చైనా వరద బీభత్సం ఫొటోలు: ఏడాదిలో పడాల్సిన వర్షం మూడు రోజుల్లో కురిసింది

చైనాను వరద ముంచెత్తింది. హెనన్‌ ప్రావిన్స్‌లోని 12 ప్రాంతాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రావిన్స్‌లో 25 మంది చనిపోయారు. దాదాపు 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

చైనా వరదలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా వరద బీభత్సానికి నిదర్శనం ఈ చిత్రాలు
చైనా వరదలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోడ్లు నదులను తలపించాయి.
చైనా వరదలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కార్లు, వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
చైనా వరదలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పలుచోట్ల భవనాలు, రోడ్లు, వంతెనలు కూలిపోయాయి. రోడ్డు, రైలు రవాణా స్తంభించిపోయింది.
చైనా వరదలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సాధారణంగా ఏడాదిలో కురిసే వర్షం కేవలం మూడు రోజుల్లో పడిందని స్థానిక అధికారులు చెబుతున్నారు.
చైనా వరదలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది.
చైనా వరదలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
చైనా వరదలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనాలోని హెనన్‌ ప్రావిన్స్‌లోని 12 ప్రాంతాల్లో వరద బీభత్సం ఎక్కువగా ఉంది. ఈ ప్రావిన్స్‌లో 25 మంది చనిపోయారు. దాదాపు 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
చైనా వరదలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హెనన్ ప్రావిన్స్‌లోని షెన్‌జౌ పట్టణంలో ఒక సబ్‌వే రైల్వే స్టేషన్ నీటమునిగింది. ప్రయాణికుల బోగీలోకి మెడ లోతు వరకు నీళ్లు వచ్చాయి. దాంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దాదాపు గంట పాటు నరకయాతన పడ్డారు. ఈ ఘటనలో 12 మంది చనిపోగా.. 500 మందిని రక్షించారు.
చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ సమయంలో చైనాలో వర్షాలు, వరదలు సహజమే. కానీ ఈ స్థాయిలో వరదలు రావడానికి గ్లోబల్ వార్మింగే కారణమని చైనా సైంటిస్టులు చెబుతున్నారు.