జో బైడెన్ ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించాలి... హ్యాకర్లకు దొరక్కుండా ఎలా ఉండాలి?

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికా. అలాంటి దేశానికి అధ్యక్షుడు అంటే ఎలాంటి సాంకేతిక పరికరమైనా ఆయనకు అందుబాటులో ఉంటుంది, అన్ని రకాల గాడ్జెట్స్ వాడొచ్చు అని మనం అనుకోవచ్చు.
కానీ, అమెరికా అధ్యక్షుడికి కూడా అనేక అడ్డంకులు ఉన్నాయి. భద్రత, గోప్యత కారణాల దృష్ట్యా కొన్ని నిబంధనలు పాటించవలసి ఉంటుంది. ఈ అంశంలో కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌కు కొంత నిరాశ ఎదురవ్వొచ్చు.
అమెరికా ప్రెసిడెంట్ చుట్టూ ఉండే ఎలక్ట్రానిక్ పరికాలన్నిటి మీదా హ్యాకర్ల గురి ఉంటుంది.
"ప్రపంచ అగ్ర నేతలను లక్ష్యాలుగా చేసుకోకుండా ఉండే అవకాశాలు శూన్యం" అని హార్వర్డ్ కెనడీ స్కూల్ లెక్చరర్ బ్రూస్ ష్నైయర్ అన్నారు.
2000లలో ఇది అంత పెద్ద సమస్యగా ఉండేది కాదు. స్మార్ట్ ఫోన్లు లేని కాలంలో వ్యక్తిగత కంప్యూటర్లు, మాముూలు ఫోన్లను మాత్రమే లక్ష్యాలుగా చేసుకునేవారు.
ప్రపంచంలో ఏ మూలకైనా, ఎవరికైనా ఫోన్ చేసేందుకు వీలుగా అమెరికా అధ్యక్షుడికి అత్యంత సురక్షితమైన ఫోన్ లైన్ ఉంటుంది. కాబట్టి వారికి మొబైల్ అవసరం ఉండదు.
కానీ, 2009లో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు అయిన తరువాత పరిస్థితి మొత్తం మారిపోయింది.
ఒబామాకు తన బ్లాక్‌బెర్రీ ఫోన్ అంటే చాలా ఇష్టం. ప్రెసిడెంట్ అయిన తరువాత దాన్ని విడిచిపెట్టడానికి ఆయన మనసు అంగీకరించలేదు. భద్రతా అధికారులతో పోట్లాడి మరీ దాన్ని వాడడానికి అనుమతి తీసుకున్నారు. అయితే కొన్ని నిబంధనలు పాటించవలసి వచ్చింది.
"ఆ ఫోన్‌లో తన సీనియర్ సిబ్బందితోనూ, కొద్దిమంది వ్యక్తిగత స్నేహితులతో మాత్రమే ఆయన మాట్లాడాలి అనే నిబంధన పెట్టారు" అని ఒక వైట్‌హౌస్ అధికారి తెలిపారు.
అప్పటినుంచీ అమెరికా అధ్యక్షుడు వాడాలనుకునే సాంకేతిక పరికరాల జాబితా పెరుగుతూ వచ్చింది. దానితో పాటుగా భద్రతా అధికారులకు నిద్ర కరువైపోతూ వచ్చింది.

ఫొటో సోర్స్, WHITE HOUSE POOL (ISP POOL IMAGES)
ది ఒబామా ప్యాడ్
2010లో ఐప్యాడ్ విడుదల అయిన తరువాత, తనకు కూడా ఒక ఐప్యాడ్ కావాలని ఒబామా కోరారు.
వెంటనే జాతీయ భద్రతా అధికారులు 'ఒబామాప్యాడ్' తయారు చేసి అందించారు. భద్రతా వలయాలతో కట్టుదిట్టంగా ఉండేలా ఈ ఒబామాప్యాడ్‌ను తయారు చేశారని ఒక మాజీ ప్రభుత్వ సలహాదారు, బీబీసీకి చెప్పారు.
"ఒబామా హయాంలో సీనియర్ అధికారులు ఐప్యాడ్ వాడడం సాధారణమైంది కానీ వాటికి కొన్ని నిర్దిష్ట మార్పులు చేర్పులు చేసి ఇచ్చేవారు" అని ఒబామా ప్రభుత్వంలోని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో సైబర్-సెక్యూరిటీ అధికారిగా పని చేసిన అరి ష్వార్ట్జ్ తెలిపారు.
అయినప్పటికీ, వైట్ హౌస్‌లో టెక్నాలజీ వ్యవస్థ కాస్త పాత వాసనతోనే ఉండేది.
"వై-ఫై ఉండేది కాదు. వైట్ హౌస్‌లో వై-ఫై ఎందుకు ఉండకూడదనే చర్చ ఒకటి రెండు సార్లు జరిగింది. వై-ఫై ఉంటే భద్రతా సమస్యలు విపరీతంగా పెరుగుతాయని ఆ చర్చలో తేలింది" అని ష్వార్ట్జ్ చెప్పారు.
అయితే, చివరకు ఒబామా నివాసంలో వై-ఫై ఏర్పాటు చేసారు. కానీ అది ఎప్పుడూ సరిగ్గా పని చేసేది కాదని ఒబామా కుటుంబం తెలిపారు.
డోనాల్డ్ ట్రంప్ తన పదవీకాలంలో ట్విట్టర్‌లో అత్యంత ప్రసిద్ధమైన వ్యక్తిగా పేరు పొందారు. తనకు ఒక పర్సనల్ డివైజ్ కావాలని పట్టుబట్టారని సమాచారం. కొద్దికాలం ప్రీపెయిడ్ ఫోన్లు వాడారు కానీ భద్రతా కారణాల వలన వాటిని వాడడం ఆపేయాల్సి వచ్చింది.
అయితే ట్రంప్ కంప్యూటర్, ఈమెయిల్ వాడడానికి కూడా సంశయించేవారని, కమ్యూనికేషన్ కోసం ఎక్కువగా కాగితాలనే వాడేవారని చెబుతారు.

ఫొటో సోర్స్, SAUL LOEB
డెన్ పెలటాన్
అప్పట్లో ఐప్యాడ్లు భద్రతా అధికారులకు నిద్రలేని రాత్రులను మిగిలిస్తే ఇప్పుడు ఇంటర్‌నెట్ వ్యవహారాలు పీడకలల్లా తయారయ్యాయి.
"ప్రతీదీ కంప్యూటరే అయిపోతోంది. ఆ కంప్యూటర్లేమో హ్యాకింగ్ లక్ష్యాలుగా తయారవుతున్నాయి.
మీ పెలటాన్ బైక్ కానివ్వండి, మీ ఫోను, ఫ్రిడ్జి, బొమ్మలు, కార్లు...ఇవన్నీ కూడా హ్యాకింగ్‌కు గురి అయ్యే అవకాశం ఉన్నవే" అని ష్నైయర్ అంటున్నారు.
ఇదే ఇప్పుడు బైడెన్‌కు సమస్యగా మారింది. కానీ ఆయనకు తన గాడ్జెట్స్ అంటే చాలా మక్కువ ఉన్నట్టే కనిపిస్తోంది.
బైడెన్ అనేక ఫొటోల్లో యాపిల్ వాచీ పెట్టుకుని కనిపించారు. ఆయన దగ్గర ఒక పెలటాన్ ఎక్సర్సైజ్ బైక్ ఉందని తెలిసింది. ఈ బైక్‌కు కంప్యూటర్ స్క్రీన్, కెమేరా, మైక్రోఫోన్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇంటర్నెట్‌కు కనక్ట్ అయి ఉన్నాయని సమాచారం.
మరి భద్రత మాటేమిటి?
"దానిలో ఉన్న హార్డ్‌వేర్‌ను సవరించవచ్చు. కెమేరాను తీసేయవచ్చు. ఇవన్నీ కూడా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ చేతుల్లోని పనులు" అని ష్నైయర్ చెప్పారు.
బహుశా అప్పుడు అది సురక్షితం కావొచ్చు. అయితే, అవన్నీ చేశాక అందులో ఉన్న అత్యాధునిక సాంకేతికత అంతా మాయం అయిపోయే అవకాశం ఉంది.
"ఈ కాలంలో హ్యాకింగ్ చెయ్యలేని పరికరం అంటూ ఏదీ లేదు. కమ్యూనికేట్ చెయ్యడానికి పనికిరాని పరికరాలు ఏమైనా ఉంటే వాటిని హ్యాక్ చేయలేకపోవచ్చు. అంతే తప్ప, కమ్యూనికేట్ చేయగలిగేవి అన్నీ హ్యాక్ అయ్యే అవకాశం ఉన్నవే" అని యూనివర్సిటీ ఆఫ్ స్టాండ్‌ఫర్డ్‌కు చెందిన హెర్బర్ట్ లిన్ తెలిపారు.

ఫొటో సోర్స్, SOPA Images
'స్మార్ట్' సురక్షితం కాదు
ఎలాంటి సాంకేంతిక పరికరం వాడకుండా ఉండడమే అత్యంత సురక్షితం.
కానీ, గత ఇద్దరు అమెరికా అధ్యక్షులను చూసాక, ఈ మాట ప్రస్తుత అధ్యక్షునికి చెప్పడం అంత సులభం కాదు.
ప్రెసిడెంట్ కూడా యాపిల్ న్యూస్ యాప్ వాడతారని బైడెన్ బయోగ్రఫీ రాస్తున్న ఎవాన్ ఒస్నాస్ తెలిపారు.
మరి, ఇది కూడా సమస్యలను కొనితేవచ్చు.
పేరులో సాఫ్ట్ ఉన్నప్పటికీ నిజానికి సార్ట్‌వేర్‌ను రక్షించడమే అత్యంత కష్టతరమైన విషయం.
"సాఫ్ట్‌వేర్ వైపునుంచీ చూస్తే భద్రత కలిగి ఉండడం అనేది అత్యంత కష్టమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా దూరం నుంచే అప్డేట్ అవుతున్నాయి.
కొత్త పరికరాన్ని కొనుక్కున్నరోజు మాత్రమే మనం సురక్షితంగా ఉన్నాం అనుకోవచ్చు. ఒక ఏడాది తరువాత ఎవరో ఒకరు ఆ పరికరాన్ని హ్యాక్ చేయడానికి కావలసిన మాల్‌వేర్‌ను కనిపెట్టేస్తారు" అని ష్వార్ట్జ్ అన్నారు.
ష్నైయర్ కూడా అదే అంటున్నారు.
"ప్రతీదీ కూడా హ్యాక్ అవ్వడానికి వీలున్నదే.. యాపిల్ న్యూస్‌తో సహా అన్నీ హ్యాకింగ్‌కు గురి కాగలవు. ఎందుకంటే అన్నీ ఒకదానితో ఒకటి కనక్ట్ అయి ఉన్నాయి. ఏదైనా, దేన్నైనా కూడా ప్రభావితం చేయగలదు. అందుకే ఇది చాలా క్లిష్టమైన అంశం. అందుకే ఏ పరికరాలు వాడకుండా ఉండడమే మంచిది" అని ఆయన అన్నారు.
పీడకలల్లాంటి పరిస్థితులు
గత ఏడాది, అనుమానిత రష్యా హ్యాకర్లు అమెరికా ప్రభుత్వ నెట్వర్కులన్నీ హ్యాక్ చేసే ప్రయత్నాలు చేసారని వార్త వచ్చింది.
భారీ సోలార్ విండ్ హ్యాక్ ప్రభావం ట్రెజరీ, కామర్స్ విభాగాల పైన, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ పైన పడిందని సమాచారం.
ఈ హ్యాకింగ్ కొన్ని నెలలవరకూ బయటపడకపోవడం అన్నిటికన్నా దారుణమైన విషయం.
హ్యాక్‌లో రెండు విషయాలు కనిపించాయి.
ఒకటి, యూఎస్ సైబర్ సెక్యూరిటీలో ఉన్న లోపాల కోసం వెతుకుతున్నారన్నది.
లోతుగా పరిశీలిస్తే లోపాలు ఉన్నాయన్నది రెండోది.
అన్నిటికన్నా భయపెట్టే పరిస్థితి ఏమిటంటే ప్రెసిడెంట్ వాడే పరికరం హ్యాక్ అయి కూడా బయటపడకపోవడం.
ఇటీవలే ఒక హ్యాకింగ్ ప్రయత్నం జరగడం, వైట్ హౌస్‌కు దగ్గర్లోనే జరగడం.. ప్రస్తుతం బైడెన్ సెక్యూరిటీ బృందాన్ని కలత పెట్టే విషయమే.
"ప్రెసిడెంట్ ఐఫోన్ హ్యాక్ అయితే, ఏమిటి పరిస్థితి?" అని లిన్ అంటున్నారు.
ఇలా సైబర్ సెక్యూరిటీ భయాల మధ్య బైడెన్ వైట్ హౌస్‌లోకి ప్రవేశిస్తున్నారు. ప్రెసిడెంట్ వాడాలనుకునేవి సురక్షితం కాబోవని సైబర్ సెక్యురిటీ సలహాదారులకు తెలుసు.
అన్నిటికనా శక్తిమంతమైన దేశానికి బైడెన్ అధ్యక్షుడే కావొచ్చు, కానీ సాంకేతిక పరికరాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే.
ఇవి కూడా చదవండి:
- ట్రంప్ అభిశంసన: బైడెన్ మీద, అమెరికా మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- కరోనా వ్యాక్సీన్ కోసం చైనాను నమ్ముకున్న పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది?
- ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్‌కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- నెల్లూరు పల్లెలో అంతరిక్ష పరిశోధన... ఒక సైన్స్ టీచర్ ప్రేరణతో విద్యార్థుల ప్రయోగాలు
- రాయల్ ఎన్ఫీల్డ్ బాటలో భారత్‌లోకి ‘బుల్లెట్’లా దూసుకొస్తున్న బ్రిటిష్ బైక్‌లు
- 127 ఏళ్ల కిందట ప్రపంచానికి భారత ఘనతను చాటిన వివేకానందుడి ప్రసంగం ఇదే..
- ‘ఎవరికీ ద్రోహం చేయలేను... అందుకే ఇద్దరినీ ఒకేసారి పెళ్లి చేసుకున్నా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








