‘మీరు ఎగతాళి చేయడానికి మేం పుట్టలేదు’

వీడియో క్యాప్షన్, ‘మీరు ఎగతాళి చేయడానికి మేం పుట్టలేదు’

ఎవరైనా మీవైపు చూసి ఎగతాళిగా నవ్వితే ఎలా ఉంటుంది?

ప్రతిరోజూ అదే జరిగితే? దీనికంటే చావే మేలనిపిస్తుంది.

మరుగుజ్జులు ఎదుర్కొనే సమస్య ఇది.

‘చాలా అవమానాలు ఎదుర్కొంటున్నా. ఎలా అంటే... పదేపదే ఫొటోలు, వీడియోలు తీయడం... నన్ను చూసి గేలిచేయడం, నవ్వడం, అదే పనిగా చూడడం... ఇలా చాలానే ఉన్నాయి.

అలా ఎందుకు జరుగుతోంది అని ఆలోచిస్తే... మాలాంటి వాళ్లు ఉండేది హాస్యం కోసమే అన్నట్టు సినిమాల్లో, సోషల్ మీడియా పోస్టుల్లో చిత్రీకరించారు.

మమ్మల్ని ఫన్నీ క్యారెక్టర్లుగా చూపించారు. సమాజంలో చాలామందికి మరుగుజ్జులు అంటే ఇలాగే తెలుసు.

టోక్యో పారాలింపిక్స్ అనేక మంది వికలాంగులు చేసుకునే పెద్ద సంబరం లాంటిది.

కానీ మేం ఇళ్లకు తిరిగి రాగానే, ఆ సరదా, సందడి మాయమయ్యాయి. మళ్లీ నేను బయట ప్రపంచంలో అంతకుముందు మాదిరిగానే మిగిలిపోయాను.

నన్ను ఎగతాళి చేయడం మళ్లీ మొదలైంది. నాలాంటి ప్రతి ఒక్కరికీ నేను ఓ మాట చెబుతాను.

మీరు సిగ్గుతో ఇంట్లోనే ఉండొద్దు. మీ స్నేహితులు, కుటుంబాలతో బయటకు రండి. మనలాంటి వాళ్లంతా బయటకు రావాలి.

చుట్టూ ఉన్నవాళ్లతో బాగా కలిసిపోవాలి. అలా చేస్తే కొన్నాళ్లకు మనల్ని కూడా అందరిలానే... సమాజంలో ఒక సాధారణ వ్యక్తిగా చూస్తారని నా నమ్మకం’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)