తూర్పు యుక్రెయిన్‌లో మరో ప్రాంతాన్ని ఆక్రమించినట్లు రష్యా వెల్లడి

తూర్పు యుక్రెయిన్‌లోని దోన్యస్క్ ప్రాంతంలో ఓచెరెతాయిన్‌ అనే ప్రాంతాన్ని నియంత్రణలోకి తీసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. అమెరికా యూనివర్సిటీల్లో వందల మంది విద్యార్థుల అరెస్టులు...అసలు అక్కడేం జరుగుతోంది?

  3. తూర్పు యుక్రెయిన్‌లో మరో ప్రాంతాన్ని ఆక్రమించినట్లు రష్యా వెల్లడి

    రష్యా, యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Getty Images

    తూర్పు యుక్రెయిన్‌లోని దోన్యస్క్ ప్రాంతంలో ఓచెరెతాయిన్‌ అనే ప్రాంతాన్ని నియంత్రణలోకి తీసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    ఈ ప్రాంతంలో కొన్ని రోజులుగా యుక్రెయిన్, రష్యాల మధ్య భీకర పోరాటం జరుగుతోంది.

    అయితే, రష్యా సైన్యం చేసిన ప్రకటనను ధ్రువీకరించుకోవడానికి సాధ్యపడలేదు.

    ప్రస్తుతం రష్యా ఆక్రమించుకున్నట్లుగా చెబుతున్న ‘‘ఓచెరెతాయిన్’’ యుక్రెయిన్ సరిహద్దు కంచుకోట్లో ఒకటి.

    రానున్న వారాల్లో మరికొన్ని కీలక ప్రాంతాలు కూడా రష్యా చేతుల్లోకి వెళ్లొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

    మరోవైపు అమెరికా నుంచి వచ్చే ఆయుధాల కోసం యుక్రెయిన్ ఎదురుచూస్తోంది. తాజాగా 61 బిలియన్ డాలర్ల సాయాన్ని యుక్రెయిన్‌కు అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే.

  4. ఈ అరుదైన పాములు 2,000 కి.మీ. దాటి సూరత్ ఎలా చేరుకున్నాయి?

  5. కుళాయి నీళ్లు తాగొచ్చా, ఫిల్టర్ వాటరే తాగాలా...ఎలా తేల్చుకోవాలి?

  6. పాకిస్తానీ యువతికి దిల్లీ వ్యక్తి గుండెను అమర్చిన చెన్నై వైద్యులు, ఇదెలా సాధ్యమైంది?

  7. మహదేవ్ బెట్టింగ్ యాప్‌ కేసులో సినీ నటుడు సాహిల్ ఖాన్‌ అరెస్ట్, అలోక్ పుతుల్, రాయ్‌పూర్ నుంచి బీబీసీ కోసం

    సాహిల్ ఖాన్

    ఫొటో సోర్స్, Getty Images

    మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సినీ నటుడు సాహిల్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

    ముంబయి పోలీసులు బస్తర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

    ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారని, దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారని సాహిల్ ఖాన్ మీద ఆరోపణలు ఉన్నాయి.

    సాహిల్ ఖాన్ అరెస్ట్ విషయాన్ని బస్తర్ పోలీసులు ధ్రువీకరించారు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సాహిల్ ఖాన్ ఈ కేసులో ముంబయి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. సాహిల్ అప్పటి నుంచి బస్తర్ జిల్లా కేంద్రమైన జగదల్‌పూర్‌లో తలదాచుకుంటున్నారు.

    సాహిల్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన తర్వాత ఛత్తీస్‌గఢ్ నుంచి ముంబయికి తీసుకువచ్చారు.

    భారత న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని వార్తా సంస్థ ఏఎన్‌ఐతో సాహిల్ ఖాన్ అన్నారు.

    గత వారం, ఈ కేసులో నటులు సంజయ్ దత్, తమన్నా భాటియాలకు కూడా ముంబయి పోలీసులు సమన్లు ​​జారీ చేశారు.

    వేల కోట్ల విలువైన మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది.

  8. స్వలింగ సంపర్కాన్ని నేరంగా గుర్తించే బిల్లుకు ఇరాక్ పార్లమెంట్ ఆమోదం

    స్వలింగ సంపర్కం

    ఫొటో సోర్స్, Getty Images

    స్వలింగ సంపర్కాన్ని నేరంగా గుర్తించే బిల్లును ఇరాక్ పార్లమెంటు ఆమోదించింది.స్వలింగ సంపర్కులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు శిక్ష విధించే నిబంధన ఈ బిల్లులో ఉంది.

    కొత్త చట్టం ప్రకారం, ట్రాన్స్‌జెండర్లను కూడా ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలుకు పంపవచ్చు.

    దేశంలో మతపర విలువలను కాపాడటానికి ఈ కొత్త చట్టం సహాయపడుతుందని మద్దతుదారులు భావిస్తున్నారు.

    ఇరాక్ ఈ చట్టం ద్వారా ఎల్జీబీటీ కమ్యూనిటీ హక్కులను ఉల్లంఘించడాన్ని కొనసాగిస్తుందని బిల్లును వ్యతిరేకిస్తున్న వర్గాలు చెబుతున్నాయి.

  9. ఎండీహెచ్, ఎవరెస్ట్: ఈ భారతీయ కంపెనీల మసాలాల్లో క్యాన్సర్ కారకాలున్నాయా, అమెరికా వీటిపై ఎందుకు పరిశోధన చేపట్టింది?

  10. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని క్లిక్ చేయండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.