దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: సాయంత్రం 6.30 గంటల వరకూ 55.18 శాతం ఓటింగ్ నమోదు

దిల్లీ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 6.30 గంటల వరకూ 55.18 శాతం ఓటింగ్ నమోదైంది.

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల కమిషన్ 11 జిల్లాల్లో ఓటింగ్ శాతం గణాంకాలను జారీ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

దిల్లీలో ఇప్పటివరకూ జరిగిన పోలింగ్ గణాంకాల ప్రకారం ఈశాన్య జిల్లాల్లో అత్యధిక ఓటింగ్ జరిగింది. సెంట్రల్ జిల్లాలో అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది.

సాయంత్రం 4 గంటల వరకూ 42.70 శాతం ఓటింగ్ నమోదైంది

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకూ 28.14 శాతం ఓటింగ్ నమోదైంది.

దిల్లీ ఎన్నికలు

ఫొటో సోర్స్, AFP

దిల్లీ ఎన్నికల పోలింగ్ రోజున సీఎం కేజ్రీవాల్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మధ్య ట్విటర్ యుద్ధం నడిచింది.

మొదట స్మృతి ఇరానీ కేజ్రీవాల్‌ను మహిళా వ్యతిరేకిగా చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అరవింద్ కేజ్రీవాల్ ఓటింగ్ రోజున ప్రత్యేకంగా మహిళలకు ఓట్ల వేయాలని అపీల్ చేశారని, మహిళలు ఎవరికి ఓటు వేయాలో స్వయంగా నిర్ణయం తీసుకోలేనంత అసమర్థులా అని ట్వీట్ చేశారు. దానితోపాటూ మహిళావ్యతిరేకి కేజ్రీవాల్ అనే హాష్‌టాగ్ పెట్టారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

దీనికి జవాబిచ్చిన కేజ్రీవాల్ దిల్లీ మహిళలు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకున్నారని, మొత్తం దిల్లీలో ఈసారీ తమ కుటుంబంలో ఓట్లు ఎవరికి వేయాలో మహిళలే నిర్ణయించారని, అయినా ఇల్లు వారే నడిపించాల్సి ఉంటుంది అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అడ్వాణీ, తన కుమార్తె ప్రతిభా అడ్వాణీతో కలిసి ఔరంగజేబ్ లైన్‌లో ఓటు వేశారు.

బాలీవుడ్ నటి తాప్సీ పన్ను తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

తర్వాత ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసత్, పన్నూ ఫామిలీ ఓటు వేసింది. మరి మీరు? అని పోస్ట్ చేశారు.

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కేజ్రీవాల్ తన కుటుంబంతో సహా ఓటు వేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్మాణ్ భవన్(న్యూ దిల్లీ)లో ఓటు వేశారు. ఆమెతోపాటు ప్రియాంక గాంధీ కూడా కనిపించారు.

దిల్లీ ఎన్నికలు

ఫొటో సోర్స్, Ani

తర్వాత ప్రియాంక గాంధీ, భర్త రాబర్ట్, కొడుకు రేహాన్‌తో కలిసి దిల్లీలోని లోదీ ఎస్టేట్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, భార్యతో కలిసి న్యూ దిల్లీ అసెంబ్లీ స్థానం కోసం ఓటు వేశారు.

దిల్లీ

ఫొటో సోర్స్, Getty Images

మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు

మొత్తం 70 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన 672 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

మొత్తం 13,750 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఉదయం 8 నుంచి సాయంత్రం 6 మధ్య పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

దిల్లీ అసెంబ్లీలో 70 సీట్లకు 58 జనరల్ కేటగిరీ సీట్లు, 12 ఎస్సీ రిజర్వుడ్ సీట్లు ఉన్నాయి.

ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

మొత్తం 1.47కోట్ల మంది ఓటర్లు నగరంలో ఉన్నారని దిల్లీ ఎన్నికల సంఘం తెలిపింది. అందులో 80.55 లక్షల మంది పురుషులు కాగా, 66.35లక్షల మంది స్త్రీలున్నారు.

90వేల మందికి పైగా పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు.

దిల్లీ గత ఎన్నికల ఫలితాలు

ఈసారి ఎన్నికల్లో సాంకేతికతను విరివిగా ఉపయోగిస్తున్నారు. మొత్తం ఓటర్ల జాబితాను ఆన్‌లైన్‌లో పెట్టడంతో పాటు, బూత్ స్థాయి మొబైల్ అప్లికేషన్లు, క్యూఆర్ కోడ్‌లతో అనుసంధానం చేసిన ఓటర్ స్లిప్‌లను సైతం ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది.

వోటర్లు తొలిసారిగా తమ ఫొటోతో కూడిన ఓటింగ్ స్లిప్‌లను కూడా 'వోటర్ హెల్ప్‌లైన్' అప్లికేషన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే ఏర్పాట్లు చేసింది.

ఈ ఎన్నికల్లో భారత ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని ప్రవేశపెడుతోందని సునీల్ అరోరా చెప్పారు.

శారీరకపరమైన ఇబ్బందులు, తప్పనిసరి పరిస్థితుల వల్ల పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఎన్నికల్లో పాల్గొనలేని ఓటర్ల కోసం గైర్హాజరీ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపారు.

దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన పెద్దవారు కావాలంటే పోస్టల్ బ్యాలెట్ విధానంలో కూడా ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చునని వివరించారు.

పోలింగ్ ముగిసిన అనంతరం వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెలువడతాయి.

ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌లు ఎన్నికల్లో ప్రధాన పోటీదార్లుగా ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించగా, బీజేపీ, కాంగ్రెస్‌లు సీఎం అభ్యర్థి పేరును వెల్లడించలేదు.

దిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ 'న్యూ దిల్లీ' అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది. 70లో 67 సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకోగా, బీజేపీకి 3 సీట్లు దక్కాయి.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)