తెలంగాణ ఎన్నికలు: 64 నియోజకవర్గాల్లో ఐదు శాతం కన్నా ఎక్కువ పెరిగిన ఓటింగ్

- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎన్నికల ఫలితాల కోసం తెలంగాణ రాష్ట్రం ఎదురుచూస్తోంది. గత ఎన్నికల కంటే ఈసారి 3.7 శాతం అధికంగా ఓటింగ్ నమోదవడంతో అది ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న అంచనాలు, విశ్లేషణలూ అంతటా వినిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా సగటు ఓటింగ్ పెరుగుదల 3.7 శాతమే అయినప్పటికీ నియోజకవర్గాలవారీగా చూసుకుంటే 75 నియోజకవర్గాల్లో ఈ సగటు కంటే ఎక్కువగా పెరుగుదల నమోదైంది.
10 నియోజకవర్గాల్లో 10 శాతం కంటే ఎక్కువ పెరుగుదల నమోదు కాగా అత్యధికంగా ఆదిలాబాద్‌లో 17.8 శాతం ఓటింగ్ పెరిగింది.
జహీరాబాద్, కరీంనగర్, కొడంగల్, నారాయణపేట్, దేవరకద్ర, అచ్చంపేట్, మక్తల్, వనపర్తి, నల్గొండ నియోజకవర్గాల్లోనూ ఓటింగ్‌లో పెరుగుదల 2014 కంటే 10 శాతం ఎక్కువ ఉంది.
9 నియోజకవర్గాల్లో ఓటింగ్‌లో పెరుగుదల 9 నుంచి 10 శాతం కనిపించింది.
45 నియోజకవర్గాల్లో 5 నుంచి 9 శాతం ఓటింగ్ పెరిగింది.
మొత్తంగా 64 నియోజకవర్గాల్లో ఓటింగ్‌లో పెరుగుదల 5 శాతం కంటే ఎక్కువ ఉంది.

15 చోట్ల తగ్గింది..
మొత్తం 15 నియోజకవర్గాల్లో 2014 కంటే ఈసారి ఓటింగ్ శాతం తగ్గింది.
ఇందులో 12 నియోజకవర్గాలు హైదరాబాద్ జిల్లాలోనివి కాగా రెండు రంగారెడ్డి జిల్లా, ఒకటి మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని నియోజకవర్గం. అత్యధికంగా చార్మినార్‌లో 16 శాతం తగ్గుదల నమోదైంది.
2014 ఎన్నికల్లో ఎంఐఎం గెలిచిన ఏడు స్థానాల్లోనూ ఇప్పుడు పోలింగ్ శాతం తగ్గింది.

జిల్లాలవారీగా..
పాత ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని ఎక్కువ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతంలో పెరుగుదల ఎక్కువగా ఉంది.
వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో ఒక మోస్తరుగా ఉండగా.. హైదరాబాద్‌లో మాత్రం మూడు మినహా మిగతా 12 చోట్లా ఓటింగ్ తగ్గింది.
నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతం పెరుగుదల ఇలా..
1) కుమరం భీం ఆసిఫాబాద్
2) మంచిర్యాల
3) ఆదిలాబాద్
4) నిర్మల్
5) నిజామాబాద్
6) కామారెడ్డి
7) జగిత్యాల
8) పెద్దపల్లి
9) కరీంనగర్
10) రాజన్న సిరిసిల్ల
11) సంగారెడ్డి
12) మెదక్
13) సిద్దిపేట్
14) రంగారెడ్డి
15) వికారాబాద్
16) మేడ్చల్ మల్కాజ్‌గిరి
17) హైదరాబాద్
18) మహబూబ్‌నగర్
19) నాగర్ కర్నూల్
20) వనపర్తి
21) జోగులాంబ గద్వాల
22) నల్గొండ
23) సూర్యాపేట్
24) యాదగిరి భువనగిరి
25) జనగామ
26) మహబూబాబాద్
27) వరంగల్ రూరల్
28) వరంగల్ అర్బన్
29) జయశంకర్ భూపాలపల్లి
30) భద్రాద్రి
31) ఖమ్మం
ఇవి కూడా చదవండి:
- ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
- గుత్తా జ్వాల ఓటు గల్లంతు
- బ్రేక్‌ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా?
- తెలంగాణ ముందస్తు ఎన్నికలు: విలీన మండలాల ఓటర్లు ఎటు?
- తెలంగాణ ఎన్నికలు: ప్రపంచ ఓటర్ల వేలిపై తెలంగాణ సిరా చుక్క
- తెలంగాణ ఎన్నికలు: “ప్రత్యేక రాష్ట్రం వస్తే పాతబస్తీ వెలిగిపోతుందన్నారు. కానీ హామీలే మిగిలాయి”
- ‘24 గంటల కరెంట్ మాకొద్దు’
- లువిస్ హామిల్టన్: ‘‘పూర్ ఇండియా’ వ్యాఖ్యలు భారత్ పట్ల సానుభూతితోనే..’
- ప్రవాసాంధ్రులు ఏపీకి పంపిస్తున్న డబ్బులు ఎంతో తెలుసా?
- బ్రెగ్జిట్: యురోపియన్ యూనియన్‌కు ‘విడాకులిస్తున్న’ బ్రిటన్... ఎందుకు? ఏమిటి? ఎలా?
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటీ? చేయకపోతే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








