త‌మిళ‌నాడు ఎన్ఎల్‌సీ థర్మ‌ల్ విద్యుత్ కేంద్రంలో పేలుడు... ఆరుగురు మృతి

త‌మిళ‌నాడు క‌డ‌లూరు జిల్లాలోని థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రంలో ప్ర‌మాదం
ఫొటో క్యాప్షన్, త‌మిళ‌నాడు క‌డ‌లూరు జిల్లాలోని థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రంలో ప్ర‌మాదం

త‌మిళ‌నాడు క‌డ‌లూరు జిల్లాలోని థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రంలో బుధ‌వారం ప్ర‌మాదం సంభ‌వించింది. దీంతో ఆరుగురు మృత్యువాత‌ప‌డ్డారు. 17 మందికి గాయాల‌య్యాయి.

నైవేలీ థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రంలోని ఐదో బాయిల‌ర్‌లో విస్ఫోటం సంభ‌వించ‌డంతో ఇక్క‌డ మంట‌లు చెల‌రేగాయి. గాయ‌ప‌డిన వారిని నైవేలీ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కొంద‌రిని అత్య‌వ‌స‌ర చికిత్స కోసం చెన్నైకి అంబులెన్స్‌ల‌లో పంపిస్తున్నారు.

ఘ‌ట‌న స్థ‌లంలో మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాప‌క విభాగం ప్ర‌య‌త్నిస్తోంది.

గాయాల‌పాలైన సిబ్బంది
ఫొటో క్యాప్షన్, గాయాల‌పాలైన సిబ్బంది
ఘ‌ట‌న స్థ‌లంలో ఎగ‌సిప‌డుతున్న పొగ‌లు
ఫొటో క్యాప్షన్, ఘ‌ట‌న స్థ‌లంలో ఎగ‌సిప‌డుతున్న పొగ‌లు

మంట‌ల వ‌ల్ల రెండో థర్మ‌ల్ విద్యుత్ కేంద్రంలో ప‌నుల‌ను పూర్తిగా నిలిపివేశారు.

మే 7న ఇక్క‌డ ఆరో విభాగంలో మంట‌లు చెల‌రేగ‌డంతో ఐదుగురు మ‌ర‌ణించారు. గ‌త రెండు నెల‌ల్లో నైవేలీ థ‌ర్మ‌ల్‌ విద్యుత్ కేంద్రంలో ఇలా ప్ర‌మాదాలు జ‌ర‌గ‌డం ఇది మూడోసారి.

మ‌రోవైపు మృత‌దేహాల‌ను ప్రాంగ‌ణం నుంచి బ‌య‌ట‌కు తీసుకెళ్ల‌కుండా సిబ్బంది నిర‌స‌న చేప‌ట్ట‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పోలీసులు, కేంద్ర పారిశ్రామిక భ‌ద్ర‌తా ద‌ళం (సీఐఎస్ఎఫ్‌) సిబ్బందిని ఇక్క‌డ మోహ‌రించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)