గాంధీ కథ చెప్పిన రచయిత గుజరాత్‌లో ఎందుకు చదువు చెప్పలేకపోయారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక బిస్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మూడేళ్ల క్రితం ప్రముఖ చరిత్రకారుడు, దేశంలో అత్యంత గౌరవనీయ మేధావుల్లో ఒకరైన రామచంద్ర గుహ ఒక ఇంటర్వ్యూలో, ''భారతదేశంలో గతంలో కన్నా ఇప్పుడు అసహనం చాలా పెరిగిపోయింది'' అని వ్యాఖ్యానించారు.
ఆ సమయంలోనే ఇంట్లో పశు మాంసాన్ని దాచుకుని తింటున్నారన్న ఆరోపణల మీద ఒక 50 ఏళ్ల ముస్లింను మూకహత్య చేశారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ పశుమాంసంపై నిషేధం విధించింది.
దేశంలో మరో చోట ఇద్దరు ప్రముఖ హేతువాదుల హత్య జరిగింది.
''ఒక స్వతంత్ర దేశంగా పూర్తి భావ ప్రకటనా స్వేచ్ఛ కలిగిన చరిత్ర మనకు ఎన్నడూ లేదు'' అనేది గుహ అభిప్రాయం.
''రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు భయం కారణంగా నిరంతరం నిషేధాలు విధిస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు దేశంలో అసహనం మరింత పెరిగింది. అలాగే హింస కూడా'' అని అన్నారు గుహ.
ఆయన ఇప్పుడు గతంలో తాను పేర్కొన్న అసహనానికి తానే లక్ష్యంగా మారారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సుమారు 2 వారాల క్రితం ఆయన తాను అహ్మదాబాద్‌లోని ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో హ్యుమానిటీస్ ప్రొఫెసర్‌గా చేరబోతున్నట్లు ప్రకటించారు.
ఇదే యూనివర్సిటీలో నోబెల్ బహుమతి గ్రహీత వీఎస్ నైపాల్ జీవితచరిత్రను రాసిన ప్రముఖ చరిత్రకారుడు ప్యాట్రిక్ ప్రెంచ్ కూడా ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అయితే గురువారం గుహ, తన 'చేతుల్లో లేని కొన్ని పరిస్థితుల కారణంగా అక్కడ చేరబోవడం లేదు' అని ట్వీట్ చేశారు.
తాను మనసు మార్చుకోవడానికి గల కారణాలను మాత్రం ఆయన పేర్కొనలేదు. యూనివర్సిటీ యాజమాన్యం కూడా మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. దీంతో సహజంగానే దీనిపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాంధీ జీవితచరిత్రను రాసిన రచయితకే ఆ రాష్ట్రంలో బోధించే అవకాశం లేకపోవడంపై ఒక సీనియర్ జర్నలిస్టు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
గుజరాత్‌లోని మితవాద వర్గమే గుహను వేధించి, ఆయన ఆ పదవిలో చేరకుండా చేసినట్లు తెలుస్తోంది.
స్థానిక బీజేపీ విద్యార్థి సంఘానికి చెందిన నాయకుడు ఒకరు 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్'కు.. తాము అహ్మదాబాద్ యూనివర్సిటీ అధికారిని కలిసి, గుహ తమ విద్యాసంస్థలో బోధించడం తమకు ఇష్టం లేదని చెప్పినట్లు వెల్లడించారు.
''మా విద్యాసంస్థలలో మేధావులు కావాలి కానీ, జాతి వ్యతిరేకులు కాదు'' అని ఆ విద్యార్థి నేత అన్నారు. యూనివర్సిటీ అధికారికి గుహ పుస్తకాలలోని 'జాతి వ్యతిరేక భావాల'ను చూపించినట్లు తెలిపారు.
యూనివర్సిటీ అధికారికి ఇచ్చిన ఫిర్యాదులో.. గుహ రచనలు విభజన ధోరణులను ప్రోత్సహిస్తున్నాయని, వ్యక్తి స్వేచ్ఛ పేరిట దేశాన్ని చీలుస్తున్నారని, భారతదేశం నుంచి జమ్మూ కశ్మీర్‌ను విడదీస్తున్నారని పేర్కొన్నారు.
ఆయనను ఒక కమ్యూనిస్టు అని కూడా ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
గుహ ఒక సునిశితమైన చరిత్రకారుడు. ఆయన అర్థశాస్త్రంలో శిక్షణ పొందినా.. పర్యావరణం, క్రికెట్, స్వాతంత్ర్యానంతర భారతదేశం, ఇటీవల మహాత్మా గాంధీపై రెండు సంపుటాల జీవితచరిత్రను రాశారు.
ఆయన స్టాన్‌ఫోర్డ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లలో బోధించారు. తనకు భారతీయ శాస్త్రీయ సంగీతం తనకు ఇష్టమని చెప్పినా, బీటిల్స్ హే జూడ్ తనకు ఇష్టమైన పాటల్లో ఒకటని ఆయన అంటారు.
ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలమైన మేధావుల్లో ఆయన ఒకరని ప్రాస్పెక్ట్ పత్రిక పేర్కొంది.
రామచంద్ర గుహ హిందూ జాతీయవాద రాజకీయాల విమర్శకులు. అదే సమయంలో ఆయన వారసత్వ రాజకీయాలను కూడా విమర్శిస్తారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
గతంలో మితవాద సంస్థలు దిల్లీ యూనివర్సిటీ సిలబస్ నుంచి కవి, విద్యావేత్త ఏకే రామానుజన్ రామాయణం మీద రాసిన వ్యాసాన్ని తొలగించాలని డిమాండ్ చేశాయి.
హిందూ ఉగ్రవాదంపై కథనాన్ని ప్రచురించిన ఒక వార్తా పత్రికకు లీగల్ నోటీసులు పంపాయి. ప్రముఖ అమెరికన్ విద్యావేత్త వెండీ డోనిగర్ పుస్తకాన్ని ప్రచురించిన ఒక ప్రచురణ సంస్థ ఆ పుస్తకాన్ని వెనక్కి తీసుకుని, ఆ కాపీలను నాశనం చేసేలా ఒత్తిడి తెచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో ఉదారవాద విలువలను కాపాడిన చరిత్ర ఏ పార్టీకి లేదు. కానీ, చాలా మంది మోదీ సర్కార్ పాలనలో ఇదీ మరీ ఉచ్ఛదశకు చేరిందని భావిస్తున్నారు.
మెజారిటీవాదులు అసహనంతో విమర్శలు, భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసే వారిపై 'జాతివ్యతిరేకులు' అనే ముద్ర వేస్తున్నారు. దీని వల్ల దేశంలో ద్వేషం, అపనమ్మకం పెరిగిపోతున్నాయి. ఒక మేధావిని వేటాడి ఆయన తన పనిని తాను చేసుకోనివ్వకపోవడం చాలా ఆందోళన రేకెత్తించే విషయం.
ఇవి కూడా చదవండి
- 'రఫేల్ ఒప్పందాన్ని విమర్శించడం కాదు, ప్రశంసించాలి' : బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్
- మహారాష్ట్ర: 13 మందిని చంపిన ఆడ పులి కాల్చివేత
- ఖషోగ్జీని చంపింది సౌదీ ప్రభుత్వమే, కానీ సల్మాన్ ప్రమేయం ఉందనుకోను - టర్కీ
- కడుపులోని పసికందునూ కబళిస్తోన్న కాలుష్యం
- రాధ కోసం వెతుకుతున్నా - భార్యతో విడాకులు కావాలి: లాలూ తనయుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)