అమర్ సింగ్ మృతి.. చనిపోయే ముందు ఏమని ట్వీట్ చేశారు

అమర్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

రాజ్య సభ సభ్యుడు అమర్ సింగ్ సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో మరణించారు.

చాలాకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన సింగపూర్‌లో చికిత్స పొందుతున్నారు.

2013లో ఆయన కిడ్నీ విఫలమై అనారోగ్యం పాలయ్యారు. ఆ తరువాత మూత్రపిండాల మార్పిడి చేయించుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

చనిపోయే ముందు ట్వీట్

అమర్ సింగ్‌కు 64 ఏళ్లు. చనిపోయే కొన్ని గంటల ముందే ఆయన స్వాతంత్ర్య సమర యోధుడు, విద్యావేత్త బాల గంగాధర తిలక్ వర్ధంతిపై ట్వీట్ చేశారు. ట్విటర్‌లో ముస్లిం కార్యకర్తలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.

ఆయన అనారోగ్యంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేవారని తెలుస్తుంది. మార్చి 22న ఆస్పత్రి బెడ్ మీద నుంచే ఆయన ట్విటర్‌లో వీడియోలు పోస్ట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

కరోనావైరస్‌తో పోరాడేందుకు ప్రధాని మోదీకి అండగా నిలవాలని తన మద్దతుదారులను కోరారు.మార్చి 2న తను చనియానని వచ్చిన వదంతులను ఖండిస్తూ కూడా ఆయన ఒక వీడియో సందేశం పోస్ట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఆ వీడియోతోపాటూ టైగర్ జిందా హై అనే సందేశం పెట్టారు.

అజిత్ సింగ్, అమర్ సింగ్, జయప్రద

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అజిత్ సింగ్, అమర్ సింగ్, జయప్రద

అలీగఢ్‌లో పుట్టిన అమర్ సింగ్ కోల్‌కతా సెయింట్ జేవియర్స్ కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. ములాయం సింగ్‌తో స్నేహంఅమర్ సింగ్‌ను సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడుగా చూస్తారు.కానీ అమర్ సింగ్ మొదట రాజకీయాల్లోకి అడుగుపెట్టింది కాంగ్రెస్ పార్టీ నుంచే. ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా కూడా ఉన్నారు. ఒకప్పుడు ఆయన కలకత్తా జిల్లా కాంగ్రెస్‌లో సభ్యులుగా ఉన్నారు. తన జీవితకాలంలో ఎన్నో పార్టీల్లో చేరిన అమర్ సింగ్ అమర్ సింగ్ చాలా సంస్థలకు కూడా పనిచేశారు. ఇండియన్ ఎయిర్ లైన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ టెక్స్ టైల్స్ కార్పొరేషన్‌లకు డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. కేంద్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఆయన ఎన్నో సలహా కమిటీల్లో కూడా ఉన్నారు.

జయప్రదతో కలిసి సొంత పార్టీ

సమాజ్‌వాది పార్టీలోను, యూపీఏ హయాంలోను అమర్ సింగ్ కీలకంగా వ్యవహరించేవారు.

అనంతరం రాజకీయ విభేదాలతో సమాజ్ వాది పార్టీ నుంచి అమర్ సింగ్‌ను బహిష్కరించారు.

పార్టీ నుంచి బహిష్కరించడంతో 2010 జనవరి 6న సమాజ్‌వాదీ పార్టీలోని అన్ని పదవులకు ఆయన రాజీనామా చేసారు.

అనంతరం ఆయన తన సన్నిహితురాలు జయప్రదతో కలిసి కొత్త పార్టీ పెట్టారు. కానీ, రాజకీయంగా ఆ పార్టీ పెద్దగా విజయవంతం కాలేదు.

తను తిరిగి సమాజ్‌వాది పార్టీలోకి వెళ్లేది లేదని ఆయన ఇటీవల ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)