సూప్‌లో ఎలుక.. రూ.1365 కోట్లు నష్టపోయిన రెస్టారెంట్

ఎలుక

ఫొటో సోర్స్, Getty Images

(గమనిక: వార్తలో మీకు ఇబ్బందిగా అనిపించే చిత్రం ఉండొచ్చు)

చైనాలో ప్రముఖ రెస్టారెంట్ ఓ ఎలుక వల్ల రూ.1365 కోట్లు నష్టపోయింది.

ఈ రెస్టారెంట్‌కి వచ్చిన గర్భిణి సూప్ ఆర్డర్ చేశారు. అక్కడి వారు సూప్ ఇచ్చారు. ఆమె దాన్ని తాగబోగా.. అందులో చచ్చిన ఎలుక కనిపించింది.

ఈ ఘటనతో హాట్ పాట్ రెస్టారెంట్ షియాబు స్టాక్ బాగా పడిపోయింది.

ఈ సూప్‌లో ఎలుక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈ రెస్టారెంటు షేర్ విలువ ఏడాదిలో కనిష్ఠ స్థాయికి చేరింది. దీంతో కంపెనీకి రూ.1365 కోట్ల నష్టం వాటిల్లింది.

షాండాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ రెస్టారెంట్ ఔట్‌లెట్‌ను తాత్కాలికంగా మూసేశారు.

ఈ ఔ‌ట్‌లెట్ 5000 యువాన్లను అంటే పరిహారంగా ఇస్తామని చెప్పినట్లు సమాచారం.

స్థానిక వార్తా సంస్థ కథనం ప్రకారం.. రెస్టారెంటు యాజమాన్యం ఆఫర్ చేసిన పరిహారాన్ని గర్భిణి భర్త తిరస్కరించారు.

ఆమెకు పూర్తి వైద్య పరీక్షలు చేయించి.. తర్వాత పరిహారం మొత్తాన్ని నిర్ణయిస్తామన్నారు.

సూప్‌లో ఎలుక పడిన ఘటన ఈ నెల 6న జరిగినట్లు వివరించారు.

ఈ అంశంపై రెస్టారెంట్‌ను ప్రశ్నిస్తే.. సిబ్బంది ఒకరు ‘‘మీకు పుట్టబోయే బిడ్డ గురించి అంత కంగారుగా ఉంటే.. మీ భార్యకు అబార్షన్ చేయించంచడి. అందుకు అయ్యే రూ.20 వేల పరిహారం మేం ఇస్తాం.’’ అన్నారని బాధితురాలి భర్త తెలిపారు.

ఎలుక

ఫొటో సోర్స్, Weibo

ఫొటో క్యాప్షన్, సూప్‌లో చనిపోయిన ఎలుక

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)