అభినందన్‌ను పాకిస్తాన్ నుంచి భారత్‌కి ఎలా తీసుకురావచ్చు?

ఫొటో సోర్స్, DGISPR
- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ తమ అదుపులో ఉన్నాడని పాకిస్తాన్ చెబుతోంది. భారత్ కూడా పేరు చెప్పకుండా తమ ఒక పైలెట్ గల్లంతయ్యారని చెప్పింది.
పాకిస్తాన్ సైన్యం ఒక వీడియోలో ఒక భారత పైలెట్‌ను పాకిస్తాన్ సరిహద్దు లోపల అరెస్టు చేసినట్లు చెప్పింది.
ఆ వీడియోలో భారత వైమానిక దళ యూనిఫాం వేసుకున్న వ్యక్తికి కళ్లకు గంతలు కట్టి ఉన్నారు. ఆ వ్యక్తి తనను వింగ్ కమాండర్ అని, తన పేరు అభినందన్ అని చెప్పారు.
ఈ వ్యక్తి యూనిఫాంపై ఇంగ్లిష్‌లో ఆయన పేరు కూడా రాసుంది. ఆయన తన సర్వీస్ నంబర్ కూడా చెప్పారు.
ఆ వీడియోలో ఈ వ్యక్తిని మీరు పాకిస్తాన్ సైన్యం అదుపులో ఉన్నారా? అని కూడా ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, INFORMATION MINISTRY @TWITTER
కార్గిల్ యుద్ధ సమయంలో...
పాకిస్తాన్ అదుపులో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్‌ను ఇప్పుడు భారత్ ఎలా తీసుకువస్తారు, ఇంతకు ముందు కూడా ఇలా జరిగిందా అనే ప్రశ్న తలెత్తుతోంది.
కార్గిల్ యుద్ధ సమయంలో కూడా 26 ఏళ్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ లెఫ్టినెంట్ కె.నచికేతను పాకిస్తాన్ సైన్యం అదుపులోకి తీసుకుంది. తర్వాత ఆయన్ను భారత్‌కు అప్పగించింది.
కార్గిల్ యుద్ధం సమయంలో పాకిస్తాన్‌లో జి. పార్థసారధి భారత హైకమిషనర్‌గా ఉన్నారు.
పార్థసారధి 1963-1968 సమయంలో భారత సైన్యంలో అధికారిగా కూడా పనిచేశారు.
అప్పుడు నచికేత తిరిగి భారత్ ఎలా చేరుకున్నారో పార్థసారథి బీబీసీకి చెప్పారు.
"కార్గిల్ యుద్ధ సమయంలో ఫ్లైట్ లెప్ఠినెంట్ నచికేత మిగ్ ఎయిర్ క్రాఫ్ట్‌లో ఉన్నారు. ఆయనను నియంత్రణ రేఖను దాటవద్దని ఆదేశించారు. యుద్ధం జరుగుతున్న సమయంలో నచికేత మిగ్‌తో దాడులు చేశారు. కానీ కిందకు వచ్చినపుడు మిసైల్ ట్రాక్ ద్వారా ఆయన్ను కిందికి దించారు. పాకిస్తాన్ సైన్యం ఆయన్ను అదుపులోకి తీసుకుంది.
కొన్ని రోజుల తర్వాత నాకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి సందేశం వచ్చింది. ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ నచికేతను విడుదల చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.
"మేం ఆయన్ను విడుదల చేయాలని అనుకుంటున్నాం అన్నారు. నేను సరే, ఆయన్ను ఎక్కడ కలవాలి అన్నాను. దానికి నవాజ్ షరీఫ్ జిన్నా హాల్‌కు రండి అన్నారు".
నచికేత ఎలా తిరిగి వచ్చారు
"జిన్నా హాల్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్నట్టు నాకు తెలిసింది. దాంతో నేను ఆయన్ను మీరు నచికేతను తిరిగి అప్పగిస్తున్నప్పుడు అక్కడ మీడియా ఉంటుంది అన్నాను. దానికి ఆయన 'అవును' అన్నారు. దానికి నేను అది కుదరదని చెప్పాను. యుద్ధ ఖైదీలను విడుదల చేస్తున్న సమయంలో మీడియా ఉండడాన్ని నేను ఎప్పటికీ అంగీకరించను అని చెప్పాను.
ఇంటర్నేషనల్ మీడియా ముందు అతడిని అప్పగించడం కుదరదు అన్నాను. మీరు ఆయన్ను మాకు ప్రైవేటుగా అప్పగించాలని చెప్పాను. నేను దిల్లీకి కూడా ఈ విషయం చెప్పాను. అక్కడి నుంచి మీరు సరిగ్గానే చేశారని చెప్పారు
"నాకు పాకిస్తాన్ వైపు నుంచి మళ్లీ ఫోన్ వచ్చింది. ఆయన్ను ఎలా విడుదల చేయాలో మీరే చెప్పండి అన్నారు. నేను చూడండి మీపై మాకు నమ్మకం పోయింది అన్నాను. మీరు నచికేతను రాయబార కార్యాలయంలో వదిలేయండి. తర్వాత నేను ఆయన చార్జ్ తీసుకుంటాను అని చెప్పాను. తర్వాత నచికేతను ఏంబసీకి తీసుకొచ్చారు. అక్కడ నేను ఆయన చార్జ్ తీసుకున్నాను.
"రాత్రి నచికేతను ఎయిర్ కమాండర్ జశ్వాల్ ఇంట్లో ఉంచారు. తర్వాత రోజు నేను మీరు విమానంలో వెళ్లడం లేదు అని ఆయనకు చెప్పాను. నేను నచికేతను ఒక ఎయిర్ అటాచీ, ఒక నావీ అటాచీ( దౌత్య అంశాల్లో భాగంగా ఉండే వైమానిక దళం, నౌకాదళం అధికారులు)తో ఒక వాహనంలో పంపించాను.
వాఘా దగ్గర మన సైన్యానికి అప్పగించమని చెప్పాను. నచికేత ఒకటి రెండు వారాలు పాకిస్తాన్ అదుపులో ఉన్నారు" అని పార్థసారధి చెప్పారు.
1965 యుద్ధంలో నేను సియాల్‌కోట్‌లో ఉన్నాను. ఎవరైనా సైనికులు పాకిస్తాన్‌కు పట్టుబడితే, వారితో దురుసుగా ప్రవర్తించడం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అవుతుంది.
మీడియాలో పైలెట్ ఫొటో విడుదల చేయడం. వారి చేతులు కట్టేసిన వీడియో విడుదల చేయడం యుద్ధ విధానాలకు వ్యతిరేకం.
నచికేత విషయంలో పాకిస్తాన్ సైన్యం ఎలాంటి దుష్ప్రవర్తనకు పాల్పడలేదు.
భారత్ దగ్గర ఉన్న ఆప్షన్లేంటి
నచికేతను ఎలా విడుదల చేయించారో, అలాంటి చర్యలే చేపట్టాలి
పాకిస్తాన్ వైపు నుంచి దాడి జరిగింది. వారి విమానాన్ని కూల్చేశారు. కానీ వారు మాత్రం ఇప్పటివరకూ దాన్ని అంగీకరించలేదు.
మన పైలెట్ పాకిస్తాన్ అదుపులో ఉండడం ఇదే మొదటిసారి కాదు. దానికి నచికేత ఒక ఉదాహరణ.
ప్రభుత్వానికి ఏది సబబుగా అనిపిస్తుందో అలాంటి చర్యలు చేపట్టాలి. తగిన సమయం వచ్చినపుడు సహజంగానే దానిపై చర్చలు జరుగుతాయి.
రేపు ఉదయం చర్చలు జరపాలా, వద్దా అనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది.
యుద్ధఖైదీలకు జెనీవా కన్వెన్షన్ అమలవుతుంది. జెనీవా కన్వెన్షన్ ప్రకారం పాకిస్తాన్ వారితో మానవత్వంతో వ్యవహరించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- భారత్ దాడులకు బదులిచ్చే హక్కు మాకు ఉంది: పాకిస్తాన్
- ‘యుద్ధం వస్తుందన్న అనుమానంతో సరుకులు నిల్వ చేసుకుంటున్నారు’
- భారత్‌తో యుద్ధానికి ముందే ప్లాన్ వేసిన మావో?
- బంగ్లాదేశ్ యుద్ధంలో 'రా' చీఫ్ రామేశ్వర్నాథ్దే కీలక పాత్ర!
- EXCLUSIVE: అంబేడ్కర్ వీడియో ఇంటర్వ్యూ
- రిజర్వేషన్లు పదేళ్ళు మాత్రమే ఉండాలని అంబేడ్కర్ నిజంగానే అన్నారా?
- భారత్-రష్యా: ఆయుధాలు, మసాలాలు కాకుండా ఇంకేం ఇచ్చిపుచ్చుకుంటున్నాయి?
- డోక్లాం: భారత్, చైనా మధ్యలో భూటాన్! ఇంతకీ భూటాన్ ప్రజలేమనుకుంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








