కేరళ వరదలు: నిండు గర్భిణిని క్షేమంగా ఆస్పత్రికి చేర్చిన నౌకాదళం

కేరళ వరదలు, హెలికాప్టర్‌తో మహిళను కాపాడుతున్న దృశ్యం

ఫొటో సోర్స్, twitter.com/indiannavy

వరదల బీభత్సంతో కేరళ రాష్ట్రం అతలాకుతలమైంది. అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఇప్పటికే 320 మందికి పైగా చనిపోయారు.

వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్‌ఎఫ్), ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

అందుకోసం హెలీకాప్టర్లు, బోట్లు వినియోగిస్తున్నారు.

వరదలో చిక్కుకున్న ఓ గర్భిణిని భారత నావికాదళం హెలీకాప్టర్‌లో వెళ్లి కాపాడింది.

ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను నేవీ ట్విటర్‌లో షేర్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

తర్వాత ఆస్పత్రిలో ఆ మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చారు. "తల్లి బిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు" అంటూ ఆస్పత్రిలోని తల్లిబిడ్డల ఫొటోలను నేవీ ట్విటర్‌‌లో పోస్ట్ చేసింది.

ఈ ఆపరేషన్‌లో హెలీకాప్టర్‌ను విజయ్‌ వర్మ అనే పైలట్‌ నడిపారని తెలిపింది.

కేరళ వరదలు

ఫొటో సోర్స్, twitter.com/indiannavy

విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న నిండు గర్భిణిని కాపాడిన భారత నావికా దళాన్ని, ఆ పైలట్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)