లోక్‌సభ ఎన్నికలు 2019: కష్టకాలంలో కాంగ్రెస్ చూపు దక్షిణాది వైపు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారి తమ కంచుకోట అమేఠీతో పాటు మరో స్థానం నుంచి కూడా పోటీకి సిద్ధమవడం రాజకీయంగా చర్చకు తెరతీసింది.
అమేఠీలో గెలుపుపై నమ్మకం లేకపోవడంతోనే ఆయన ఈసారి దక్షిణాదిపై కన్నేశారని బీజేపీ సహా పలు ఇతర పార్టీలు విమర్శలు కురిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఆయన కేరళ రాష్ట్రం వాయనాడ్ నుంచి పోటీకి నిర్ణయించుకోవడంతో ఇందిరాగాంధీ మొదలుకుని ఆమె వారసులు ఎన్నికల క్షేత్రంలో తమకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన ప్రతిసారీ దక్షిణాదిపైనే ఆధారపడుతున్నారన్న వాదనా వినిపిస్తోంది.
గతాన్ని పరిశీలిస్తే ఈ వాదనకు బలం చేకూర్చే సందర్భాలూ కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇందిరాగాంధీతోనే మొదలు
1977 వరకు 'నెహ్రూ-గాంధీ' కుటుంబానికి ఎన్నికల క్షేత్రమంటే ఉత్తరప్రదేశే. రాహుల్ గాంధీ నాన్నమ్మ ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి గెలుస్తూ వచ్చారు. కానీ, 1977లో తొలిసారి ఆమె రాయ్‌బరేలీలో రాజ్‌నారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు.
కానీ, ఏడాదిలోనే మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టారు. కర్నాటకలోని చిక్‌మగుళూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆమె పోటీ చేసేందుకు వీలుగా అక్కడి సిటింగ్ కాంగ్రెస్ ఎంపీ డీబీ చంద్రగౌడ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. దాంతో ఇందిర అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఆ రకంగా తొలిసారి నెహ్రూ-గాంధీ కుటుంబం దక్షిణాది నుంచి పోటీ చేసి గెలిచింది.
ఆ తరువాత 1980 ఎన్నికల వేళ ఆమె జాగ్రత్త పడ్డారు.
ఆ ఎన్నికల్లో ఆమె రాయబరేలీతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్(ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉంది) పార్లమెంటు స్థానం నుంచి బరిలో దిగారు. రెండు చోట్లా విజయం సాధించారు.
మెదక్‌నే ఎందుకు ఎంచుకున్నారంటే..
కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన రాయ్‌బరేలీలో 1977లో ఇందిర ఓటమే అక్కడ ఆ పార్టీకి తొలి ఓటమి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగినన్ని సీట్లు రాకపోవడంతో జనతా పార్టీ నేతృత్వంలో తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
కానీ, అది ఎక్కువ కాలం కొనసాగలేదు. దీంతో 1980లో మధ్యంతర ఎన్నికలొచ్చాయి. 1977 నేర్పిన ఓటమి అనుభవంతో ఇందిర రాయ్‌బరేలీతో పాటు మరో సురక్షిత స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం సూచించింది.
దక్షిణాది నుంచి పోటీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అప్పటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న మర్రి చెన్నారెడ్డి, ఇతర నేతలు మెదక్ పేరు ఆమెకు సూచించారు.
మెదక్ కూడా అప్పటికి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాంటి నియోజకవర్గమే. 1952లోని తొలి ఎన్నికల్లో అక్కడ పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్-హైదరాబాద్) అభ్యర్థి విజయం సాధించినా ఆ తరువాత వరుసగా మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. 1971 ఎన్నికల్లో మాత్రం తెలంగాణ ప్రజాసమితి(టీపీఎస్) నుంచి డాక్టర్ మల్లికార్జున్ గెలిచారు. టీపీఎస్ అనేది కాంగ్రెస్ నేత మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ఏర్పడిన పార్టీయే. అనంతరం చెన్నారెడ్డి కాంగ్రెస్‌లోనే కలవడంతో ఆ నియోజకవర్గంలో మళ్లీ ఎప్పటిలా కాంగ్రెస్ బలపడింది. ఆయన వర్గానికే చెందిన మల్లికార్జున్ కూడా కాంగ్రెస్‌లోనే చేరి 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేశారు.
దీంతో 1977 ఎన్నికల్లో దేశమంతా కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీచిన సమయంలో కూడా మెదక్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది.
అందుకే మెదక్‌ను అత్యంత సురక్షిత స్థానంగా భావించి ఇందిర అక్కడి నుంచి బరిలో దిగారు.
రాయ్‌బరేలీలో ఇందిరాగాంధీకి సుమారు 7 వేల ఆధిక్యం రాగా మెదక్‌లో 2 లక్షలకు పైగా ఆధిక్యం లభించింది. ఆమె రాయ్‌బరేలీని వదులుకుని మెదక్‌కు ప్రాతినిధ్యం వహించారు.

ఫొటో సోర్స్, Getty Images
సోనియా గాంధీదీ అదే సమస్య
ఇందిరా గాంధీ మెదక్ నుంచి గెలిచిన సుమారు రెండు దశాబ్దాలకు మళ్లీ ఆ కుటుంబం మరోసారి దక్షిణాది నుంచి పోటీ చేసింది.
1999లో ఇందిర కోడలు సోనియా గాంధీ ఎన్నికల రాజకీయాల్లో అడుగుపెట్టారు.
ఆమె కూడా తమ కుటుంబానికి అచ్చొచ్చిన అమేఠీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ, అప్పటికి అమేఠీలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లేదు. అందుకు కారణం 1998 ఎన్నికల్లో అక్కడ బీజేపీ విజయం సాధించడమే.
దీంతో సోనియా అమేఠీతో పాటు ఇంకెక్కడైనా పోటీ చేయాలనుకున్నారు. దక్షిణాదిలోని కర్నాటక రాష్ట్రం బళ్లారిని ఎంచుకున్నారు.
బళ్లారే ఎందుకు
బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఆ తరువాత కర్నాటక రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట.
1999కి ముందు ఒక్కసారి కూడా అక్కడ కాంగ్రెస్‌కు ఓటమి అనేదే లేదు. దాంతో బళ్లారిని మించిన సురక్షిత స్థానం లేదన్న అంచనాతో సోనియా అక్కడి నుంచి బరిలో దిగారు.
సోనియా అక్కడి నుంచి బరిలో దిగడంతో భారతీయ జనతా పార్టీ ఆమెను ఎదుర్కొనేందుకు సుష్మా స్వరాజ్‌ను రంగంలో దించింది.
కాంగ్రెస్ పార్టీ అంచనాలు ఫలించి కంచుకోటలాంటి బళ్లారి నుంచి సోనియా గాంధీ 56 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
అయితే, ఆమె అమేఠీకే ప్రాధాన్యమిస్తూ బళ్లారిని వదులుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడు రాహుల్ గాంధీ
సోనియా బళ్లారి నుంచి గెలిచిన మరో రెండు దశాబ్దాలకు ఆమె తనయుడు రాహుల్ గాంధీ దక్షిణాది నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు.
తనకు 2004 నుంచి సుస్థిర స్థానంగా ఉన్న అమేఠీ బరిలో ఉన్నప్పటికీ, దాంతో పాటు కేరళలోని వాయనాడ్ నుంచీ పోటీ చేయాలని నిర్ణయించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, facebook/SmritiZubinIrani
అమేఠీపై అపనమ్మకం ఎందుకు?
2004లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి రాహుల్ గాంధీ అమేఠీలో వరుసగా గెలుస్తున్నారు.
అయితే, తొలి ఎన్నికల్లో 3 లక్షల 90 వేల ఓట్ల ఆధిక్యం, ఆ తరువాత 2009 ఎన్నికల్లో 4 లక్షల 64 వేల ఓట్ల ఆధిక్యం సాధించిన ఆయన గత 2014 ఎన్నికల్లో మాత్రం ఒక లక్ష 7 వేల ఓట్ల ఆధిక్యానికి పరిమితమయ్యారు.
పైగా 2014లో రాహుల్‌పై పోటీ చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయినా అమేఠీలో తరచూ పర్యటిస్తూ అక్కడ పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఆ కారణంగానే రాహుల్ ఓటమి భయంతో అమేఠీతో పాటు వాయనాడ్ నుంచి పోటికి సిద్ధమవుతున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం కేరళతోపాటు దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు రాహుల్ వాయనాడ్ బరిలోకి దిగుతున్నారని చెబుతోంది.
దక్షిణాది నుంచి రాహుల్ పోటీ చేయాలని అభ్యర్థనలు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోనీ వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
వాయనాడే ఎందుకు?
నియోజకవర్గాల పునర్విభజనతో 2008లో ఏర్పడిన వాయనాడ్ నియోజకవర్గం కేరళలో కాంగ్రెస్ సురక్షిత స్థానాల్లో ఒకటి.
2009, 2014 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంఐ షానవాజ్ విజయం సాధించారు. 2018లో ఆయన మరణంతో ఇక్కడ ఖాళీ ఏర్పడింది.
ఈ నియోజకవర్గంలో సీపీఐ రెండో స్థానంలో నిలుస్తూ వస్తుండగా బీజేపీకి ఎన్నడూ 10 శాతం ఓట్లు కూడా రాలేదు.
దీంతో వాయనాడ్‌ను సురక్షిత స్థానంగా భావించి కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మూడు రాష్ట్రాల నుంచి ముగ్గురు
ఇందిర, సోనియా గాంధీలు ఆంధ్రప్రదేశ్, కర్నాటకల నుంచి పోటీ చేయగా.. రాహుల్ ఈసారి కేరళను ఎంచుకున్నారు.
తమ కుటుంబానికి అచ్చొచ్చిన నియోజకవర్గాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ వారు దక్షిణాదికి వచ్చి పోటీ చేస్తున్నారు.
జాతీయ స్థాయి నేతలు దేశవ్యాప్తంగా తమ పార్టీకి ఊపు తెచ్చే క్రమంలో ఇలా రెండేసి చోట్ల పోటీ చేస్తుంటారని.. ఇది కొత్తేమీ కాదని.. గతంలో ఇందిరాగాంధీ, సోనియాలు కూడా ఆ క్రమంలోనే దక్షిణాది నుంచి పోటీ చేశారని సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు బండారు శ్రీనివాసరావు 'బీబీసీ'తో అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి నరేంద్ర మోదీ కూడా గుజరాత్ బయట పోటీ చేయడం చూశామన్నారు.
అయితే, ప్రస్తుతం రాహుల్ గాంధీ దక్షిణాది నుంచి పోటీ చేస్తున్న సందర్భంలో ఆయనకు గత ఎన్నికల్లో అమేఠీలో ఆధిక్యం తగ్గిన విషయం కూడా ప్రస్తావించదగినదేనన్నారు.
ఇందిర, సోనియాలు దక్షిణాది నుంచి పోటీ చేసిన సందర్భాల్లో విజయాలే సాధించారని ఆయన గుర్తు చేశారు. 1978 ఉప ఎన్నికల్లో చిక్‌మగుళూరు, 1980లో మెదక్‌ల నుంచి ఇందిరాగాంధీ.. 1999లో బళ్లారిలో సోనియాగాంధీ విజయాలు నమోదు చేసుకున్నారని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఈమెకు నెల రోజుల్లో రెండు కాన్పులు, ముగ్గురు పిల్లలు
- జనసేన పార్టీ అభ్యర్థులు వీరే
- పవన్ కల్యాణ్: జనసేన మేనిఫెస్టో ఇదే
- నిన్న ఒక పార్టీ.. నేడు మరో పార్టీ – ఏపీలో రంగులు మారుతున్న కండువాలు
- సిత్రాలు సూడరో: "జగన్ ఎప్పటికీ సీఎం కాలేరు.. కాబోయే ముఖ్యమంత్రి జగనే"
- ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూసుకోండి.. 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి
- పెళ్లికొడుకు మెడలో తాళి కట్టిన పెళ్లికూతురు.. ఎందుకిలా చేశారు? ఇది ఏమి ఆచారం?
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో...: ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








