేస్తారు. ఈ ఐదుగురికి ప్రజలు ఓట్లు వేస్తారు. ఈ ప్రక్రియ ఫిబ్రవరి 8 నుంచి 24 వరకు కొనసాగుతుంది.

ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు విజేతను బీబీసీ జ్యూరీ ఎంపిక చేస్తుంది. మరోవైపు జీవన సాఫల్య పురస్కారం (లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు) విజేతను ఎడిటోరియల్ బోర్డు ఎంపిక చేస్తుంది.

తొలి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ -2019ను రియో ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు గెలుచుకున్నారు. జీవన సాఫల్య పురస్కారం స్ప్రింటర్ పీటీ ఉషకు దక్కింది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)