భారత్ - పాకిస్తాన్ ఉద్రిక్తత: ఇప్పటి వరకూ ఏం జరిగింది?
పుల్వామా దాడి అనంతరం భారత వైమానిక దళం పాకిస్తాన్ లోపల జైషే మొహమ్మద్ శిక్షణ శిబిరాలపై దాడి చేయటంతో రెండు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత పెరుగుతూ వస్తోంది.
ముఖ్య సంఘటనల కాలక్రమం ఇదీ:
-
14 ఫిబ్రవరి 2019
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) జవాన్లతో ప్రయాణిస్తున్న కాన్వాయ్ మీద జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆత్మాహుతి బాంబర్ ఒక వాహనంతో ఢీకొట్టాడు. ఈ దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది చనిపోయారు. ఈ దాడి చేసింది తామేనని జైషే మొహమ్మద్ ప్రకటించింది.
-
17 ఫిబ్రవరి 2019
దిల్లీలోని తన హైకమిషనర్‌ను పాకిస్తాన్ సంప్రదింపుల కోసం వెనక్కి పిలిపించింది.
-
18 ఫిబ్రవరి 2019
భారత్ నియంత్రణలో ఉన్న కశ్మీర్‌లోని పుల్వామాలో తీవ్రవాదుల రహస్య స్థావరంగా చెప్తున్న ఒక నివాస ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు భారత సైనికులు, ఒక పోలీస్ కానిస్టేబుల్ సహా తొమ్మిది మంది చనిపోయారు.
-
19 ఫిబ్రవరి 2019
భారతదేశం ‘‘ఎటువంటి సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా పాకిస్తాన్‌ను నిందించటం మానుకోవాలి'' అని పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ‘‘చర్యలు చేపట్టదగిన సమాచారం'' ఏదైనా ఉంటే తమకు అందించాలని భారత అధికారులను కోరారు. ‘‘పాకిస్తాన్ మీద ఎటువంటి దాడి అయినా ప్రారంభించగలమని మీరు అనుకునేట్లయితే.. తిప్పికొట్టటానికి పాకిస్తాన్ కూడా ఆలోచించదు, పాకిస్తాన్ తిప్పికొడుతుంది'' అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
-
22 ఫిబ్రవరి 2019
పుల్వామా దాడికి ప్రతీకారంగా జరగగల దాడుల నుంచి కశ్మీరీలకు, ముఖ్యంగా విద్యార్థులకు రక్షణ కల్పించాలని భారత సుప్రీంకోర్టు ప్రభుత్వానికి నిర్దేశించింది.
-
24 ఫిబ్రవరి 2019
జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే తీవ్రవాదులు, ఇద్దరు భద్రతా సిబ్బంది చనిపోయారు.
-
26 ఫిబ్రవరి 2019
నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) ఆవల జైషే శిక్షణ శిబిరాల మీద 12 మిరేజ్ 2000, సుఖోయ్ ఎస్‌యూ-30 యుద్ధ విమానాలతో ‘‘సైనికేతర ముందస్తు చర్య'' చేపట్టినట్లు భారత వైమానిక దళం ప్రకటించింది. ఎవరూ చనిపోలేదని పాకిస్తాన్ ప్రకటించింది.
-
27 ఫిబ్రవరి 2019
భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. వైమానిక యుద్ధంలో ఒక మిగ్ 21 కోల్పోయామని, ఐఏఎఫ్ పైలట్ ఒకరు ‘ఆపరేషన్‌లో గల్లంతు' అయ్యారని మీడియాకు వెల్లడించింది. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఒక యుద్ధ విమానాన్ని తాము కూల్చివేశామని కూడా భారత్ తెలిపింది.
-
28 ఫిబ్రవరి 2019
పాకిస్తాన్ నిర్బంధించిన భారత పైలట్‌ను ఒక ‘శాంతి సంకేతం'గా విడుదల చేయనున్నట్లు పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు.
క్రెడిట్స్
ప్రొడ్యూసర్: మహిమా సింగ్
డెవలపర్: ఓల్వాలే మాలోమో, ధ్రువ్ నేన్వానీ
ఫొటో క్రెడిట్: గెటీ ఇమేజెస్