ఉత్తర్ ప్రదేశ్‌లో బుల్డోజర్లతో ఇళ్లను కూల్చేయడంపై సుప్రీం కోర్టుకు వెళ్లిన ముస్లిం సంస్థ
ఉత్తర్ ప్రదేశ్‌లో ‘అక్రమ నిర్మాణాల కూల్చివేత’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లతో ఇళ్లను కూలదోయకుండా అడ్డుకోవాలని ముస్లిం సంస్థ జమీయత్ ఉల్‌మా-ఎ-హింద్.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
లైవ్ కవరేజీ
శారద మియాపురం
ధన్యవాదాలు..
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్‌డేట్ల కోసంఈ లింకునుక్లిక్ చేయండి.
నేటి ముఖ్యాంశాలు
బంగ్లాదేశ్‌లోని బాగెర్‌హాట్ సబ్ జిల్లా చితల్‌మడీ ప్రాంతంలోని ఒక హిందూ ఇంటిని ముస్లిం సమూహం ధ్వంసం చేసింది.
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న అయిదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒకవేళ మూడో మ్యాచ్‌లో కూడా భారత్ పరాజయం పాలైతే సిరీస్ దక్షిణాఫ్రికా వశం అవుతుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ భారీ మొత్తం దక్కింది. 2023 నుంచి 2027 వరకు ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల కోసం వేలం నిర్వహించగా... టీవీ, డిజిటల్ ప్రసారాలకు ఏకంగా రూ. 44,075 కోట్ల విలువ పలికినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా చేపట్టిన ఆందోళనల్లో హింసకు సంబంధించి 200 మందికిపైగా అరెస్టైనట్లు పశ్చిమ బెంగాల్ డీజీపీ మనోజ్ మాలవీయ వెల్లడించారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లతో ఇళ్లను కూలదోయకుండా అడ్డుకోవాలని ముస్లిం సంస్థ జమీయత్ ఉల్‌మా-ఎ-హింద్.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ సృష్టించిన వివాదంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బీన్ స్పందించారు. ఈ సమస్యను తగిన విధంగా పరిష్కరిస్తారని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు.
మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు: వివాదంపై తొలిసారి చైనా ఏమని స్పందించింది?

ఫొటో సోర్స్, www.fmprc.gov.cn
ఫొటో క్యాప్షన్, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బీన్ మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ సృష్టించిన వివాదంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బీన్ స్పందించారు. ఈ సమస్యను తగిన విధంగా పరిష్కరిస్తారని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు.
బీజింగ్‌లో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఓ ప్రశ్నపై వాంగ్ స్పందించారు. ‘‘భిన్న సంస్కృతులు, భిన్న మతాలు ఒకేచోట ఉండేటప్పుడు ఒకరినొకరు గౌరవించుకోవాలనే విధానాన్ని చైనా నమ్ముతుంది’’అని ఆయన అన్నారు.
‘‘ముఖ్యంగా ఇతర మతాలపై మనకున్న చెడు భావనలు, విభేదాలను మనం పక్కన పెట్టేయాలి. శాంతియుతంగా కలిసి మెలసి ఉండేందుకు మనం కృషి చేయాలి’’అని ఆయన వివరించారు.
ఈ వివాదంపై పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఖతర్, యూఏఈ, కువైత్, ఒమన్, ఇండోనేసియా, ఇరాక్, మల్దీవులు, బంగ్లాదేశ్, లిబియా, బహ్రెయిన్ నిరసన వ్యక్తం చేశాయి.
ఉత్తర్ ప్రదేశ్‌లో బుల్డోజర్‌తో ఇళ్లను కూలదోయడంపై సుప్రీం కోర్టుకు వెళ్లిన ముస్లిం సంస్థ

ఫొటో సోర్స్, ANI
ఉత్తర్ ప్రదేశ్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లతో ఇళ్లను కూలదోయకుండా అడ్డుకోవాలని ముస్లిం సంస్థ జమీయత్ ఉల్‌మా-ఎ-హింద్.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
చట్టాలకు అతీతంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకుండా చూడాలని సుప్రీం కోర్టును జమీయత్ అభ్యర్థించింది.
అయితే, చట్టాలకు అనుగుణంగానే తాము నడుచుకుంటున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది.
చట్టాలను ఉల్లంఘిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని జమీయత్ కోరుతోంది.
దిల్లీలోని జహంగీర్‌పురీలో బుల్డోజర్లతో ఇళ్లు కూలదోయకుండా సుప్రీం కోర్టు నిలుపుదల ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ప్రయాగ్‌రాజ్ హింస: బుల్డోజర్లతో కూల్చేసిన ఈ ఇంటిలో ఉండే జావెద్ మొహమ్మద్ ఎవరు?
మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు: పశ్చిమ బెంగాల్‌లో హింస కేసుల్లో 200 మందికిపైగా అరెస్టు

ఫొటో సోర్స్, ANI
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా చేపట్టిన ఆందోళనల్లో హింసకు సంబంధించి 200 మందికిపైగా అరెస్టైనట్లు పశ్చిమ బెంగాల్ డీజీపీ మనోజ్ మాలవీయ సోమవారం వెల్లడించారు.
ఈ హింసకు సంబంధించి 42 కేసులు నమోదైనట్లు పీటీఐ వార్తా సంస్థతో మనోజ్ చెప్పారు.
‘‘ఈ హింసలో ఎవరూ చనిపోలేదు. ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదు. పరిస్థితులు అదుపులో ఉన్నాయి. ఇంటర్నెట్ సేవలను కూడా పునరుద్ధరిస్తున్నాం. నకాశీపారాలో 144 సెక్షన్‌ను విధించాం’’అని పశ్చిమ బెంగాల్ ఏడీజీ జావెద్ షమీమ్ తెలిపారు.
‘‘దోషులు ఎవరినీ వదిలిపెట్టబోం. కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం. ఎవరూ వదంతులను నమ్మొద్దు’’అని ఆయన అభ్యర్థించారు.
మరోవైపు హింసపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో విచారణ జరిపించాలని కలకత్తా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
శ్రీలంక: పవర్ ప్రాజెక్టును అదానీకి ఇచ్చేలా గోటబయ రాజపక్సపై నరేంద్ర మోదీ ఒత్తిడి తెచ్చారా?
IPL media rights: వేలంలో టీవీ, డిజిటల్ హక్కులకు రూ. 44,075 కోట్లు... ఒక్కో మ్యాచ్‌కు రూ. 107.5 కోట్లు

ఫొటో సోర్స్, ani
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ భారీ మొత్తం దక్కింది.
2023 నుంచి 2027 వరకు ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల కోసం వేలం నిర్వహించగా... టీవీ, డిజిటల్ ప్రసారాలకు ఏకంగా రూ. 44,075 కోట్ల విలువ పలికినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
ఈ అయిదేళ్ల కాలంలో మొత్తం 410 మ్యాచ్‌లు జరగనున్నాయి.
మ్యాచ్‌లను నాలుగు ప్యాకేజీలుగా విభజించి వేలం నిర్వహించారు. భారత ఉపఖండంలోని టీవీ ప్రసారాలను ‘ఎ’ ప్యాకేజీలో, భారత ఉపఖండంలోని డిజిటల్ ప్రసారాలను ‘బి’ ప్యాకేజీలో చేర్చారు.
‘ఎ’, ‘బి’ ప్యాకేజీలకు కలిపి బిడ్డింగ్ నిర్వహించగా 7 సంస్థలు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు రెండు వేర్వేరు సంస్థలు వీటిని సొంతం చేసుకున్నాయి.
‘ఎ’ ప్యాకేజీలోని టీవీ ప్రసారాలు రూ. 23,575 కోట్లకు, డిజిటల్ రైట్లు రూ. 20,500 కోట్లకు అమ్ముడుపోయాయి. వీటిని వేర్వేరు సంస్థలు సొంతం చేసుకోవడంతో... ఐపీఎల్ మీడియా హక్కులు రెండు బ్రాడ్‌కాస్టర్ల వశమయ్యాయి.
ఈ రెండు ప్యాకేజీలు కలిపి చూస్తే ఒక్కో మ్యాచ్‌కు బిడ్డింగ్ రూ. 107.5 కోట్లుగా నమోదైంది. టీవీ ప్రసారాల హక్కుల కోసం ఒక్కో మ్యాచ్‌కు రూ. 57.5 కోట్ల ధర పలకగా, డిజిటల్ ప్రసారాల కోసం ఆ ధర రూ. 50 కోట్లను తాకింది.
అయితే... సి, డి ప్యాకేజీలకు కూడా వేలం జరగనుంది. టీవీ, డిజిటల్ మీడియా హక్కులను దక్కించుకున్న బ్రాడ్‌కాస్టర్ల వివరాలు అధికారికంగా ఇంకా వెల్లడి కాలేదు.
2017లో అయిదేళ్ల కాలానికి ప్రసార హక్కులను స్టార్ ఇండియా రూ. 16,347.50 కోట్లకు సొంతం చేసుకుంది. గత బిడ్డింగ్‌తో పోల్చితే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ.
ఆంధ్రప్రదేశ్: ‘‘పోలీసువైతే యూనిఫాం ఏది? ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారు’’
రిషభ్ పంత్‌పై విమర్శలు ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న అయిదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
ఒకవేళ మూడో మ్యాచ్‌లో కూడా భారత్ పరాజయం పాలైతే సిరీస్ దక్షిణాఫ్రికా వశం అవుతుంది.
కేఎల్ రాహుల్ గాయం బారిన పడటంతో ఈ సిరీస్‌లో భారత్‌కు రిషభ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
అయితే రిషభ్ కెప్టెన్సీపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఆయన కెప్టెన్సీలోనే భారత్ గత రెండు మ్యాచ్‌ల్లో ఓడింది.
ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు భారత్ 149 పరుగుల లక్ష్యాన్ని విధించింది. 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన సఫారీలు విజయాన్ని అందుకున్నారు.
అయితే, ఈ మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ కంటే ముందుగా అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్‌కు పంపడంపై పంత్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అక్షర్ పటేల్ 11 బంతులు ఆడి 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 30 పరుగు చేయడంతో భారత్ 148 పరుగులు చేయగలిగింది.
పంత్ తీసుకున్న ఈ నిర్ణయంపైనే సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పోస్ట్ X స్కిప్ చేయండి, 3X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
పోస్ట్ X స్కిప్ చేయండి, 4X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
మ్యాచ్ అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో పంత్ నిర్ణయాన్ని శ్రేయస్ అయ్యర్ సమర్థించాడు. ‘‘మేం అప్పటికే మా వ్యూహాన్ని రూపొందించుకున్నాం. అప్పటికీ ఇంకా 7 ఓవర్లు మిగిలి ఉన్నాయి. కాబట్టి, రావడంతోనే షాట్లు ఆడే ఆటగాడి అవసరం అప్పటికి మాకు లేదు. సింగిల్స్ తీస్తూ స్ట్రయిక్ రొటేట్ చేసే ప్లేయర్లలో అక్షర్ కూడా ఒకరు’’ అని శ్రేయస్ చెప్పుకొచ్చాడు.
భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ కూడా పంత్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ... ‘‘భారత్, వికెట్లు కోల్పోతుంటే... దినేశ్ కార్తీక్‌ను ముందు పంపి ఉండాల్సింది. తనను చివరి ఓవర్ల కోసం రిజర్వ్ చేయడం తప్పుడు నిర్ణయం’’ అని ఆయన అన్నారు.
రెబల్ విల్సన్: 'ఇన్నాళ్లూ ఓ యువరాజు కోసం వెదుకుతున్నా.. యువరాణి దొరికింది'
హైదరాబాద్: కాథలిక్ చర్చికి కార్డినల్‌గా ఎంపికైన తొలి దళితుడు పూల ఆంథోని
మొహమ్మద్ ప్రవక్త వివాదం: బంగ్లాదేశ్‌లో హిందూ ఇంటిపై ముస్లిం గుంపు దాడి

ఫొటో సోర్స్, Sony Ramany/NurPhoto via Getty Images
బంగ్లాదేశ్‌లోని బాగెర్‌హాట్ సబ్ జిల్లా చితల్‌మడీ ప్రాంతంలోని ఒక హిందూ ఇంటిని ముస్లిం సమూహం ధ్వంసం చేసింది.
బంగ్లాదేశ్ పత్రిక ఢాకా ట్రిబ్యూన్ ప్రకారం... మొహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆ ఇంటిలో ఉండే దీపక్ సర్కార్ కొన్ని రోజుల క్రితం కొంతమందితో గొడవ పడ్డారు.
33 ఏళ్ల దీపక్, చింగారి గ్రామానికి చెందినవారని బాగెర్‌హాట్ పోలీసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక ముస్లిం సమూహం ఆయన ఇంటిపై దాడికి తెగబడింది. అయితే, ఇంటిలోని వారు తప్పించుకోవడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.
దీనితో పాటు ఆందోళనకారులు కునియా ప్రాంతంలోని ఒక రహదారిపై బైఠాయించారు. దీపక్ సర్కార్‌ను కస్టడీలోకి తీసుకోవడం ద్వారా పోలీసులు పరిస్థితులను అదుపులోకి తెచ్చారు.
ఒక టీ కొట్టు దగ్గర వారం రోజుల క్రితం, దీపక్ సర్కార్‌కు కొంతమంది స్థానిక ముస్లింలకు మధ్య మొహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలకు సంబంధించి వాగ్వాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
భారత్‌లో కొత్తగా 8,084 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో 8,084 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఇందులో అత్యధికం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఆదివారం 2,946 కరోనా కేసులు వెలుగు చూడగా.. కేరళలో 1,955, దిల్లీలో 735, కర్ణాటకలో 463 కేసులు నిర్ధారణ అయ్యాయి.
తాజా కేసులతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 47,995కి చేరింది.
మరోవైపు కరోనా కారణంగా 10 మంది కన్నుమూశారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,24,771కి పెరిగింది.
ఆదివారం 4,592 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బెంగళూరు పోలీసుల అదుపులో నటి శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్

ఫొటో సోర్స్, siddanth kapoor/face book
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్‌ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
ఆదివారం బెంగళూరులో జరిగిన ఒక పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో సిద్ధాంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు నగర పోలీస్ డిప్యూటీ కమిషనర్ భీమశంకర్ ఎస్ గులెడ్ చెప్పినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది.
పక్కా సమాచారం మేరకు ఆదివారం రాత్రి పోలీసులు, పార్టీ జరుగుతోన్న ఎంజీ రోడ్‌లోని హోటల్‌లో సోదాలు చేశారు.
డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానమున్న వ్యక్తుల శాంపుల్స్‌ను వైద్య పరీక్షలకు పంపించారు. సిద్ధాంత్ శాంపుల్ పాజిటివ్‌గా తేలింది.
‘‘బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్‌ను అదుపులోకి తీసుకున్నాం. ఆయన నుంచి సేకరించిన శాంపుల్స్‌ను పరీక్షించగా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. డ్రగ్స్ తీసుకున్న ఆరుగురిలో సిద్ధాంత్ కూడా ఒకరు’’ అని పోలీసు వర్గాలు తెలిపినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది.
హోటల్‌లో డ్రగ్స్ తీసుకున్నారా? లేదా బయట డ్రగ్స్ తీసుకొని పార్టీకి వచ్చారా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదని పోలీసులు చెప్పారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వందలాది మంది పార్టీ కార్యకర్తలతో ర్యాలీగా ఈడీ కార్యాలయానికి రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి చేరుకున్నట్లు వార్తాసంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆయన వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి సోమవారం దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
అంతకుముందు తన సోదరి ప్రియాంకా గాంధీ వాద్రాతో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీగా నడుచుకుంటూ వెళ్లారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
The Lady of Heaven: 'మొహమ్మద్ ప్రవక్త కూతురు కథ' సినిమాను పలు ముస్లిం దేశాలు ఎందుకు నిషేధిస్తున్నాయి? బ్రిటన్ థియేటర్లలో ప్రదర్శన రద్దుపై ప్రజల స్పందన ఏమిటి?

ఫొటో సోర్స్, AFP
ఈ సినిమాలో మొహమ్మద్ ప్రవక్తను చూపించటాన్ని కొన్ని బృందాలు విమర్శించాయి. అలా చిత్రీకరించటాన్ని ఇస్లాంలో అవమానంగా భావిస్తారు. అలాగే తొలినాటి సున్నీ ఇస్లాం మతంలో ముఖ్యమైన వ్యక్తుల చిత్రీకరణను కూడా ఆ బృందాలు తప్పుపట్టాయి.
పూర్తి కథనం కోసం ఈ లింకును క్లిక్ చేయండి.
మాయావతి: ‘‘ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసే తప్పుడు చర్యలను కోర్టు పరిగణించాలి’’

ఫొటో సోర్స్, Getty Images
ప్రయాగ్‌రాజ్‌లోని జావేద్ ఇంటిపై బుల్డోజర్ దాడిని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఖండించారు.
ఒక నిర్దిష్ట సమాజాన్ని లక్ష్యంగా చేసుకుంటూ, వారి నిరసనలను అణిచివేయడానికి బుల్డోజర్లను ఉపయోగిస్తూ యూపీ ప్రభుత్వం సృష్టిస్తోన్నఈ భయానక వాతావరణం సరైనది కాదని అన్యాయమైనదని మాయావతి వ్యాఖ్యానించారు.
ఇళ్లను కూల్చివేస్తూ కుటుంబం మొత్తాన్నీ లక్ష్యంగా చేసుకునే ఈ తప్పుడు చర్యలను కోర్టు పరిగణలోకి తీసుకోవాలని ఆమె కోరారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘‘ఈ సమస్యకు మూల కారణం నూపుర్ శర్మ, నవీన్ జిందాల్. దేశ గౌరవానికి భంగం కలగడానికి, హింసలు చోటు చేసుకోవడానికి వీరే కారణం. ఇలాంటివారిపై చర్య తీసుకోకుండా చట్టాన్ని ఎందుకు అపహాస్యం చేస్తున్నారు? నిందితులు ఇద్దరినీ ఇప్పటివరకు జైలుకు పంపకపోవడం దురదృష్టకరం. వారిని తక్షణమే జైలుకు పంపాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు.
శుక్రవారం ప్రార్థనల అనంతరం ప్రయాగ్‌రాజ్‌లోని అటాలా ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇందులో నిందితుడిగా భావిస్తోన్న జావేద్ ఇంటిని ఆదివారం బుల్డోజర్లతో కూల్చివేశారు.
Kasar Devi-Cosmic Energy: హిమాలయాల ఒడిలో ఉన్న ఈ ప్రాంతానికి ప్రపంచం నలుమూలల నుంచి మేధావులు ఎందుకు వస్తున్నారు?

ఫొటో సోర్స్, AYMITRA SINGH BISHT
ఈ పర్వతాలపై సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో మబ్బులు, మంచు చేసే మాయాజాలాన్ని చూడవచ్చు. మరో వైపు హిమాలయాలు కనిపిస్తూ ఉంటాయి. ఆకాశం నీలంగా ఉండి మబ్బులు లేని రోజున గఢ్ వాల్ లోని చౌకంభ - కేదార్ శ్రేణి నుంచి మారుమూలనున్న నేపాల్ లోని ఆపి- నమ్పా శ్రేణి వరకు ఉన్న విస్తృతమైన నగాధిరాజ సామ్రాజ్యం కనిపిస్తూ ఉంటుంది.
పూర్తి కథనం కోసం ఈ లింకును క్లిక్ చేయండి.
