ఇంటి పనులు చేసిన భార్యకు రూ. 5.6 లక్షలు చెల్లించాలని భర్తను ఆదేశించిన కోర్టు

ఫొటో సోర్స్, Getty Images
కలిసి ఉన్నంతకాలం భార్య చేసిన ఇంటిపనులకు విలువ కట్టి ఆ భర్త భరణంగా చెల్లించాలని ఒక విడాకుల కేసులో బీజింగ్ కోర్టు మైలురాయిలాంటి తీర్పునిచ్చింది.
ఐదేళ్లపాటూ ఇంటి చాకిరీ చేసినందుకుగానూ ఆ మహిళకు 50,000 యువాన్లు (రూ.5.60 లక్షలు) దక్కనున్నాయి.
ఈ కేసు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలకు తెర తీసింది. మహిళలు చేస్తున్న ఇంటి పనులకు ఇకనైనా విలువ ఇవ్వాలంటూ పలువురు గొంతెత్తారు. ఆమెకు చెల్లిస్తున్న మూల్యం చాలా తక్కువేనని కొందరు అభిప్రాయపడ్డారు.
చైనా ఇటీవలే ఒక కొత్త పౌర హక్కుల నియమావళి (సివిల్ కోడ్)ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో బీజింగ్ కోర్టు ఈ తీర్పును వెలువరించింది.
కోర్టు తెలిపిన కేసు వివరాలు ఇలా ఉన్నాయి..
చెన్ అనే ఇంటి పేరున్న పురుషుడికి వాంగ్ అనే ఇంటి పేరున్న మహిళతో 2015లో వివాహం అయ్యింది. అయితే, విడాకులు కావాలంటూ గత ఏడాది చెన్ కోర్టు మెట్లెక్కారు.
ఆమె మొదట్లో విడాకులకు ఒప్పుకోలేదు. కానీ తరువాత, కలిసున్నంత కాలం తాను చేసిన ఇంటి పనికి విలువ కట్టి, ఆ మొత్తాన్ని భరణంగా చెల్లించాలని ఆమె కోరారు. పెళ్లయిన దగ్గర నుంచీ చెన్ ఇంటి పనుల్లోగానీ, పిల్లాడిని పెంచడంలోగానీ ఎప్పుడూ సాయం చేయలేదని ఆమె వాదించారు.
బీజింగ్‌లోని ఫాంగ్షన్ జిల్లా కోర్టు ఆమెకు మద్దతుగా తీర్పునిస్తూ.. తనకు నెలవారీ 2,000 యువాన్ల భరణంతో పాటూ ఇన్నాళ్లూ చేసిన ఇంటి పనులకుగానూ 50,000 యువాన్ల మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ తీర్పును వెలువరించిన జడ్జ్ విలేఖరులతో మాట్లాడుతూ.. "వివాహం తరువాత ఒక జంటకు ఉమ్మడి భౌతిక ఆస్తిని విభజించి ఇవ్వొచ్చు. లేదా విలువ కట్టి వాటాలు ఇవ్వొచ్చు. కానీ, ఇంటి పనుల్లాంటి వాటికి లెక్క కట్టలేని విలువ ఉంటుంది" అని అన్నారు.
ఈ ఏడాది అమలులోకి వచ్చిన కొత్త సివిల్ కోడ్ ఆధారంగా ఈ తీర్పును వెలువరించారు. దాని ప్రకారం.. విడాకులు తీసుకునే జంటల్లో ఎవరు ఎక్కువ ఇంటి బాధ్యతలు నిర్వహించారో, ఎవరు ఎక్కువ పిల్లల, వృద్ధుల ఆలనా పాలనా చూసారో వారు ఆ పనులన్నిటికీ భరణాన్ని పొందేందుకు అర్హులు.
ఈ చట్టానికి ముందు, ముందస్తు ఒప్పందం ఉంటేనే విడాకుల తరువాత భాగస్వామికి భరణాన్ని చెల్లించేవారు. ఈమధ్య కాలం వరకూ చైనాలో ఇదే పద్ధతి కొనసాగుతూ వచ్చింది.
చైనాలో పాపులర్ అయిన సోషల్ మీడియా ప్లాట్‌ఫారం వియబోలో ఈ కేసు గురించి, తీర్పు గురించి విస్తృతంగా చర్చిస్తున్నారు. 50,000 యువాన్లు భరణంగా ఇవ్వడం అంటే ఇంటి పనిని తక్కువ అంచనా వేయడమేనని పలువురు వాపోయారు.
"నేను కొంచం అవాక్కయ్యాను. ఒక గృహిణి చేసే పనులను తక్కువ అంచనా వేస్తున్నారు. బీజింగ్‌లో ఒక ఆయాను పెట్టుకుంటే, ఏడాదికి 50,000 యువాన్లు ఆమెకు చెల్లించాల్సి ఉంటుంది" అని ఒక యూజర్ కామెంట్ చేశారు.
పురుషులు ఇంటి పనుల్లో పాలుపంచులోవడం ముఖ్యమని కొందరు ఈ సందర్భంగా సూచించారు.
మహిళలు పెళ్లయిన తరువాత కూడా తమ కెరీర్లను కొనసాగించడం ముఖ్యమని, ఆర్థిక స్వతంత్ర్యం కలిగి ఉండడం ఎంతో అవసరమని మరి కొందరు సలహా ఇస్తున్నారు.
మొత్తానికి, ఈ కేసు ఒక సామాజిక చైతన్యానికి నాంది పలికింది.

ఇవి కూడా చదవండి:
- ‘ఇది ప్రపంచంలోనే అత్యంత రొమాంటిక్ ప్రదేశం’
- ఆయుష్షు పెరగాలంటే.. పెళ్లి చేసుకోండి
- ఇచట వివాహేతర సంబంధాలు తెంచబడును!
- 'కట్నం కోసం' ఆమె 'అతడు'గా మారింది.. ఇద్దరమ్మాయిలను పెళ్లాడింది!
- భార్యపై అత్యాచారం చేయించిన భర్త.. స్వలింగ సంపర్కురాలైనందుకు కక్ష
- ఆమె అతడై.. అతడు ఆమెయై.. తర్వాత ఒక్కటై
- కరోనా వ్యాక్సీన్ కోసం చైనాను నమ్ముకున్న పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది?
- ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్‌కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- నెల్లూరు పల్లెలో అంతరిక్ష పరిశోధన... ఒక సైన్స్ టీచర్ ప్రేరణతో విద్యార్థుల ప్రయోగాలు
- రాయల్ ఎన్ఫీల్డ్ బాటలో భారత్‌లోకి ‘బుల్లెట్’లా దూసుకొస్తున్న బ్రిటిష్ బైక్‌లు
- 127 ఏళ్ల కిందట ప్రపంచానికి భారత ఘనతను చాటిన వివేకానందుడి ప్రసంగం ఇదే..
- మిల్లీమీటరు పురుగు ఒక దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడింది
- పంటలకు ఈ రైతు హోమియో మందులు వేస్తున్నారు... ఎందుకో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








