ఇథియోపియా: యుద్ధం మిగిల్చిన విషాదం.. రోడ్లపై సగం కాలిన మృతదేహాలు
హెచ్చరిక: ఇందులో మనసును కలచివేసే దృశ్యాలు ఉన్నాయి.
ఇథియోపియాకి వెళ్లేందుకు బీబీసీకి అరుదైన అవకాశం లభించింది.
ఒక ఏడాది పాటు ఘోరమైన యుద్ధాన్ని చూసిన ప్రాంతం ఇది.
హముసిత్, అమ్హారాలలోని లోయలు, అడవుల్లో ఇప్పటికీ మృతదేహాలు పడి ఉన్నాయి.
చనిపోయినవారిని ఖననం చేసేందుకు ములే బిరారా, తన ఇరుగు పొరుగు కలిసి ప్రయత్నించారు.
కానీ చావుల వేగాన్ని వారు అందుకోలేకపోయారు.
గషెనా నివాసి ములే బిరారా మాట్లాడుతూ.. ''అందరికీ విసుగొచ్చేసింది. మేము ఈ పని కొనసాగించలేకపోయాం. మరో రెండో, మూడో మృతదేహాలను మాత్రమే ఖననం చేయగలిగాం. మేం కొద్దిమందిమే ఉన్నాం. ఒకేసారి 26 మృతదేహాలను ఖననం చేయాల్సి వచ్చింది'' అన్నారు.
అమ్హారాకు వెళ్లే దారిలో.. ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుదారుల కాలిపోయిన శరీరాలు కనిపిస్తాయి.
టిగ్రేలో ప్రభుత్వం, తిరుగుబాటుదాల మధ్య ఘర్షణల వలన.. సుమారు ఒక కోటి మంది ప్రజలు సహయం అర్థించే పరిస్థితికి వచ్చారు.
ఈ యుద్ధం వలన అనేక రకాల సహాయాలు నిలిచిపోయాయి.
మెలాత్ తన భర్త కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. తిరుగుబాటుదారులు వాళ్ల ఊరిని ఆక్రమించిన్నప్పుడు, తన భర్తను ఎత్తుకుపోయారని ఆమె చెబుతున్నారు.
''ఈపాటికి ఆయన చనిపోయుంటారని కొందరు ఫైటర్స్ చెబుతున్నారు. ఆయన చాలా ప్రమాదంలో ఉండి ఉండవచ్చు. ఆయనకు సంబంధించిన చిన్న గుడ్డ ముక్కైనా దొరుకుతుందేమోనని స్మశానంలో కూడా వెతికాను. ఇప్పటివరకూ జాడ దొరకలేదు'' అని వోల్డ్యా నివాసి అయిన మెలాత్ వెండాటర్ బీబీసీతో చెప్పారు.
తామెవరినీ నిర్బంధించలేదని టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ (టీపీఎల్‌ఎఫ్) చెబుతోంది.
చైనా, ఇరాన్, టర్కీల నుంచి తెప్పించుకున్న డ్రోన్ల సహాయంతో.. ప్రభుత్వం ఈ యుద్ధంలో పైచేయి సాధించింది.
కానీ దేశ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాడుల్లో ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి.
తాము పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని ప్రభుత్వం అంటోంది.
ఈ యుద్ధాన్ని ముగించాలని ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్‌పై ఒత్తిడి వస్తోంది. ఇటీవల టిగ్రేపై జరపాల్సిన ప్రధాన దాడిని ఆయన నిలిపివేశారు.
''ఈ యుద్ధాన్ని కొనసాగించడం ఇథియోపియాకు క్షేమం కాదు. అందుకే టీపీఎల్‌ఎఫ్ దళాలను సైనికపరంగా
ఓడించారు అని చెప్పవచ్చు. ప్రభుత్వం సైన్యాన్ని టిగ్రే వరకు విస్తరించలేదు.
శాంతి చర్చల కోసం సంభాషణలు జరుగుతున్నాయి. యుద్ధం మలుపు తిరిగిందనడానికి ఇది సూచిక.
కానీ, ఇది సున్నితమైన పరిస్థితి.. చాలామందికి ఇది వదులుకోకూడని అవకాశం.
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్‌పై రష్యా దాడికి అనుకూలంగా ఉన్న మూడు ప్రధాన మార్గాలు ఇవే...
- మీకు ఓటు ఉందా, స్మార్ట్ ఫోను కూడా ఉందా.. అయితే మిమ్మల్ని ఏ రాజకీయ పార్టీ టార్గెట్ చేసిందో తెలుసా.. - డిజిహబ్
- తిరుమల పూటకూళ్ల మిట్ట చరిత్ర ఏంటి? కొండపై హోటళ్లు, రెస్టారెంట్లు తొలగించాలని టీటీడీ ఎందుకు నిర్ణయించింది?
- పోర్షె, ఆడి, లాంబోర్గిని, బెంట్లీ.. మొత్తం 4000 లగ్జరీ కార్లు అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో కాలిపోయాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)