పాకిస్తాన్ : హిందూ విద్యార్థిని నిమ్రితా అనుమానాస్పద మృతి... పోలీసుల నివేదికను తప్పుపట్టిన బాధితురాలి కుటుంబం

ఫొటో సోర్స్, VISHAL CHANDANI
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్సులో నిమ్రితా కుమారి అనే హిందూ యువతి అనుమానాస్పద మృతికి గొంతు బిగుసుకోవడం కారణమని పోలీసులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు.
అయితే, నిమ్రితా ఆత్మహత్య చేసుకున్నారా లేక వేరే ఎవరైనా ఆమె గొంతు నులిమి హత్య చేశారా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
పోలీసుల నివేదికను నిమ్రితా కుటుంబ సభ్యులు తప్పుపట్టారు.
నిమ్రితాది హత్యేనని వారు ఆరోపిస్తున్నారు. ఈ కేసుపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
లర్కానాలోని బెనజీర్ భుట్టో మెడికల్ యూనివర్సిటీ (చండ్కా)లోని డెంటల్ కాలేజీలో నిమ్రితా ఫైనల్ ఇయర్ విద్యార్థిని.
కాలేజ్ హాస్టల్ గదిలో మంగళవారం ఆమె ప్రాణాలు లేకుండా కనిపించారు.
నిమ్రితా ఎంతటికీ తలుపులు తీయకపోవడంతో, ఆమె స్నేహితులు హాస్టల్ వాచ్‌మెన్‌ను పిలిచారని 'ద ట్రిబ్యూన్ ఎక్స్‌ప్రెస్' పేర్కొంది.
వాచ్‌మెన్ తలుపులు పగలగొట్టి చూసేసరికి నిమ్రితా మంచంపై పడి ఉన్నారని, ఆమె గొంతుకు తాడు బిగుసుకుని ఉందని తెలిపింది.

ఫొటో సోర్స్, Twitter/Viral Post
నిమ్రితా మృతిచెందినప్పుడు ఆమె గదికి లోపలి నుంచే గడియ పెట్టుందని, అయినా హత్య జరిగుండొచ్చన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నామని మసూద్ బంగ్ష్ అనే పోలీసు అధికారి బీబీసీతో చెప్పారు.
నిమ్రితాకు పోస్ట్‌మార్టం నిర్వహించిన సమయంలో ఆమె సోదరుడు డాక్టర్ విశాల్ చందానీ కూడా అక్కడే ఉన్నారని వివరించారు.
రెండు మూడు రోజుల్లో విచారణ పూర్తి కావొచ్చని మసూద్ అన్నారు.
పోలీసుల ప్రాథమిక నివేదికను విశాల్ చందానీ తోసిపుచ్చారు.
తన సమక్షంలో అధికారులు రిపోర్ట్‌లో నిమ్రితా రెండు చేతులు, కాళ్లపై గాయాల గుర్తులు ఉన్నాయని రాసుకున్నారని.. ప్రాథమిక నివేదికలో మాత్రం ఈ విషయం పేర్కొనలేదని ఆయన అన్నారు.
‘‘ఐదారు గంటలు ఆలస్యంగా మాకు నివేదిక ఇచ్చారు. రిపోర్ట్‌లో ఆంగ్ల అక్షరం ‘వీ’ ఆకారంలో గుర్తు ఉందని అంటున్నారు. నా దగ్గర ఎక్స్‌రే ఉంది. అందులో నలుపు రంగు మచ్చలు స్పష్టంగా ఉన్నాయి. నివేదిక పట్ల మేం పూర్తి అసంతృప్తితో ఉన్నాం. జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని చందానీ అన్నారు.

ఫొటో సోర్స్, twitter/viral post
కరాచీలో హిందువుల ఆందోళన
నిమ్రితా మృతిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాత్రి కరాచీలోని తీన్ తల్వార్ ప్రాంతంలో హిందువులు ఆందోళన ప్రదర్శన నిర్వహించారు.
సింధ్ ప్రావిన్సు మంత్రి ముకేశ్ చావ్లా ప్రదర్శన జరుగుతున్న చోటుకి వచ్చి, ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.
అయితే, సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా వచ్చి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చేవరకూ నిరసన విరమించబోమని ఆందోళనకారులు స్పష్టం చేశారు.
అనంతరం ముఖ్యమంత్రి సలహాదారుడు ముర్తాజా వాహబ్ వారిని సముదాయించారు. నిమ్రితా ఉన్న హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేశామని, యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌కు షాకాజ్ నోటీసులు జారీ చేశామని ఆయన చెప్పారు.
నిమ్రితాకు న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలోనూ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.
ట్విటర్‌లో #JusticeForNimrita అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అయ్యింది. పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖులు కూడా ట్వీట్లు చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘నిమ్రితా అనుమానాస్పద మరణం చాలా బాధ కలిగించింది. అసలు దోషులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నా. మతంతో సంబంధం లేకుండా ఏ పాకిస్తానీ కోసమైనా నా హృదయం స్పందిస్తుంది’’ అంటూ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘‘చాలా భయంగా ఉంది. అంతేసి ఫీజులు కడుతున్నా యూనివర్సిటీల్లో భద్రత లేదు. జైళ్లలాంటి హాస్టళ్లలో ఉండి ఏం లాభం? సమాజంలోని కామానికి బలి కావాలనే తల్లిదండ్రులు మమ్మల్ని పెంచుతున్నారా?’’ అని మెహ్‌విశ్ అనే ట్విటర్ యూజర్ ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
‘‘కాలేజ్‌లో నిమ్రితా నా సీనియర్. ఎప్పుడూ నవ్వుతూ కనిపించేవారు. ఆమెది ఆత్మహత్య చేసుకునే మనస్తత్వం కాదు. ఈ కేసుపై సరైన విచారణ జరగాలి’’ అని సైఫ్ ఉర్ రెహమాన్ అనే వ్యక్తి ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- పచ్చరాళ్ళ వేట కోసం డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు... ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు
- ఏరియా 51: అమెరికాలో రెండు పట్టణాలను గడగడలాడిస్తున్న 'ఏలియన్స్ జోక్'.. మానవ విపత్తులా మారిన ఫేస్‌బుక్ ఈవెంట్
- 11 తరాలుగా ఈ ఆలయంలో అర్చకులంతా దళితులే.. వివక్షను పారదోలిన ఉప్పులూరు చెన్నకేశవ ఆలయం ప్రత్యేకతలివీ
- టీమిండియా వన్డే మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం, ఇద్దరు బుకీలపై కేసు నమోదు
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- కశ్మీర్: వివాదాస్పద మరణాలతో రాజుకుంటున్న ఉద్రిక్తతలు
- #HowdyModi: అమెరికాలో మోదీ కార్యక్రమానికి రానున్న ట్రంప్
- హైదరాబాద్‌కు బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చింది?
- హైదరాబాద్‌లో పదిలంగా ఉన్న ‘పద్మావత్’ రాతప్రతి
- ‘తిలక్ ఇంకొన్నాళ్లు బతికుంటే భారత్-పాకిస్తాన్‌లు విడిపోయేవి కాదు’
- బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన తండ్రీకూతుళ్లు
- ఈ బంగారు టాయిలెట్‌ను ప్యాలస్ నుంచి ఎత్తుకెళ్లారు
- రాజు అంత్యక్రియల కోసం స్వర్గం నిర్మించిన థాయ్‌లాండ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








