CAB: పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

ఫొటో సోర్స్, PTI
పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బుధవారం రాత్రి జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 125 మంది సభ్యులు ఓటు వేయగా, 105 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.
ఈ బిల్లుకు లోక్‌సభ ఇప్పటికే ఆమోదం తెలిపింది. దీంతో, పౌరసత్వం సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించినట్లయింది.
పౌరసత్వ సవరణ బిల్లును హోం మంత్రి అమిత్ షా బుధవారం ఉదయం సభలో ప్రవేశపెట్టారు.
సభలో బిల్లుపై జరిగిన చర్చకు బదులిస్తూ అమిత్ షా, "నెహ్రూ-లియాఖత్ ఒప్పంద స్ఫూర్తిని పొరుగుదేశం విస్మరించిందని, ఆ పర్యవసానంగానే పౌరసత్వ సవరణ బిల్లు-2019ని తీసుకురావలసి వచ్చింది" అని అన్నారు.
లోక్‌సభలో బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన శివసేన రాజ్యసభలో ఓటింగ్‌కు దూరంగా ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అంతకముందు బిల్లుపై సభలో సుదీర్ఘంగా చర్చజరిగింది, బిల్లులోని అంశాలపై సభ్యులు 13 సవరణలను ప్రతిపాదించారు. కొన్ని అంశాలపై డివిజన్‌కు పట్టుబట్టారు.
బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలా వద్దా అనేదానిపై నిర్వహించిన ఓటింగ్‌లో వద్దని 113 మంది సభ్యులు, పంపాలని 92 మంది సభ్యులు ఓటు వేశారు.
సభ్యులు ప్రతిపాదించిన కొన్ని సవరణలను సభ మూజువాణి ఓటుతో తిరస్కరించింది.
దీంతో పౌరసత్వ సవరణ బిల్లుకు ఉభయ సభల్లో ఆమోదం లభించినట్లయింది.
బిల్లు ఆమోదం పొందిన అనంతరం సభ వాయిదా పడింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
బిల్లు ఆమోదం పొందిన అనంతరం ప్రధాని మోదీ ‘‘భారత చరిత్రలో ఈరోజు ఒక మైలురాయి. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడం ఆనందంగా ఉంది. బిల్లుకు అనుకూలంగా ఓటువేసిన ఎంపీలందరికీ కృతజ్ఞతలు. అనేక ఏళ్లుగా హింసకు గురైనవారికి ఈ బిల్లు ఉపశమనం కలిగిస్తుంది’’ అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
‘ఈ బిల్లు ఆమోదం పొందడంతో కోట్లాది మంది అణగారిన వారి కలలు ఇప్పుడు నెరవేరినట్లయింది. బాధిత ప్రజలకు గౌరవం, భద్రత కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
'ఈ బిల్లు ఆమోదం భారత్‌లోని సంకుచిత మనస్తత్వం, మూర్ఖపు శక్తుల విజయాన్ని సూచిస్తుంది. భారత రాజ్యాంగానికి ఇది చీకటి రోజు' అని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొనట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

ఫొటో సోర్స్, Rs tv
అంతకుముందు, బిల్లుపై చర్చ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు తమ పార్టీ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను గౌరవించడాన్ని నమ్ముతుంది. ఆంధ్రప్రదేశ్‌కు నేతృత్వం వహిస్తున్న మా నేత జగన్మోహన్ రెడ్డి కులమతాలకు అతీతంగా పారదర్శక ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.
కానీ, ఎవరైతే పొరుగు దేశాల్లో వేధింపులకు, హింసకు గురై ఇక్కడికి వచ్చారో, తిరిగి వెళ్లలేని పరిస్థితుల్లో శాంతియుత జీవితం గడపాలనుకుంటున్నారో వారికి పౌరసత్వం కల్పించడం సబబే అని తమ పార్టీ భావిస్తోందని చెప్పారు.
దేశంలో ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ వల్లే ఎక్కువ అన్యాయం జరిగిందని విజయసాయిరెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ హయాంలో షాబానో కేసును ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Rs tv
కనకమేడల
ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ బిల్లుకు తమ పార్టీ ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
"పాకిస్తాన్‌లో ఉన్న హిందువులు, సిక్కులు అక్కడ జీవించలేమని భావిస్తే, తిరిగి భారత్‌కు రావచ్చని మహాత్మా గాంధీ 1947 సెప్టంబర్ 26న వారికి భరోసా ఇచ్చారు. అలా వచ్చినవారికి ఇక్కడ జీవించగలిగేలా, ఉద్యోగాలు చేసుకునేలా పరిస్థితులు కల్పించడం భారత ప్రభుత్వం మొదటి కర్తవ్యం అన్నారు" అని కనకమేడల చెప్పారు.
అయితే, దేశంలో ముస్లింలకు తగిన రక్షణ, భద్రత కల్పిస్తామని హోంమంత్రి భరోసా ఇవ్వాలని కోరారు. బిల్లు పేరుతో ముస్లింల పట్ల వివక్షకు తావులేకుండా చూడాలని. వారికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఫొటో సోర్స్, Rs tv
కె.కేశవరావు
పౌరసత్వ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ కోరింది.
"ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి, దీనిపై రెండో అభిప్రాయమే ఉండకూడదు అని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు అన్నారు.
ఈ బిల్లుతో తాము ఈ దేశంలో పౌరులం కాదేమో అనే భయంతో కొందరు ఉన్నారని చెప్పారు.
మతపరంగా మైనార్టీలుగా ఉన్నవారిని రక్షించుకోవాలని, ఏ ఒక్క వర్గాన్నీ వెలివేయకూడదని అన్నారు.
మతం ఆధారంగా దేశ విభజన జరిగిందన్న ఐడియాను తాను నమ్మడం లేదన్నారు.

ఫొటో సోర్స్, Ani
కపిల్ సిబల్
పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ అన్నారు.
రాజ్యసభలో బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో "హోంమంత్రి అమిత్ షా చరిత్ర ఎక్కడ చదువుకున్నారో తనకు అర్థం కావడం లేదని, 'టూ నేషన్ థియరీ' కాంగ్రెస్‌ది కాదని' ఆయన అన్నారు.
"2014 నుంచి బీజేపీ ఒక ప్రత్యేక లక్ష్యంతో పనిచేస్తోందని, ఒకసారి లవ్ జీహాద్, ఇంకోసారి ఎన్ఆర్సీ, మరోసారి పౌరసత్వ సవరణ అంటోందని సిబల్ ఆరోపించారు.
"ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని హోంమంత్రి చెబుతున్నారు, భారత్‌లో ఏ ముస్లిం మిమ్మల్ని చూసి భయపడడు. నేను భయపడను, ఈ దేశ పౌరులు భయపడరు. మేం భయపడితే రాజ్యాంగాన్ని చూసి భయపడతాం. మీరు దాన్నే భ్రష్టు పట్టిస్తున్నారు" అని కపిల్ సిబల్ అన్నారు.

ఫొటో సోర్స్, Rstv
పి.చిదంబరం
అంతకు ముందు కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం పౌరసత్వ సవరణ బిల్లు గురించి ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు వేశారు. ప్రభుత్వంలోని బాధ్యతాయుతమైన ఏ వ్యక్తి అయినా వాటికి సమాధానం ఇవ్వవచ్చని అన్నారు.
"ఈ బిల్లు పార్లమెంటు ముఖంపై కొట్టడం లాంటిది. దీని ద్వారా రాజ్యాంగవిరుద్ధమైన చర్యలు తీసుకోవాలని పార్లమంటును కోరుతున్నారు" అని చిదంబరం అన్నారు.
దేశ అటార్నీ జనరల్ అయినా, వేరే ఏ అధికారి అయినా, ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన వ్యక్తి అయినా తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వచ్చని ఆయన చెప్పారు.
చిదంబరం ప్రశ్నలు
- పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ మాత్రమే ఎందుకు?
- శ్రీలంకలోని హిందువులు, భూటాన్‌లోని క్రైస్తవులను ఎందుకు చేర్చలేదు?
- మతాన్ని బిల్లుకు ప్రాతిపదికగా ఎందుకు చేశారు?
- కేవలం ఆరు మతాల వారినే ఇందులో ఎలా చేర్చారు?
- ఇస్లాంను ఎందుకు చేర్చలేదు, క్రైస్తవులు, యూదులను ఎందుకు చేర్చారు?
ఈ బిల్లు ఆర్టికల్ 14 మూడు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం లేదా. ఇది సమానత్వం అనే ప్రాథమిక హక్కు ఉల్లంఘన కాదా అని చిదంబరం ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Pti
అమిత్ షా సమాధానం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ దేశ విభజన తర్వాత ఏర్పడిన పరిస్థితులు వల్లే బిల్లు తీసుకురావాల్సి వచ్చిందని చెప్పారు.
భారత్ మాట నిలబెట్టుకుందని, కానీ దాని మూడు పొరుగు దేశాలు ఆ మాటను నిలబెట్టుకోలేకపోయాయని అన్నారు.
నెహ్రూ-లియాకత్ అలీ ఒప్పందాన్ని పొరుగు దేశాలు పాటించలేదని భావించిన అమిత్ షా, ఏది గాయపరిచిందో, అదే ఇప్పుడు ఆ గాయాల గురించి అడుగుతోందని కాంగ్రెస్‌పై ఆరోపణలు చేశారు.
"ఆరు మతాల వారిని బిల్లులోకి తీసుకొచ్చాం. కానీ ముస్లింలను ఎందుకు చేర్చలేదని ప్రశ్నిస్తున్నారు. ముస్లింలను ఎందుకు బిల్లులో చేర్చలేదో చెప్పాలని నేను అనుకుంటున్నాను" అన్నారు.
"ఈ బిల్లు ఏ మూడు దేశాల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కున్నారో, వారికి పౌరసత్వం ఇవ్వడం కోసమే తీసుకొచ్చాం".
"మైనారిటీ అనే మాటను ఉపయోగించినప్పుడు, విపక్షంలో కూర్చున్నవారు మాట్లాడుతుంటారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లో ఇస్లాంను విశ్వసించేవారు మైనారిటీలా ఏంటి?. దేశ మతం ఇస్లాం అయితే ముస్లింలపై వేధింపులు తక్కువే ఉంటాయి".
"ముస్లింలు రావడం వల్లే లౌకికవాదం నిరూపితమవుతుందా. మేం మా వివేకంతో చట్టాలు చేస్తున్నాం. కోర్టులో కూడా అదే నిరూపితమవుతుందని నాకు నమ్మకం ఉంది" అని అమిత్ షా చెప్పారు.
"మైనారిటీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరి నుంచీ పౌరసత్వం లాక్కోవడం జరగదు. మతపరంగా వేధింపులు ఎదుర్కున్న వారికి పౌరసత్వం అందిస్తాం" అని హోంమంత్రి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- బాలికపై అత్యాచారం: డబ్బు కోసం కూతురిని రెండేళ్ళుగా రేప్ చేయించిన తండ్రి
- 'గోల్డెన్ పాస్‌పోర్టుల' కోసం సంపన్నులంతా ఎందుకు ఎగబడుతున్నారు?
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన బారత్
- విమానంలో ప్రయాణికురాలిని తేలు కుట్టింది
- ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి తెలంగాణలో రేప్ నిందితుల వరకు.. ఎన్కౌంటర్లలో నిజమెంత
- పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్‌కు
- బిల్లా, రంగా ఎవరు.. వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









