కరోనావైరస్ హాట్‌స్పాట్లు: ఈ ప్రాంతాల్లో ఏం జరగబోతుంది? లాక్‌డౌన్‌కు, దీనికి తేడా ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని మరింత పొడగించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవల విజ్ఞప్తి చేశారు. వివిధ రాష్ట్రాలు, నిపుణులు కూడా కేంద్రాన్ని ఇదే కోరుతున్నాయి.
మరోవైపు తెలంగాణలో ఇప్పటివరకూ వందకుపైగా ప్రాంతాలను కరోనావైరస్ హాట్‌స్పాట్లుగా ప్రభుత్వం గుర్తించినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి.
హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్, కామారెడ్డి, గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, కరీంనగర్‌లో ఈ హాట్‌స్పాట్లు గుర్తించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.
కానీ, ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అధికారికంగా దీని గురించి ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు.
ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ రాష్ట్రాల్లో అధికారికంగా హాట్‌స్పాట్లను ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో పూర్తి దిగ్భంధాన్ని అమలు చేస్తున్నారు.
దిల్లీ ఇలా 20 ప్రాంతాలను బుధవారం అర్ధరాత్రి నుంచి సీల్ చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 15 జిల్లాల్లో 104 హాట్‌స్పాట్లను గుర్తించారు.
హాట్ స్పాట్లు అంటే కరోనావైరస్ తీవ్రత ఎక్కువున్న సున్నితమైన ప్రాంతాలు.

లాక్‌డౌన్‌కు, దీనికి తేడా ఏంటి...
లాక్‌డౌన్‌లో జనాలను ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం సూచించింది. వైద్యం, నిత్యావసరాల కొనుగోలు వంటి వాటికే నిర్ణీత సమయాల్లో సాధారణ ప్రజలను బయటకు వచ్చేందుకు అనుమతించింది.
హాట్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల విషయమంలో మాత్రం అలా కాదు. వీటిని పూర్తిగా సీల్ చేస్తారు. రాకపోకలు పూర్తిగా ఆపేస్తారు. కూరగాయల మార్కెట్ల వంటివి కూడా నడవవు.
అక్కడుండే వారికి అవసరమైన వస్తువులు, సరుకులు, ఔషధాలు... నేరుగా ఇళ్లకే సరఫరా చేస్తారు. ప్రభుత్వాలు ఇందుకోసం కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాయి.
లాక్‌డౌన్ సమయంలో ఇచ్చిన పాస్‌లన్నింటనీ సమీక్షించి, అవసరం లేవనుకున్నవాటిని రద్దు చేస్తారు.
అత్యవసర సేవలు, మీడియాలో పనిచేస్తున్నవారిని మాత్రమే రాకపోకలకు అనుమతి ఉంటుంది.

ఫొటో సోర్స్, TWITTER/NOIDA_AUTHORITY
ఏపీలో రెడ్ జోన్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రాంతాలనూ హాట్‌స్పాట్లుగా గుర్తించినట్లు సమాచారం లేదు. అయితే, కోవిడ్-19 ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తిస్తున్నారు.
విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, కాకినాడ, కర్నూలుల్లో కరోనావైరస్ తీవ్రత ఎక్కువున్న కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించినట్లు రాష్ట్ర కోవిడ్-19 నోడల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ చెప్పారు.
జిల్లాల వారీగా చూస్తే ఏప్రిల్ 10వ తేదీ నాటికి అనంతపురంలో మూడు, చిత్తూరులో ఏడు, తూర్పు గోదావరిలో ఎనిమిది, గుంటూరులో 12, కడపలో ఆరు, కృష్ణాలో 16, కర్నూలులో 22, నెల్లూరులో 30, ప్రకాశంలో 11, విశాఖపట్నంలో ఆరు, పశ్చిమ గోదావరిలో 12 ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించారు.
ఈ ప్రాంతాల్లో లాక్‌డౌన్ కఠినంగా అమలవుతోంది. పరీక్షల నిర్వహణ కూడా ముమ్మరంగా సాగుతోంది.
కేవలం ఉదయం ఒక గంట పాటే సరుకుల కొనుక్కునేందుకు జనాన్ని బయటకు వచ్చేందుకు అనుమతిస్తున్నారు.
కోవిడ్-19 పాజిటివ్ కేసులున్న ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల చుట్టూ ఉన్న ప్రాంతాలని కంటైన్మెంట్ క్లస్టర్లుగా తీసుకున్నారు. కేసుల వ్యాప్తికి అవకాశం ఉన్న 5 కిలోమీట్ల ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా గుర్తించారు. గ్రామాల్లో అయితే బఫర్ జోన్లను 7 కిలోమీటర్ల వరకూ విస్తరిస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో అవసరమైన సేవలను, ప్రభుత్వ సేవలను నిర్వహించేందుకు తప్ప మరే ఇతర కారణాలతోనూ ప్రజలు బయటకు వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని రాష్ట్ర నోడల్ అధికారి ప్రకటించారు.
అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ తో పాటు కోవిడ్ పై అవగాహన కల్పిస్తున్నారు. అన్ని వాహనాల కదలికలను, ప్రజా రవాణాను నిషేధించారు.
కంటైన్మెంట్ జోన్ ను అనుసంధానించే అన్ని రహదారులనూ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లేనివాళ్లే దేశంలో ఎక్కువగా చనిపోతారా? ఎందుకు?
- కరోనావైరస్: కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడగలదా?
- హైదరాబాద్: మణిపూర్ విద్యార్థులపై వివక్ష.. సూపర్ మార్కెట్లోకి వెళ్లకుండా అడ్డుకున్న సెక్యూరిటీ గార్డు
- కరోనావైరస్ లాక్‌డౌన్ ఎఫెక్ట్: భూమి కంపించటం తగ్గిపోయింది
- వుహాన్‌లో లాక్ డౌన్ ఎత్తేసిన చైనా ప్రభుత్వం.. రైళ్లు, విమానాల్లో మొదలైన ప్రయాణాలు
- దిల్లీ హింస- అద్దాలు పగిలిన రాత్రి
- కరోనావైరస్ వ్యాక్సీన్ కనిపెట్టినా... అది పేద దేశాలకు అందుతుందా?
- కరోనావైరస్ మీద విజయం సాధించామన్న చైనా మాటలను నమ్మవచ్చా?
- కరోనావైరస్: మేడిన్ ఆంధ్రప్రదేశ్ టెస్టింగ్ కిట్లు.. పీపీఈలు, వెంటిలేటర్లు, మాస్కుల్ని కూడా ఉత్పత్తి చేస్తున్న ఏపీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









