‘గత 116 ఏళ్లలో ఈ స్థాయిలో మంచు కురవడం చూడలేదు’

ఈశాన్య చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తీవ్రమైన మంచు తపానుతో షెన్యాంగ్ నగరం స్తంభించిపోయింది

ఈశాన్య చైనాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలో మంచు తుపానులు సంభవిస్తున్నాయి. దీంతో రికార్డు స్థాయిలో హిమపాతం నమోదయింది.

మంచు భారీగా కురుస్తుండటంతో కరెంట్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జనం చలితో వణికిపోతున్నారు. లియోనింగ్ ప్రావిన్స్‌ రాజధాని షెన్యాంగ్‌లో సగటున 51 సెంటీమీటర్ల (20 అంగుళాలు) మంచు కురిసింది. ఎక్కడ చూసినా మంచు కనిపిస్తోంది.

ఈశాన్య చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనాలోని ఈశాన్య ప్రాంతం తీవ్ర విద్యుత్‌ కోతలు ఎదుర్కొంటోంది.

1905 తర్వాత అత్యధికంగా మంచు కురిసింది ఇప్పుడేనని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా తెలిపింది.చైనాకు పొరుగున ఉన్న మంగోలియాలో భారీ మంచు తుపాను కారణంగా ఒకరు మరణించారు.ఆకస్మిక మార్పులతో వస్తున్న మంచు తుపానులు, అసాధారణమైన వాతావరణ సంఘటనలుగా మారుతున్నాయని మంగోలియా టోంగ్లియావోలోని వాతావరణ పరిశోధకులు ప్రభుత్వ వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్‌తో చెప్పారు.మంగోలియా లోపల, ఈశాన్య చైనా అంతటా మొత్తం 27 మంచు తుపాను హెచ్చరికలు జారీ చేశారు.

ఈశాన్య చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మంచు తుపాను కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది

ఆదివారం ప్రారంభమైన చలిగాలుల కారణంగా ఈశాన్య చైనాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల మేర పడిపోయాయి.లియానింగ్‌లో మంచు తుపాను కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

చాలా వరకు ఎక్స్‌ప్రెస్‌వే టోల్ స్టేషన్‌లు మూసివేస్తున్నట్టు ప్రకటించారు.ఈశాన్య చైనాలోని డాలియన్, దండోంగ్ నగరాల్లో మినహా, మిగతాచోట్ల రైలు, బస్ స్టేషన్లు మూసివేశారు.

ఈశాన్య చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షెన్యాంగ్ టాక్సియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పేరుకుపోయిన మంచు

కరెంటు కోతలు లేకుండా, ఇళ్లను వెచ్చగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విద్యుత్‌ సంక్షోభంతో తీవ్ర కరెంట్ కోతలు ఎదుర్కొన్న వాటిలో చైనాలోని ఈశాన్య ప్రాంతం ఒకటి.

తీవ్ర బొగ్గు కొరతతో ఒక్కసారిగా కరెంట్‌ ధరలు భారీగా పెరిగాయని స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి.విద్యుత్‌ ఉత్పత్తికి చైనా ఎక్కువగా బొగ్గుపై ఆధారపడుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)