కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాహుల్ గాంధీ ట్విటర్లో వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేయడాన్ని తనకు దక్కిన గౌరవంగా ఆయన వ్యాఖ్యానించారు.
కొంతకాలంగా రాహుల్ రాజీనామాపై కాంగ్రెస్‌లో అంతర్గతంగా చాలా చర్చ జరుగుతోంది. తాను పదవి నుంచి తప్పుకుంటానని రాహుల్ ప్రకటించినప్పటికీ, పార్టీలోని సీనియర్లు, ఇతర నాయకులు ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగాలని ఒత్తిడి తెస్తున్నప్పటికీ, రాహుల్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేరని కథనాలు వచ్చాయి.
ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి తాను బాధ్యత వహిస్తూ, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు.
"పార్టీ అభివృద్ధి కోసం బాధ్యత తీసుకోవడం తప్పనిసరి. అందుకే రాజీనామా చేస్తున్నా" అని రాహుల్ వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
లేఖలో రాహుల్ ఇంకా ఏమన్నారంటే...
తదుపరి అధ్యక్షుడిని నామినేట్ చేయాల్సిందిగా చాలామంది నన్ను కోరారు. కానీ నేను ఆ పని చేయడం సరికాదు. మా పార్టీకి ఎంతో ఘనమైన చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. ధైర్యంగా పార్టీని నడపగల వ్యక్తి ఎంపికలో పార్టీ సరైన నిర్ణయం తీసుకోగలదని నేను నమ్ముతున్నా.
కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని రాజీనామా చేసిన వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని కోరాను. వాళ్లకు ఆ సామర్థ్యం ఉంది, వారికి నా పూర్తి సహకారం ఉంటుంది.
నా పోరాటం అధికారం కోసం కాదు. అలాగని బీజేపీపై ద్వేషం, కోపం కూడా లేవు. కానీ నా శరీరంలోని ప్రతి అణువూ దేశం గురించి బీజేపీ సిద్ధాంతాలను, ఆలోచనలను వ్యతిరేకిస్తుంది.
ఈ పోరాటం కొత్తది కాదు. ఇది మన భూమిపై వేలాది సంవత్సరాల నుంచి జరుగుతోంది.
వారు వ్యత్యాసాలు చూస్తున్న చోట నేను సారూప్యత చూస్తున్నాను. వారు ద్వేషం చూస్తున్న చోట నేను ప్రేమను చూస్తున్నాను. వాళ్లు భయపడేదాన్ని, నేను హత్తుకుంటున్నాను.
ఈ ఆలోచన లక్షల ప్రజల మనసుల్లో వ్యాపించాలి. భారతదేశంలోని ఈ ఆలోచనను ఇప్పుడు మనం రక్షించాలి.

ఫొటో సోర్స్, @RAHULGANDHI
నేను ఈ పోరాటం నుంచి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నేను కాంగ్రెస్ పార్టీలోని నమ్మకమైన సైనికుడిని. అంకితభావం ఉన్న భారతదేశ పుత్రుడిని.
నా తుది శ్వాస వరకూ దేశాన్ని రక్షించుకునేందుకు నేను పోరాటం కొనసాగిస్తాను.
మేం ఒక బలమైన, గౌరవప్రదమైన ఎన్నికల్లో పోటీ చేశాం. మేం దేశంలోని ప్రజలు, మతాలు, సమాజాలు అందరినీ గౌరవిస్తూ ప్రచారం చేశాం.
నేను వ్యక్తిగతంగా ప్రధానితో, ఆరెస్సెస్‌తో, వారి అధీనంలో ఉన్న సంస్థలతో పోరాటం చేశాను. నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టే ఆ పోరాటం చేశాను.
భారతదేశంలో ఆదర్శాలను రక్షించుకోడానికి నేను పోరాటం చేశాను. కొన్నిసార్లు నేను పూర్తిగా ఒంటరిగా నిలిచాను. దానికి చాలా గర్వపడుతున్నాను.
నేను నా పార్టీ కార్యకర్తల నుంచి, పార్టీ సభ్యుల నుంచి, వారి సాహసం, అంకితభావం నుంచి చాలా నేర్చుకున్నాను.

ఫొటో సోర్స్, @RAHULGANDHI
పూర్తిగా స్వతంత్రంగా, పరిశుభ్రంగా జరిగే ఎన్నికల కోసం దేశంలోని సంస్థలు నిష్పక్షపాతంతో ఉండడం తప్పనిసరి. అన్ని ఆర్థిక వనరులను ఒకే పార్టీ నియంత్రణలో ఉన్నంత వరకు దేశంలో ఎన్నికలు స్వతంత్రంగా జరగవు.
మేం 2019లో ఒక రాజకీయ పార్టీనే ఎదుర్కోలేదు. దానికి బదులు మేం భారత ప్రభుత్వంలోని మొత్తం యంత్రాంగాన్ని ఎదుర్కుని పోరాడాం. ప్రతి సంస్థనూ విపక్షానికి వ్యతిరేకంగా ఉపయోగించుకున్నారు.
భారత సంస్థల ఏ నిస్పాక్షికత గురించి మనం ప్రశంసిస్తూ వచ్చామో, అది ఇప్పుడు లేదని పూర్తిగా స్పష్టమైంది.
దేశంలోని అన్ని సంస్థలను చేతుల్లోకి తీసుకోవాలన్న ఆరెస్సెస్ ఉద్దేశం ఇప్పుడు నెరవేరింది.
మన ప్రజాస్వామ్యం ఇప్పుడు ప్రాథమిక స్థాయిలో బలహీనం చేశారు.
ఇక్కడ అతిపెద్ద ప్రమాదం ఏదంటే, ఒకప్పుడు భారతదేశ భవిష్యత్తును నిర్ణయించిన ఎన్నికలు ఇప్పుడు కేవలం ఒక ఆచారంగా మారాయి.
అధికారం చేజిక్కించుకున్న ఫలితంగా భారతదేశం ఊహించలేని స్థాయిలో హింస, బాధ భరించాల్సి ఉంటుంది.
మన దేశ ఆర్థిక వ్యవస్థ, రుణాలపై కూడా దీని చెడు ప్రభావం పడుతుంది.
ప్రధాన మంత్రి ఈ విజయంతో ఆయన అవినీతి ఆరోపణల నుంచి విముక్తి పొందలేదు.
ఎవరు ఎంత డబ్బైనా ఖర్చు చేయనీ, ఎంత ప్రాపగాండా చేసినా, సత్యం వెలుగును అడ్డుకోలేరు.
దేశంలోని సంస్థలను మళ్లీ దక్కించుకోడానికి, వాటిలో తిరిగి జీవం నింపడానికి మొత్తం భారతదేశం ఒకటి కావాలి. ఈ సంస్థలను కాంగ్రెస్ పార్టీ మాత్రమే తిరిగి నిలబెట్టగలదు.
కీలకమైన ఈ పని చేయడానికి కాంగ్రెస్ పార్టీ స్వయంగా కఠిన మార్పులు తీసుకురావాలి.
ఇప్పుడు బీజేపీ పక్కా ప్రణాళిక ప్రకారం భారత ప్రజల గొంతు నొక్కేస్తోంది. ఆ గొంతులను కాపాడడం కాంగ్రెస్ పార్టీ కర్తవ్యం.
ఫరూఖ్ అబ్దుల్లా అభినందనలు
రాహుల్‌ను రాజీనామా నిర్ణయాన్ని ఫరూఖ్ అబ్దుల్లా అభినందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నందుకు ఆయనకు అభినందనలు. ఆయన యువకుడు. భవిష్యత్‌లో అధ్యక్షుడయ్యే అవకాశం మళ్లీ రావచ్చు. ఆ స్థానంలో వేరే వ్యక్తి ఉండాలనే ఆయన ఎప్పుడూ కోరుకున్నారు. ఎన్నికల్లో ఓటమే ఈ నిర్ణయానికి కారణమని నేను చెప్పలేను. ఇక ఇప్పుడు ఆయన పార్టీ అభివృద్ధికోసం పనిచేయవచ్చు" అని ఫరూఖ్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి.
- భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో సందడి చేసిన బామ్మ
- India Vs Bangladesh: ప్రపంచ కప్ సెమీస్‌లో భారత్... బంగ్లాదేశ్‌పై 28 పరుగుల తేడాతో విజయం
- అచ్చంగా 1992లో మాదిరిగా ఆడుతున్న పాకిస్తాన్ మళ్ళీ కప్ కొడుతుందా...
- గురు గోల్వల్కర్ : 'విద్వేష' దూతా లేక 'హిందూ జాతీయవాద' ధ్వజస్తంభమా...
- ఒక్క అంతర్జాతీయ వన్డే కూడా ఆడలేదు.. కానీ, వరల్డ్‌కప్ జట్టులో చోటు.. ఎవరీ మయాంక్ అగర్వాల్
- మహిళలపై చేసిన వ్యాఖ్యలకు దలైలామా క్షమాపణ
- ఇంగ్లండ్‌లో పుట్టి పెరిగిన భారత సంతతివారు కూడా ఆ జట్టుకు మద్దతు ఇవ్వట్లేదు
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








