కరోనావైరస్: వుహాన్‌లో షీ జిన్‌పింగ్, కోవిడ్-19 అదుపులోకి వచ్చిందంటున్న చైనా

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కరోనావైరస్‌కు కేంద్ర బిందువుగా ఉన్న వుహాన్ నగరంలో పర్యటించారు. చైనాలో పరిస్థితి అదుపులో ఉందనే సంకేతాలు ఇవ్వడమే ఆయన పర్యటన ఉద్దేశం.

మంగళవారం వుహాన్‌లో అతి తక్కువగా కేవలం 19 కొత్త కేసులే నమోదయ్యాయి.

చైనాలో ఇప్పటి వరకూ మొత్తం 80754 కరోనావైరస్ కేసులు నిర్థరణ కాగా, 3136 మంది మరణించారు. కరోనావైరస్ ప్రబలిన తర్వాత జిన్‌పింగ్ వుహాన్‌కు రావడం ఇదే మొదటిసారి.

హుబే ప్రావిన్స్‌లో కరోనావైరస్ మహమ్మారి నియంత్రణ, అదుపు చర్యలు ఎలా కొనసాగుతున్నాయో పరిశీలించేందుకే జిన్‌పింగ్ వచ్చారని జాతీయ మీడియా వెల్లడించింది.

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వుహాన్‌తో సహా హుబే మొత్తం మూసివేత కొనసాగుతోంది. వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్న ఓ బృందాన్ని జిన్‌పింగ్ పరామర్శించారు.

వుహాన్‌తో సహా హుబే రాష్ట్రంలో వ్యాధి వ్యాప్తి నియంత్రణలో ఉందని ఈ పర్యటనలో జిన్‌పింగ్ ప్రకటించారు. సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయడంలో ప్రాథమిక విజయం సాధించాం అని ఆయన అన్నారు.

షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Reuters

షీ జిన్‌పింగ్ పర్యటన కరోనావైరస్ వ్యాప్తి తర్వాత అలుముకున్న చీకట్ల నుంచి బయటపడుతున్నట్లుగా దేశానికి, ప్రపంచం మొత్తానికి ఓ బలమైన సంకేతం ఇచ్చినట్లైందని విశ్లేషకులు భావిస్తున్నారని చైనా మీడియా పేర్కొంది.

కరోనావైరస్ రోగుల చికిత్స కోసం 10 రోజుల్లో నిర్మించిన హూషెన్‌షాన్ హాస్పిటల్‌ను కూడా అధ్యక్షుడు సందర్శించారు. ఓ వీడియో లింక్ ద్వారా రోగులతో ఆయన మాట్లాడుతున్నట్లు ఫొటోల్లో కనిపించింది.

షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, EPA

ఆయన పర్యటన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న 14 తాత్కాలిక హాస్పిటళ్లను మూసివేస్తున్నట్లు జాతీయ మీడియా తెలిపింది.

జిన్‌పింగ్ ఈ నగరంలో ఎప్పటివరకూ ఉంటారనేది స్పష్టంగా తెలియదు.

"ఆయన ఇక్కడకు వచ్చారు అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ కరోనావైరస్‌పై విజయం సాధించినట్లు అతి త్వరలో ప్రకటించే అవకాశముంది" అని రెన్మిన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జాంగ్ మింగ్ వార్తాసంస్థ రాయిటర్స్‌తో తెలిపారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 1
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 1

అడ్డగీత

వుహన్ సురక్షితం అని చెప్పడమే దీని ఉద్దేశం

బీబీసీ చైనా ప్రతినిధి స్టీఫెన్ మెక్‌డనెల్ విశ్లేషణ

షీ జిన్‌పింగ్ వుహాన్ పర్యటన చైనాలో కరోనావైరస్ తీవ్రత ప్రస్తుతం పూర్తి అదుపులో ఉందని దేశ ప్రజలకు స్పష్టం చేసే చర్యగా చూడొచ్చు. ఇది దేశవ్యాప్తంగా మంచి సందేశాన్నిస్తుంది.

పూర్తి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు వేగంగా చర్యలు చేపట్టినట్లుగా సంకేతాలివ్వడం కూడా దీని ఉద్దేశం.

దేశంలోని అత్యంత ప్రముఖ వ్యక్తి వైరస్‌కు కేంద్ర బిందువుగా ఉన్న నగరంలో పర్యటించారు అంటే ఇతరులు కూడా రావచ్చు, ఇది సురక్షిత ప్రదేశమే అని చెప్పడమే. ఈ మధ్య కాలంలో ఇక్కడ కొత్త ఇన్ఫెక్షన్లు నమోదు కాలేదు.

నిజమే, జిన్‌పింగ్ హుషెన్‌షాన్ హాస్పటల్‌లో రోగులను వీడియో లింక్ ద్వారానే పరామర్శించారు. అయితే, ఆయన వారితో నేరుగా మాట్లాడతారని ఎవరూ ఆశించలేదు.

ఆయన ఇక్కడకు వచ్చారంటే, త్వరలోనే హుబే ప్రావిన్స్‌లో మూసివేత తొలగిపోవచ్చు. కనీసం ఈ రాష్ట్ర పరిధి వరకైనా రవాణా సౌకర్యాలు తిరిగి ప్రారంభం కావచ్చు. షాపులు తెరుచుకోవచ్చు. చైనాలోని ఇతర ప్రాంతాల్లో ఈ మార్పు మరింత వేగంగా జరగొచ్చు.

అడ్డగీత
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 2
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 2

కోవిడ్-19కు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన వార్తల్లో జిన్‌పింగ్ కనిపించలేదు. కానీ, జిన్‌పింగ్ నేరుగా వ్యాధి నియంత్రణ, అదుపు విభాగం పనితీరును పర్యవేక్షిస్తూ, ఆదేశాలు ఇస్తున్నారని సీజీటీఎన్ మంగళవారం తెలిపింది.

ఉపాధ్యక్షుడు లీ కెకియాంగ్ జనవరిలో వుహాన్‌లో పర్యటించారు. గతవారం వైస్ ప్రీమియర్ సున్ చున్‌లాన్ వుహాన్‌లోని ఓ హౌసింగ్ కమ్యూనిటీని సందర్శించారు. అయితే ఆమెకు అక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమె పర్యటన సందర్భంగా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారని స్థానికులు ఆరోపించారు.

ఇన్ఫెక్షన్ల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, చైనాలో జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

కరోనావైరస్

కింగాయ్ ప్రావిన్స్‌లో మొదటి దశలో భాగంగా 144 సీనియర్ స్కూళ్లు, సెకండరీ వొకేషనల్‌ స్కూళ్లు సోమవారం తెరుచుకున్నాయి.

వుహాన్‌లోని టియాన్హె ఎయిర్‌పోర్టు కూడా తిరిగి కార్యకలాపాలు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సోమవారం జాతీయ మీడియా వెల్లడించింది. అయితే, దీనికి అధికారికంగా ఇంకా ఎలాంటి తేదీ నిర్ణయించలేదు.

డిస్నీలాండ్ షాంఘై కూడా పాక్షికంగా తెరుచుకుంది. షాపులు, రెస్టారెంట్లు ప్రారంభమయ్యాయి. అయితే, ప్రధాన థీమ్ పార్క్‌ను మాత్రం ఇంకా మూసే ఉంచారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)