శ్రీలంక ఎన్నికలు: అధ్యక్షుడిగా ఎన్నికైన రక్షణ శాఖ మాజీ కార్యదర్శి గోటాబయ రాజపక్ష

ఫొటో సోర్స్, Getty Images
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఆ దేశ రక్షణ శాఖ మాజీ కార్యదర్శి గోటాబయ రాజపక్ష విజయం సాధించారు.
స్థానికత అంశంతో దేశ ప్రజలను రెండుగా చీల్చిన ఈ అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్షకు 52.25% ఓట్లు వచ్చాయని అధికారిక ఫలితాలు సూచిస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి సాజిత్ ప్రేమదాస తన ఓటమిని అంగీకరించారు.
సింహళీయుల మెజారిటీ ప్రాంతాల్లో రాజపక్షకు స్పష్టమైన ఆధిక్యం లభించగా, తమిళులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రేమదాస మెరుగైన ఫలితాలు సాధించారని విశ్లేషకులు చెబుతున్నారు.
ఏప్రిల్ నెలలో భీకరమైన తీవ్రవాద దాడి అనంతరం శ్రీలంకలో జరిగిన మొదటి ఎన్నికలివే.
ఈ ద్వీప దేశంలో ఈస్టర్ ఆదివారం ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న మిలిటెంట్లు చర్చిలు, విలాసవంతమైన హోటళ్ళ మీద జరిపిన బాంబుదాడుల్లో 250 మందికి పైగా చనిపోయారు.
ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నప్పుడే రాజపక్ష ఆధిక్యంలో ఉన్నారని గుర్తించిన ప్రేమదాస తన ఓటమిని అంగీకరించారు.

ఫొటో సోర్స్, Reuters
"ప్రజా తీర్పును గౌరవించడం నా బాధ్యత. శ్రీలంకకు ఏడో అధ్యక్షుడిగా ఎన్నికైన గోటాబయ రాజపక్షకు శుభాకాంక్షలు" అని ప్రేమదాస అన్నారు.
రాజపక్ష ట్విటర్‌లో స్పందిస్తూ దేశమంతా ఒక్కతాటిపై నడవాలని పిలుపునిచ్చారు. "ఈ ప్రయాణంలో శ్రీలంకలోని ప్రజలందరూ భాగస్వాములే" అని ట్వీట్ చేశారు.
ఈ ఎన్నికల్లో 83.7% మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల కమిషన్ తెలిపింది.
రాజపక్ష దేశాధ్యక్షుడిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సోదరుడి పాలనలో రక్షణ కార్యదర్శి
రాజపక్ష శ్రీలంకలోని బౌద్ధ సింహళీయుల మద్దతును విశేషంగా పొందగలిగారు. ఆయన సోదరుడైన మహింద రాజపక్ష పదేళ్ళపాటు దేశాధ్యక్షునిగా ఉన్నారు. దేశంలో సుదీర్ఘ కాలం కొనసాగిన అంతర్యుద్ధాన్ని అంతం చేసిన నేతగా ప్రజలు ఆయనను గుర్తిస్తారు.
ఇప్పుడు గోటాబయ రాజపక్ష దేశంలో మిలిటెంట్ల దాడుల తరువాత ఏర్పడ్డ అస్థిర పరిస్థితులను చక్కదిద్దాలని ఆయన మద్దతుదారులు కోరుకుంటున్నారు.
శ్రీలంకలో 2009లో అంతర్యుద్ధం ముగిసిన ముగిసిన తరువాత జరిగిన ఈ మూడవ అధ్యక్ష ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రస్తుత అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. ఈస్టర్ ఆదివారం నాటి తీవ్రవాద దాడుల తరువాత తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఆయన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు.
విశ్రాంత లెఫ్టినెంట్ కల్నల్ అయిన 70 ఏళ్ళ రాజపక్ష తన సోదరుడి అధ్యక్ష పాలనలో దశాబ్దం పాటు రక్షణ కార్యదర్శిగా ఉన్నారు. పొదుజన పెరుమున (ఎస్ఎల్‌పీపీ) పార్టీ అభ్యర్థి అయిన రాజపక్ష గతంలో అంతర్యుద్ధాన్ని అంతం చేయడంలో ముఖ్యపాత్ర పోషించారని భావిస్తారు. దేశ భద్రతకు సంబంధించిన సవాళ్ళను ఆయన సమర్థంగా ఎదుర్కోగలరనే ప్రచారం ఈ ఎన్నికల్లో ఆయనకు సానుకూల అంశంగా మారింది.
ఇవి కూడా చదవండి:
- వొడాఫోన్ ఐడియాకు మూడు నెలల్లో రూ. 51,000 కోట్ల నష్టానికి కారణాలేమిటి?
- పెగాసస్ ఎటాక్: వాట్సాప్‌ను తీసేస్తే మీ ఫోన్ సేఫ్ అనుకోవచ్చా?
- మసీదు దేవుడి ఇల్లయితే, మహిళలకు తలుపులు ఎందుకు మూస్తున్నారు...
- తెలంగాణ ఆర్టీసీ సమ్మె: కార్మికుల నిరాహార దీక్షలు... అశ్వత్థామరెడ్డి ఇంటివద్ద భారీగా పోలీసులు
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- సినీడ్ బుర్కీ: ఫ్యాషన్ మ్యాగజీన్ ముఖచిత్రంగా ఎదిగిన ‘లిటిల్ పర్సన్’
- వృద్ధాశ్రమాల్లో జీవితం ఎలా ఉంటుందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








