తెలంగాణ: కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కేసు నమోదు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఆయన కొడుకు డాక్టర్ చెరుకు సుహాస్‌ల మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

లైవ్ కవరేజీ

  1. లైవ్ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ ఇంతటితో సమాప్తం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.

  2. బంగ్లాదేశ్‌లో పేలుడు, 15 మంది మృతి

    ఢాకా పేలుడు

    ఫొటో సోర్స్, Getty Images

    బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మంగళవారం భారీ పేలుడు కారణంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వందమందికిపైగా గాయపడ్డారు.

    ఢాకాలోని సిద్దిఖీ మార్కెట్‌లోని ఏడు అంతస్తుల భవనంలో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది.

    అగ్నిమాపక బృందాలు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపడుతున్నాయి.

    గాయపడినవారిని ఢాకా మెడికల్ కాలేజ్‌ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి భవనంలో కొంత భాగం కూలిపోయింది.

    ఢాకా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ డైరెక్టర్ బ్రిగేడియర్జనరల్ మహ్మద్ నజ్ముల్ హక్ మాట్లాడుతూ ‘నేను కనీసం 6 మృతదేహాలు చూశాను. గాయపడినవారు 100 మందికిపైగా మా ఆసుపత్రిలో చేరారు’ అని చెప్పారు.

    కాగా గత నెల రోజులుగా బంగ్లాదేశ్‌లో ఢాకా సహా వివిధ నగరాలలో పేలుళ్లు సంభవించాయి.

    తాజా పేలుడుకు కారణమేంటన్నది ఇంకా తెలియలేదు.

  3. నంద్యాల అటవీ అధికారుల హెచ్చరిక: ‘పిల్లలకు దూరమైన తల్లి పులి ఆగ్రహంగా ఉంటుంది.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’

  4. కేరళ: పెళ్లయిన 29 ఏళ్ల తరువాత ఈ దంపతులు మళ్లీ ఎందుకు వివాహం చేసుకుంటున్నారు?

  5. దర్శన్ సోలంకి: ఐఐటీ బాంబేలో దళిత విద్యార్థి ఆత్మహత్యపై మధ్యంతర నివేదికలో ఏముంది?

  6. కె-డ్రామా: కొరియన్ సీరియళ్లు బాలీవుడ్‌ సినిమాలను మరపిస్తున్నాయా, ఎందుకీ క్రేజ్?

  7. మేఘాలయ ముఖ్యమంత్రిగా సంగ్మా ప్రమాణ స్వీకారం

    సంగ్మా

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, కాన్రాడ్ సంగ్మా

    మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. కాన్రాడ్ సంగ్మా నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

    అనంతరం సంగ్మా మాట్లాడుతూ, "రాష్ట్ర అభివృద్ధికి గత ఐదేళ్లలో వేసిన పునాదులపై మరింత కృషి చేస్తాం. యువత, ఉపాధికి ప్రాధాన్యం ఇస్తాం. వివిధ పథకాల ప్రయోజనాలు అట్టడుగు వర్గాలకు చేరే సామర్థ్యం మెరుగుపడింది" అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    "కూటమిలో భేదాభిప్రాయాలు, సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ, సామరస్యంగా కలిసి పనిచేయడం, పరిష్కారాలు కనుగొనడం ముఖ్యం. ముందుకెళుతున్న కొద్దీ మరింత మెరుగైన సమన్వయంతో బలమైన జట్టుగా ఎదిగే ప్రయత్నం చేస్తాం" అన్నారు సంగ్మా.

  8. 2024 పారా ఒలింపిక్సే తన లక్ష్యమంటోన్న భవీనా పటేల్

  9. కెమికల్స్ లేకుండా మోదుగు పూలతో హోలీ రంగు ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు..

  10. చైనా: పిల్లలను కనేందుకు మహిళలు ఎందుకు నిరాకరిస్తున్నారు?

  11. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కేసు నమోదు

    కోమటిరెడ్డి వెంకటరెడ్డి

    ఫొటో సోర్స్, Komatireddy Venkat Reddy/Facebook

    తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

    తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఆయన కొడుకు డాక్టర్ చెరుకు సుహాస్‌ల మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

    ‘‘మా వాళ్లు చంపేస్తారు...’’

    ‘‘నిన్ను కూడా చంపేస్తారు...’ అంటూ చెరుకు సుహాస్‌తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన ఆడియో ఇటీవల బయటకు వచ్చింది.

    చెరుకు సుహాస్ చేసిన ఫిర్యాదు మేరకు నల్గొండ వన్ టౌన్ పోలీసులు, కోమటిరెడ్డి వెంటకరెడ్డి మీద ఐపీసీ సెక్షన్-506 కింద కేసు నమోదు చేశారు.

  12. ‘‘బైరి నరేశ్‌ను బట్టలూడదీసి కొట్టమని నేనే చెప్పినా...’’ బండి సంజయ్ పబ్లిక్‌గా వెల్లడి... పోలీసుల రియాక్షన్ ఏంటి?

  13. ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి 'మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్' ప్రయోగం

    మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్

    ఫొటో సోర్స్, Indian Navy

    భారత నావికాదళం మంగళవారం నాడు ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి MRSAM (మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్) ఫైరింగ్‌ను విజయవంతంగా చేపట్టింది.

    ఎంఆర్ఎస్ఏఎం క్షిపణిని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ), ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ) సంయుక్తంగా అభివృద్ధి చేశాయని, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఉత్పత్తి చేసిందని నేవీ తెలిపింది.

    ఇది 'ఆత్మనిర్భర్ భారత్' పట్ల నేవీ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. 'ఆర్ఎస్ఎస్ ఒక రహస్య సంఘం, ముస్లిం బ్రదర్‌హుడ్ తరహాలో రూపొందించినది' - రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, @INCINDIA

    "ఆర్ఎస్ఎస్ ఒక రహస్య సంఘం, ముస్లిం బ్రదర్‌హుడ్ తరహాలో రూపొందించినది.. ప్రజాస్వామ్యం ద్వారా అధికారంలోకి వచ్చి తరువాత ఆ ప్రజాస్వామ్యాన్నే అణచివేస్తుంది" అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

    లండన్‌లోని 'చాతం హౌస్' థింక్‌టాంక్‌లో ఓ చర్చా కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆర్ఎస్ఎస్, దాని పనితీరుపై విమర్శలు గుప్పించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    "భారత్‌లో ప్రజాస్వామ్యం పోటీ తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. దానికి ఏకైక కారణం ఆర్ఎస్ఎస్. ఇది ఒక ఛాందసవాద, ఫాసిస్ట్ సంస్థ. భారతదేశంలోని అన్ని సంస్థలను స్వాధీనం చేసుకుంది. ఈ పనిలో వారు సాధించిన విజయం చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది."

    "పత్రికలు, న్యాయవ్యవస్థ, పార్లమెంట్, ఎన్నికల కమిషన్ అన్నీ ముప్పు అంచున ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నియంత్రణలో ఉన్నాయి" అన్నారు రాహుల్.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    రాహుల్ గాంధీ సోమవారం బ్రిటన్ ఎంపీలతో ఒక సంభాషణంలో పాలుపంచుకున్నారు. భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ వీరేంద్ర శర్మ.. హౌస్ ఆఫ్ కామన్స్ ఆవరణలోని గ్రాండ్ కమిటీ రూమ్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. భారత్‌లో విపక్షాల గొంతు నొక్కేస్తున్నారని అన్నారు.

    "మా మైకులు పాడైపోలేదు. బాగా పనిచేస్తాయి. కానీ, మీరు వాటిని స్విచ్ ఆన్ చేయలేరు. నేను మాట్లాడుతున్నప్పుడు ఇలా చాలాసార్లు జరిగింది."

    "నోట్ల రద్దు, కిసాన్ బిల్, జీఎస్టీ, చైనా దూకుడు చర్యలపై మాట్లాడేందుకు ప్రతిపక్షానికి అనుమతిలేదు. అందుకే, ఈ అంశాలపై ప్రజలతో నేరుగా మాట్లాడేందుకే మేం భారత్ జోడో యాత్ర నిర్వహించాం. గతంలో పార్లమెంటులో వివిధ అంశాలపై వాడివేడి చర్చలు, వాదనలు, విభేదాలు ఉండేవి. ఇప్పుడవేవీ లేవు" అన్నారు రాహుల్.

    మరోవైపు, రాహుల్ గాంధీ విదేశాల్లో భారతదేశ ప్రతిష్టను దిగజార్చుతున్నారని బీజేపీ ఆరోపించింది.

    రాహుల్ గాంధీ విదేశాల్లో ప్రచారం చేస్తున్న అబద్ధాలను ఎవరూ నమ్మరని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. రాహుల్ గాంధీ 'వివాదాల సుడిగుండం'గా మారారని కేంద్ర మంత్రి అన్నారు.

  15. ఖుష్బూ: ‘మా నాన్న లైంగికంగా వేధించాడని చెబితే... నేను ఆయన పరువు తీశానని విమర్శిస్తున్నారు’