మణిపూర్‌లో మళ్లీ హింస-30 మంది తీవ్రవాదులు చనిపోయినట్లు ముఖ్యమంత్రి ప్రకటన
ఈ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొందరు తీవ్రవాదులు ఎలాంటి భయం లేకుండా గ్రామాలపై స్వేచ్ఛగా దాడులు చేస్తున్నాయని కొందరు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. రేపు మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలతో మళ్లీ కలుద్దాం...గుడ్ నైట్
మణిపూర్‌లో మళ్లీ హింస-30 మంది తీవ్రవాదులు చనిపోయినట్లు ముఖ్యమంత్రి ప్రకటన

ఫొటో సోర్స్, ANI
మణిపూర్‌లోని ఇంఫాల్ లోయ చుట్టుపక్కల వివిధ జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి అనేక చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. వేర్పాటువాద గ్రూపులకు వ్యతిరేకంగా జరిగిన ఎదురుకాల్పుల్లో కనీసం 30మంది తీవ్రవాదులు మరణించారని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పేర్కొన్నారు.
ఇంఫాల్ వెస్ట్‌లోని ఉరిపోక్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఖ్వైరక్‌పామ్ రఘుమణి సింగ్ ఇంటిపై దాడి జరిగిందని అధికారి ఒకరు తెలిపారు. అతని ఇంటిని ధ్వంసం చేసి, ఆయన రెండు వాహనాలకు నిప్పు పెట్టారు.
ఇంఫాల్ వెస్ట్‌లోని కంగ్‌చుప్, ఖుర్ఖుల్, ఇంఫాల్ ఈస్ట్‌లోని సగోల్‌మాంగ్, చురచంద్‌పూర్‌లోని అనేక ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి అసెంబ్లీ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో కొన్నిచోట్ల ఫైరింగ్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. స్థానిక మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం గత 24 గంటల్లో దాదాపు 20 ఇళ్లకు నిప్పు పెట్టారు.
ఈ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొందరు తీవ్రవాదులు ఎలాంటి భయం లేకుండా గ్రామాలపై స్వేచ్ఛగా దాడులు చేస్తున్నాయని కొందరు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఐపీఎల్-2023 ఫైనల్: వర్షం ఆగకపోతే మ్యాచ్ ఫలితం ఎలా తేలుతుంది?
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ప్రారంభం కాలేదు. అహ్మదాబాద్‌లో భారీ వర్షం కారణంగా టాస్ కూడా వాయిదా పడింది.
లక్షమంది కూర్చునే కెపాసిటీ ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కానీ వర్షం మాత్రం ఇంకా ఆగలేదు.
అయితే, ఫైనల్ వంటి పెద్ద మ్యాచ్‌లపై వర్షం ప్రభావం పడకుండా నిర్వాహకులు నిబంధనలు రూపొందించారు. రాత్రి 9.35 నిమిషాల కల్లా వర్షం ఆగిపోతే ఒక్క ఓవర్ కూడా తగ్గించకుండా మ్యాచ్ ఆడిస్తారు. అంటే ప్రతి టీమ్ 20-20 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది.
అయితే ఆ తర్వాత కూడా వర్షం కురిస్తే ఓవర్లు తగ్గుతాయి. ఎన్ని ఓవర్లు తగ్గించాలో మ్యాచ్ నిర్వాహకులు, అంపైర్ కలిసి నిర్ణయం తీసుకుంటారు.
ఐదేసి ఓవర్లతో మ్యాచ్ కొనసాగించడానికి కటాఫ్ సమయం రాత్రి 11.56 నిమిషాలు.
అప్పటికీ వర్షం కొనసాగితే, రిజర్వ్ డే అయిన రేపు (సోమవారం)మ్యాచ్‌ను నిర్వహిస్తారు.
ఐపీఎల్-2023 ఫైనల్: వర్షం కారణంగా టాస్ ఆలస్యం

ఫొటో సోర్స్, ANI
ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్: మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ప్రస్తుతం అహ్మదాబాద్‌లో వర్షం కురుస్తోంది. ఈ కారణంగానే టాస్‌లో జాప్యం జరుగుతోందని సమాచారం.
రెండో క్వాలిఫయర్‌లోనూ వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
డిఫెండింగ్ చాంపియన్‌గా నిలిచిన గుజరాత్ జట్టు వరుసగా రెండోసారి టైటిల్ గెలుపొందడంపై దృష్టి సారించింది.
అదే సమయంలో గత సీజన్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచిన చెన్నై జట్టు ఈ సీజన్‌లో దూసుకుపోతూ ఐదోసారి ట్రోఫీని చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది.
తొలి క్వాలిఫయర్‌లో ధోనీ, హార్దిక్ పాండ్యా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్‌లో ధోనీ సేన 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ రెండో క్వాలిఫయర్‌లో ముంబై ఇండియన్స్‌పై 62 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
విజయపరంపరను కొనసాగించాలనే పట్టుదలతో గుజరాత్ జట్టు ఉంది. ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ గుజరాత్ తరఫున బ్యాట్‌తో అద్భుతంగా రాణిస్తున్నాడు.
ఈ ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ అంటే అత్యధిక పరుగులు (851 పరుగులు) రికార్డు కూడా అతని పేరు మీద ఉంది.
గుజరాత్ టైటాన్స్‌లో ఇప్పటి వరకు మహమ్మద్ షమీ 28 వికెట్లు, రషీద్ ఖాన్ 27 వికెట్లు తీసి, బౌలింగ్‌లో అద్భుతాలు చేస్తున్నారు.
అదే సమయంలో, మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ చెన్నైకి ప్లస్ పాయింట్‌గా మారింది.
చెన్నై ఓపెనర్లు రితురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వాయ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండేలాంటి బౌలర్లు కూడా అద్భుతాలు చేస్తున్నారు.
దిల్లీ: రెజ్లర్ల ఆందోళన, అరెస్టులు, ఉద్రిక్తతలు - 11 చిత్రాలలో...
బెయిలు ఇవ్వాలో, వద్దో జడ్జికి చాట్‌జీపీటీ సలహా ఇవ్వగలదా?
హిప్నోథెరపీ: మత్తు లేకుండా, నొప్పి తెలియకుండా ఈ పద్దతిలో ఆపరేషన్ చేయవచ్చా?
దిల్లీ: రెజ్లర్లకు మద్దతుగా మహా పంచాయత్‌కు వస్తున్న రైతులను అడ్డుకున్న పోలీసులు

ఫొటో సోర్స్, SAT SINGH
మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు ఆదివారం హరియాణ, పంజాబ్ నుంచి దిల్లీకి వస్తున్న రైతులు, ఖాప్ పంచాయితీలు, జాతా బండిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొద్దిరోజులుగా ధర్నా చేస్తున్న రెజ్లర్లు కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి మార్చ్ చేపట్టారు.
ఈ నేపథ్యంలో రెజ్లర్లకు మద్దతుగా ఖాప్‌లు పార్లమెంట్ భవనం వద్ద మహిళా మహా పంచాయత్‌కు పిలుపునిచ్చారు. దీంతో మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు దిల్లీకి చేరుకుంటున్న రైతులను పంజాబ్, హరియాణ, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు.
హరియాణ పోలీసులు భారతీయ కిసాన్ యూనియన్ హరియాణ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చధునీని ఆదివారం ఉదయం కురుక్షేత్రలో అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు రెజ్లర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా స్థలానికి చేరుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఫొటో సోర్స్, KAMAL SAINI/BBC
దిల్లీ: రెజ్లర్ల నిరసనలను చెదరగొట్టిన పోలీసులు

ఫొటో సోర్స్, ANI
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లర్లు చేస్తున్న నిరసనలను దిల్లీ పోలీసులు చెదరగొట్టారు.
రెజ్లింగ్ క్రీడాకారిణి సాక్షి మలిక్ ఈ విషయాన్ని తన ట్విటర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు.
‘‘రెజ్లర్లను అదుపులోకి తీసుకున్న తర్వాత, ప్రస్తుతం పోలీసులు జంతర్ మంతర్ వద్ద మా నిరసనలను చెదరగొట్టడం ప్రారంభించారు. మా వస్తువులను పక్కకు తీసి పడేశారు. ఇదెక్కడ దౌర్జన్యం?’’ అని సాక్షి మలిక్ ప్రశ్నించారు.
ఏదైనా ప్రభుత్వం ఆ దేశ చాంపియన్లతో ఈ విధంగా ప్రవర్తించిందా, మేమేం నేరం చేశాం అంటూ బజ్‌రంగ్ పూనియా కూడా ట్వీట్ చేశారు.
జంతర్ మంతర్ నుంచి కొత్త పార్లమెంట్ భవనం వైపు మార్చ్ చేసేందుకు ప్రయత్నించిన రెజ్లర్లను కూడా భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
మహిళల మహా పంచాయత్ నిర్వహించేందుకు రెజ్లర్లు పార్లమెంట్ భవనం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు.
క్రీడాకారుల్ని తాము గౌరవిస్తామని, కానీ కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బంది కలగజేసేందుకూ తాము ఒప్పుకోమని దిల్లీలో శాంతి భద్రతలను పర్యవేక్షించే స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీసు దీపేందర్ పాఠక్ చెప్పారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కొత్త పార్లమెంటును నరేంద్ర మోదీ ఇలా ప్రారంభించారు
ఎన్టీఆర్ శతజయంతి: రామారావు గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
జర్మనీ: లైంగికంగా వేధించారేమోనని 7 నెలల వయసులోనే భారత చిన్నారిని తల్లిదండ్రులకు దూరం చేశారు
కొత్త పార్లమెంట్ భవనం, శవపేటిక ఫోటోలను షేర్ చేస్తూ.. ఇదేమిటని ప్రశ్నించిన ఆర్‌జేడీ

ఫొటో సోర్స్, CENTRALVISTA.GOV.IN
రాష్ట్రీయ జనతా దళ్(ఆర్‌జేడీ) తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో కొత్త పార్లమెంట్ భవనం ఫోటోతో పాటు శవపేటిక ఫోటోను షేర్ చేసింది. ఇది ఏమిటని ప్రశ్నించింది.
ఇతర విపక్ష పార్టీల మాదిరిగా ఆర్‌జేడీ కూడా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ వేడుకలో పాలుపంచుకోలేదు.
కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాల్సి ఉందని ఆర్‌జేడీ తెలిపింది.
ఆర్‌జేడీ ఈ ట్వీట్ చేసిన తర్వాత, రాష్ట్రీయ జనతా దళ్ సభ్యులు శాశ్వతంగా పార్లమెంట్‌ను బాయ్‌కాట్ చేయనున్నారా? లోక్‌సభ సభ్యత్వానికి, రాజ్యసభ్య సభ్యత్వానికి పదవీ విరమణ చేయనున్నారా? అంటూ భారతీయ జనతా పార్టీకి చెందిన నేత సుశిల్ కుమార్ మోదీ ప్రశ్నించారు.
ఎంతో పవిత్రమైన, గౌరవకరమైన ఈ రోజు ఒక రాజకీయ పార్టీ పార్లమెంట్‌ను మనిషి శవపేటికతో పోలుస్తూ చౌకబారు చర్యకు పాల్పడిందన్నారు.
‘‘రాష్ట్రపతి పదవి పార్లమెంటరీ వ్యవస్థలో అంతర్భాగం. పార్లమెంట్ ప్రారంభం లాంటి ఒక ముఖ్యమైన కార్యక్రమంలో రాష్ట్రపతి హాజరు కాకపోవడం, పార్లమెంటరీ విధానం ప్రాధాన్యాన్ని, రాష్ట్రపతి పదవిని అవమానపరుస్తున్నట్లే’’ అని బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ విమర్శించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
టెన్జింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ: ‘ఎవరెస్ట్‌పైకి సాధారణ వ్యక్తులుగా వెళ్లి, ప్రపంచ హీరోలుగా తిరిగొచ్చారు’
బ్రిజ్ భూషణ్ సింగ్ దావూద్ ఇబ్రహీం అనుచరులకు ఆశ్రయం ఇచ్చారా? - గ్రౌండ్ రిపోర్ట్
కొత్త పార్లమెంట్ భవనం వెలుపల నిరసనకు పిలుపునిచ్చిన రెజ్లర్లు

ఫొటో సోర్స్, ANI
కొత్త పార్లమెంట్ భవనం వెలుపల మహిళా మహా పంచాయత్‌ను నిర్వహిస్తామని రెజ్లర్లు ప్రకటించడంతో, భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు.
దిల్లీలోకి వచ్చే అన్ని రహదారుల్లో పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
ఆదివారం కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో, ఈ కొత్త భవనం ముందు ‘మహిళా సమ్మాన్ మహా పంచాయత్’ చేపడతామని రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద ప్రకటించారు.
దీనిలో పాల్గొనేందుకు చాలా రాష్ట్రాల నుంచి రైతులు, కార్మికులు, ఖాప్ పంచాయత్‌లకు చెందిన నేతలు తరలివస్తున్నారు.
దీంతో తిక్రీ సరిహద్దు, సింఘు బోర్డర్, బదర్‌పూర్ బోర్డర్‌లో భద్రతను పెంచారు పోలీసులు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
నేడు కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం

ఫొటో సోర్స్, CENTRALVISTA.GOV.IN/
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభిస్తున్నారు.
ప్రత్యేక పూజా కార్యక్రమంతో ఈ వేడుక ప్రారంభమైంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పూజలో పాల్గొంటున్నారు. పలువురు వీఐపీలు కొత్త పార్లమెంట్ భవనం వద్దకు చేరుకున్నారు.

ఫొటో సోర్స్, DD News
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రాజదండం ‘సెంగోల్’ను కొత్త లోక్‌సభలో స్పీకర్ స్థానం వద్ద ఉంచనున్నారు. సెంగోల్‌కి ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం చేశారు.
పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన రూ.75 నాణేన్ని విడుదల చేస్తారు.
స్వాతంత్య్రం తర్వాత నేడు మనందరికీ ఎంతో గర్వకారణమైన క్షణమని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
నమస్కారం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.