ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చడంలో సహకరించాడు. అతనికి శ్రేయస్ అయ్యర్ అండగా నిలబడటంతో భారత జట్టు ఘన విజయం సాధించింది.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

ఫొటో సోర్స్, UGC
బతుకమ్మ పండుగ ప్రారంభమైన తరుణంలో చెరువును శుభ్రం చేసేందుకు నీటిలోకి దిగిన ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన సిద్ధిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామంలో శనివారం జరిగింది.
సఫాయి కార్మికులు గిరిపల్లి భారతి (40), ఎల్లం యాదమ్మ (43), బాబు (25)లు చెరువులో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు వెళ్లారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూసిన మ్యాచ్‌లో ఫలితం ఏకపక్షంగా సాగింది. పాకిస్తాన్ జట్టుపై టీమిండియా 7 వికెట్ల తేడాదో ఘన విజయం సాధించింది. 30.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది.
బాబర్ ఆజం సేన ఇచ్చిన 192 పరుగుల విజయ లక్ష్యాన్ని రోహిత్ అండ్ కో ఆడుతూ పాడుతూ చేరుకుంది.
కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చడంలో సహకరించాడు. అతనికి శ్రేయస్ అయ్యర్ అండగా నిలబడటంతో ఎలాంటి తడబాటు లేకుండా భారత జట్టు విజయం సాధించింది.
కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన శుభ్‌మన్ గిల్ 16 పరుగులకు అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కూడా 16 పరుగులకే అవుటవడంతో భారత అభిమానుల్లో ఆందోళన కనిపించింది. అప్పటికి భారత జట్టు స్కోరు 79 పరుగులు.
ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌తో కలిసి నిలకడగా ఆడాడు. ఒకపక్క రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతూ వెళుతుంటే, అయ్యర్ ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును పెంచే పనిలో సహకరించాడు.
అయితే, సెంచరీ దిశగా దూసుకుపోతున్న రోహిత్ శర్మ 63 బంతుల్లో 85 పరుగులు చేసి షాహీన్ అఫ్రిది చేతిలో అవుటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన కె.ఎల్. రాహుల్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. శ్రేయస్ 53 పరుగులతో, కె.ఎల్. రాహుల్ 19 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
వరల్డ్ కప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ పాకిస్తాన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ జట్టు భారత్ ముందు 192 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు పాకిస్తాన్‌ను 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌట్ చేసింది.
భారత బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు తలా రెండేసి వికెట్లు తీసి పాకిస్తాన్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.
పాకిస్తాన్ బ్యాటింగ్‌లో బాబర్ ఆజం 50, మహ్మద్ రిజ్వాన్ 49, ఇమామ్ ఉల్ హక్ 36, అబ్దుల్లా షఫీఖ్ 20 పరుగులు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్‌కు చెందిన ఒక స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
లెబనీస్ సరిహద్దుకు సమీప నగరమైన హైపా మీద రెండు గుర్తుతెలియని లక్ష్యాలను అడ్డుకున్నట్లు చెప్పింది.
ఉత్తర ఇజ్రాయెల్‌లోకి ఒక గుర్తు తెలియని డ్రోన్ (యూఏవీ) ప్రవేశించిన తర్వాత తాము ఈ చర్యకు దిగినట్లు వెల్లడించింది.
ఇటీవల ఇజ్రాయెల్ దళాలు, హిజ్బుల్లా పరస్పరం రాకెట్ దాడులకు పాల్పడ్డాయి.
హమాస్ తరహాలోనే లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లాను కూడా యూకే, అమెరికా, ఇతర దేశాలు తీవ్రవాద సంస్థగా గుర్తించాయి.
ఇరాన్ మద్దతుతో లెబనాన్‌లో హిజ్బుల్లా ఒక బలమైన సైనిక, రాజకీయ ఉనికిని కలిగి ఉంది.
2006లో ఇజ్రాయెల్, హిజ్బుల్లాకు మధ్య భీకర యుద్ధం జరిగింది. ఇందులో 1,200 మంది మరణించారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.