కరోనావైరస్ వ్యాక్సిన్: కోతులపై ప్రయోగంలో పురోగతి.. మానవులపైనా టీకా ప్రయోగాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రేచల్ స్కరీర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆరు కోతులపై జరిపిన కరోనావైరస్ వ్యాక్సిన్ పరీక్షలు మంచి ఫలితాలు ఇచ్చాయి. కోవిడ్-19 వ్యాధి నుంచి రక్షణ కల్పించే సామర్థ్యం ఈ వ్యాక్సిన్‌కు ఉందని ఈ పరీక్షల్లో తేలింది.
ఈ వ్యాక్సిన్‌ను ఇప్పుడు మానవులపై పరీక్షిస్తున్నారు.
అయితే, కోతులపై ప్రయోగించినప్పుడు వచ్చిన సానుకూల ఫలితాలే ఇప్పుడు మానవులపై పరీక్షల్లో కూడా వస్తాయన్న గ్యారెంటీ ఏమీ లేదు. అయినప్పటికీ, ఈ వ్యాక్సిన్ ఆశలు రేకెత్తిస్తోంది.
ప్రయోగాలు జరిపిన కోతుల్లో కొన్నింటికి తొలుత వ్యాక్సిన్ ఇచ్చారు. తర్వాత వాటిలోకి సార్స్-సీఓవీ-2ను ప్రవేశపెట్టారు. అప్పుడు ఆ కోతుల ఊపిరితిత్తులు, శ్వాస మార్గాల్లోకి తక్కువ వైరస్ చేరినట్లు గుర్తించారు.
ప్రయోగంలోని మిగతా కోతులతో పోల్చి చూస్తే వ్యాక్సిన్ ఇచ్చిన కోతులకు వ్యాధి తక్కువగా సోకినట్లుల తేలింది.
ఈ ప్రయోగం అమెరికాలో జరిగింది. అమెరికా ప్రభుత్వ జాతీయ వైద్య సంస్థ (ఎన్ఐహెచ్) పరిశోధకులు, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు కలసి ఈ ప్రయోగం నిర్వహించారు.
న్యుమోనియా ఏర్పడకుండా ఈ జంతువులను వ్యాక్సిన్ రక్షించింది.
ప్రయోగంలో పాల్గొన్న కోతుల (Rhesus macaques) రోగ నిరోధక వ్యవస్థ కూడా మనుషుల రోగ నిరోధక వ్యవస్థలాగే ఉంటుంది.
ఈ ప్రయోగంలో.. కోతుల్లో ''ప్రతిరక్షక పెరుగుదల వ్యాధి'' రాలేదు. వ్యాధికి వ్యాక్సిన్ తప్పుగా స్పందిస్తే ఇలా జరుగుతుంది. బీబీసీ వైద్య కరస్పాండెంట్ ఫెర్గుస్ వాల్ష్ దీనిని ''థియరెటికల్ రిస్క్'' అని వర్ణించారు.
మరొక తరహా కరోనావైరస్ అయిన సార్స్ వ్యాధి ప్రబలినప్పుడు జంతువులపై జరిపిన ప్రయోగాలలో ఇలాంటి ఫలితాలు వచ్చాయి. దీంతో సార్స్ వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.

కాగా, ప్రస్తుత ప్రయోగాన్ని మిగతా శాస్త్రవేత్తలెవరూ పరిశీలించలేదు, అలాగే ఈ ఫలితాన్ని ఇంకా అధికారికంగా ప్రచురించలేదు. అయితే, ఈ ఫలితం 'అత్యుత్తమమైనది', 'చాలా ప్రోత్సాహకరమైనది' అని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌లో పనిచేసే ప్రొఫెసర్ స్టీఫెన్ ఇవాన్స్ అన్నారు.
బ్రిటన్‌లో వెయ్యి మందికి పైగా వాలంటీర్లపై మానవ ప్రయోగాలు కూడా ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్‌కు ప్రస్తుతం వందకు పైగా వ్యాక్సిన్లు ప్రయోగదశలో అభివృద్ధి చెందుతున్నాయి.
లండన్ కింగ్స్ కాలేజీలో ఫార్మాసూటికల్ మెడిసిన్ విభాగంలో విజిటింగ్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ పెన్నీ వార్డ్ మాట్లాడుతూ.. ''ఈ కోతుల్లో వ్యాక్సిన్ తప్పుగా ప్రతిస్పందించకపోవడం, వ్యాక్సిన్ వేసిన తర్వాత వాటిలో న్యుమోనియా రాకపోవడం మంచి విషయం'' అన్నారు.
వైరస్‌లోని కీలక భాగాలను శరీరం ఎలా గుర్తిస్తోంది అన్నది మొదట చూస్తారు. తద్వారా వైరస్ సోకినప్పుడు ఎలా ప్రతిస్పందించాలో శరీరానికి తెలుస్తుంది. అలా వైరస్‌తో పోరాడేందుకు తగిన ప్రతిరక్షకాలను శరీరమే ఉత్పత్తి చేస్తుంది.
తాజాగా జరిగిన ప్రయోగంలో కూడా కోతులు వైరస్‌పై పోరాడేందుకు తగిన ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేయగలిగాయి.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్: ఏపీలో మిర్చి, తెలంగాణలో పసుపు క్లస్టర్లు.. రూ. 4 వేల కోట్లతో మూలికల సాగు
- ప్రభుత్వ క్వారంటైన్లో ఉండటానికి నిరాకరించిన రైలు ప్రయాణీకులు.. తిరిగి దిల్లీ పంపించిన కర్ణాటక
- కరోనావైరస్: కోయంబేడు నుంచి కోనసీమ దాకా.. ‘ఏపీలోని 10 జిల్లాలకు దిగుమతి’
- కరోనావైరస్: స్కూల్స్‌లో సామాజిక దూరం పాటించడం సాధ్యమేనా?
- కరోనావైరస్ వ్యాక్సీన్ కనిపెట్టినా... అది పేద దేశాలకు అందుతుందా?
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేసే అవకాశాన్ని ప్రపంచం ఎలా చేజార్చుకుంది?
- కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీకి ఫార్మా సంస్థలు ఎందుకు ముందుకురావట్లేదు...
- కరోనావైరస్: రెండు వ్యాక్సీన్లపై పరీక్షలు మొదలుపెట్టిన శాస్త్రవేత్తలు
- కరోనావైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: కోవిడ్‌తో యుద్ధానికి సిద్ధమైన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








