షారూఖ్: బాలీవుడ్‌లో మహిళలను చూపించే విధానం మారాలి
భారతీయ సినిమాల్లో మహిళలను చూపించే విధానం మారాలని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అన్నారు.
బాలీవుడ్‌లో లైంగిక వేధింపులు, మహిళల హక్కులపై ఆయన బీబీసీ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
సామాజిక సమస్యలు, మహిళల హక్కులకు తానేమీ బలంగా గొంతు వినిపించడం లేదని అన్నారు.
''ఇన్నాళ్లు చాలా ఏళ్లుగా నా గురించే ఆలోచించుకున్నా. నాకు ఏం కావాలనుకున్నానో అదే చేశా. అందరిలా డబ్బు సంపాదించాలనుకున్నా. గొప్ప పేరు, ప్రతిష్టలు తెచ్చుకోవాలనుకున్నా'' అని చెప్పారు.

అయితే, సమాజం కోసం, ఇతరుల కోసం ఏదో ఒకటి చేయాలనుకునేవాన్నని, చేయాల్సినంత మాత్రం తాను చేయలేదని తెలిపారు.
బాలీవుడ్‌లో లైంగిక వేధింపులను ఎప్పుడైనా చూశారా? వాటి గురించి ఏమైనా చేయాలనుకున్నారా? అని ప్రశ్నించినప్పుడు..
సినిమాలు చేస్తున్నప్పుడు మహిళల పట్ల ఎలా ఉండాలనే విషయంలో తాను చాలా స్పష్టతతో ఉన్నాని చెప్పారు.
''తెరపై నా పేరుకంటే ముందు నటీమణి పేరు రావాలనే చిన్న విషయంలో కూడా కఠినంగా ఉంటా. నా సెట్‌లో ఎవరూ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే ప్రసక్తే లేదు.'' అని స్పష్టం చేశారు
హిందీ సినిమాల్లో మహిళలను మూస ధోరణిలో చూపిస్తుంటారనే విషయం నిజమేనని అన్నారు. ''సినిమాల్లోనే కాదు అన్ని చోట్లా మహిళలను చూపించే విధానం మారాలి. సమాజంలో మహిళలను పురుషులకన్నా తక్కువ చేసి చూపించడం లాంటివి మారాలి.'' అని పేర్కొన్నారు.
500 సినిమాలు చేస్తే అందులో మహిళలను గొప్పగా చూపించే 50 సినిమాలు వస్తున్నాయని చెప్పారు. సమాజం నమ్ముతున్నదే సినిమాల్లోనూ చూపిస్తున్నారని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- చరిత్రలో మహిళలు: ఒక ఆటతో ఓటుహక్కును ఎలా సాధించుకున్నారు?
- విదేశాంగ విధానం: భారత్ తోడు పెళ్లికూతురేనా?
- పెన్షన్‌కు భరోసా లేదు.. బతుక్కి భద్రత లేదు!
- అభిప్రాయం: మహిళలతో బాలీవుడ్ బంధం ఎలాంటిది?
- ఏది 'సెక్స్', ఏది 'రేప్'?
- సెక్స్‌కూ గుండెపోటుకు సంబంధముందా?
- ఒకచోట ఉండే మహిళలకు పీరియడ్స్ ఒకేసారి వస్తాయా?
- '18 ఏళ్ల లోపు వయసున్న భార్యతో సెక్స్ అత్యాచారమే'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










