విశాఖపట్నం: హిందుస్తాన్ షిప్‌యార్డు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం

విశాఖపట్నంలోని హిందూస్తాన్ షిప్‌యార్డ్‌లో భారీ క్రేన్ కూలిన ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని యాజమాన్యం ప్రకటించింది. బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగడంతో ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ రెండు వర్గాలతో చర్చలు జరిపారు.
చర్చల అనంతరం మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు సంస్థ సీఎండీ ప్రకటించారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు కూడా రూ. 50 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
11 మంది మృతి
విశాఖపట్టణంలోని హిందుస్థాన్ షిప్‌యార్డులో భారీ క్రేన్ కూలిపోవడంతో 11 మంది మృతి చెందారని పోలీసులు తెలిపారు.
క్రేన్‌తో లోడింగ్ పనులు పరిశీలిస్తుండగా అది కుప్పకూలడంతో దాని కింద పడిన కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరు మృతిచెందగా, మరికొందరిని ఆస్పత్రికి తరలించారు.
మృతులను ఆర్.వెంకట్రావు (35), చైతన్య (34), రాము (43), పీవీ రత్నం, క్రేన్ ఆపరేటర్, పి.నాగ దేముడు, సత్యరాజ్, శివకుమార్, పి.భాస్కర్, కె.జగన్, కె.ప్రసాద్‌గా గుర్తించారు. పదకొండో వ్యక్తి పేరు తెలియాల్సి ఉంది.
ఈ ప్రమాదంలో డీసీపీ సురేష్ బాబు ధ్రువీకరించారని ఏఎన్ఐ చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
హిందుస్థాన్ షిప్‌యార్డులో క్రేన్ కుప్పకూలుతున్న వీడియో ఏఎన్ఐ సహా చాలా ట్విటర్ హ్యాండిళ్లలో షేర్ అవుతోంది.
మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు.
షిప్‌యార్డులో క్రేన్ ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్ వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆర్డీవోకు సూచించారు.
హిందుస్థాన్ షిప్‌యార్డులో జరిగిన క్రేన్ ప్రమాదం గురించి సీఎం వైయస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారని ముఖ్యమంత్రి కార్యాలయం ట్విటర్ ద్వారా తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ ఘటనపై తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపింది.
మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు విశాఖ షిప్‌యార్డులో ప్రమాదంపై ట్విటర్‌లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"హిందుస్థాన్ షిప్ యార్డ్ లో భారీ క్రేన్ కూలి పది మంది మృతి చెందారన్న వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రమాద సమయంలో క్రేన్ వద్ద 30 మంది వరకు ఉన్నారని అంటున్నారు. వారంతా క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను" అన్నారు.

ప్రమాదం విషయం తెలీగానే, కార్మికుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు హిందుస్తాన్ షిప్‌యార్డు దగ్గరికి భారీగా చేరుకున్నారు.
తమవారి క్షేమం తెలీక కొందరు భయాందోళనలకు గురై రోదిస్తున్నారు.
ఈ ప్రమాదంపై షిప్ యార్డ్ మేనేజ్‌మెంట్ ఇంకా స్పందించలేదు.
ఈ ఘటన కలచివేసింది: రాజ్‌నాథ్ సింగ్
హిందుస్థాన్ షిప్‌యార్డ్ ప్రమాదంలో ఉద్యోగులు చనిపోయిన ఘటన తీవ్రంగా కలచివేసిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. దీనిపై శాఖాపరమైన విచారణ జరిపిస్తామని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
విచారణ కమిటీ ఏర్పాటు
హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో జరిగిన క్రేన్ ప్రమాదంపై రెండు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు.
ఈ మేరకు ప్రమాద వివరాలను కలెక్టర్ వివరించారు. ''హెచ్‌ఎస్‌ఎల్ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటనలో ఎవరూ గాయపడలేదు. క్రేన్ ఆపరేషన్, మేనేజ్‌మెంట్‌లో మొత్తం మూడు కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయి.
మృతుల్లో నలుగురు హెచ్‌ఎస్‌ఎల్ ఉద్యోగులున్నారు. మిగిలిన ఏడుగురు కాంట్రాక్ట్ ఏజెన్సీలకు చెందినవారు. క్రేన్ కూలిన సమయంలో కేబిన్లో 10 మంది ఉన్నారు. మృతుల్లో పది మంది వివరాలు గుర్తించాం. ఒకరి వివరాలను గుర్తించాల్సి ఉంది'' అని కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- కరోనా విపత్తు బొగ్గు పరిశ్రమను అంతమొందిస్తుందా
- మేఘాలయ: 'ర్యాట్ హోల్' బొగ్గు గనిలో ఎలా పనిచేస్తారు
- ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- భారత్‌లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
- ర్యాట్ హోల్ మైనింగ్: బొగ్గుగనిలో చిక్కుకున్న కార్మికులు.. కాపాడడం సాధ్యమేనా?
- అబ్ఖాజియా: ఇదో అజ్ఞాత దేశం.. దీనిని భారత్ ఇప్పటికీ గుర్తించలేదు
- ఉపగ్రహ చిత్రాలు: భారత్‌లో గాలి ఎందుకిలా మారింది?
- బ్రిటన్ నల్లమందు వ్యాపారం భారతీయులను పేదరికంలోకి ఎలా నెట్టింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)