కరోనావైరస్ వైరస్ సోకిన వాళ్ల దగ్గరకు వెళ్లారా లేదా అన్నది చెప్పే యాప్

చైనా

ఫొటో సోర్స్, Getty Images

కరోనావైరస్ ముప్పు తమకు ఉందో, లేదో జనాలు తెలుసుకునేందుకు చైనా ఒక మొబైల్ యాప్‌ను తెచ్చింది.

‘క్లోజ్ కాంటాక్ట్ డిటెక్టర్’ అనే ఈ యాప్‌తో.. కరోనావైరస్ బారినపడ్డవారి దగ్గరికి, లేదా ఆ వైరస్ ఉన్నట్లు అనుమానిస్తున్నవారి దరిదాపుల్లోకి తాము ఎప్పుడైనా వెళ్లామా అన్నది వినియోగదారులు తెలుసుకోవచ్చు.

దేశ ప్రజలపై చైనా ఏ స్థాయిలో నిఘా పెడుతుందన్నది చెప్పేందుకు ఈ సాంకేతికత ఓ ఉదాహరణ.

Presentational grey line
Presentational grey line

వీచాట్, అలీపే లాంటి యాప్‌ల ద్వారా ఓ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఈ యాప్‌ను ప్రజలు వినియోగించుకోవచ్చు.

మొబైల్ నెంబర్‌తో యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందులో పేరు, వ్యక్తిగత గుర్తింపు సంఖ్య‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఒక్కో వినియోగదారుడు ముగ్గురికి (మూడు గుర్తింపు సంఖ్యలకు) సంబంధించి వైరస్ ముప్పు ఎంత ఉందో చూడొచ్చు.

కరోనావైరస్

చైనా ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్‌తో కలిసి ప్రభుత్వ శాఖలు ఈ యాప్‌ను అభివృద్ధి చేశాయి. ఆరోగ్యశాఖ, రవాణ శాఖల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుంది. ఈ విషయాలను చైనా ప్రభుత్వ వార్తా సంస్థ షిన్హువా వెల్లడించింది.

పౌరులపై చైనా ప్రభుత్వం తీవ్ర స్థాయిలో నిఘా పెడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే, ఈ ఒక్క సందర్భంలో మాత్రం దేశంలో అంతర్గతంగా దీన్ని వివాదాస్పదమని భావించరని నిపుణులు అంటున్నారు.

‘‘చైనాలో, దాదాపు ఆసియాలో డేటా ఏదో రహస్యంగా ఉంచే అంశమని పెద్దగా అనుకోరు. దాన్ని ఉపయోగించుకోవచ్చని అనుకుంటారు. కానీ ఇది పారదర్శకమైన పద్ధతిలో, అంగీకారం తీసుకుని జరగాలి. చైనీయుల కోణంలో చూస్తే, ఈ యాప్ చాలా ఉపయోగకరమైంది. డేటా ఎంత శక్తిమంతమో, మంచికి దాన్ని వాడుకుంటో ఏం చేయగలమో ఇది చూపిస్తోంది’’ అని హాంకాంగ్‌కు చెందిన న్యాయవాది కరోలిన్ బిగ్ అన్నారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

క్లోజ్ కాంటాక్ట్ అంటే..

కరోనావైరస్ సోకినవారి దగ్గరికి తామెప్పుడైనా సరైన రక్షణ లేకుండా వెళ్లామా అన్నది వినియోగదారులు ఈ యాప్‌తో తెలుసుకోవచ్చు.

కొందరికి వైరస్ సోకి కూడా లక్షణాలు బయటపడకుండా ఉండొచ్చు. కొన్ని రోజుల తర్వాత ఆ విషయం వెలుగుచూడొచ్చు. అలాంటి వారి దగ్గరికి వెళ్లామో, లేదో కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

కలిసి పనిచేయడం, ఒకే తరగతిలో ఉండటం, ఒకే ఇంట్లో ఉండటం, కలిసి ప్రయాణించడం.. ఇలాంటివన్నింటినీ దరిదాపుల్లోకి వెళ్లడం (క్లోజ్ కాంటాక్ట్)గానే యాప్ ఈ పరిగిణిస్తుంది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)