శాండ్‌విచ్ ఆలస్యంగా తీసుకొచ్చాడని హత్య చేసేశాడు

ఫొటో సోర్స్, AFP
ఫ్రెంచ్ రాజధాని శివార్లలో శుక్రవారం నాడు ఓ వింత హత్య జరిగింది. 28ఏళ్ల వయసున్న ఓ వెయిటర్ సేవలపై అసంతృప్తికి గురైన ఓ వ్యక్తి అతడిని హత్య చేశాడు.
ఏఎఫ్‌పీ వార్తా సంస్థ అందించిన వివరాల ప్రకారం, తాను ఆర్డర్ చేసిన శాండ్‌విచ్ తీసుకురావడంలో ఆలస్యం కావడంతో అసహనానికి గురైన ఓ కస్టమర్.. వెయిటర్‌పై కాల్పులు జరిపాడు.
నోయిసీ-లీ-గ్రాండ్ పట్టణంలో పనిచేస్తున్న వెయిటర్ హత్యపై విచారణ చేస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ పట్టణం తూర్పు పారిస్‌లో ఉంటుంది, ఇక్కడ దాదాపు 60000 మంది ప్రజలు నివసిస్తున్నారు.
హత్య చేసిన అనంతరం హంతకుడు అక్కడినుంచి పరారయ్యాడు. ఇంకా అతడి ఆచూకీ లభ్యం కాలేదు.
తీవ్ర గాయాలపాలైన వెయిటర్‌ను కాపాడేందుకు అంబులెన్స్‌లోని వైద్య సిబ్బంది ఎంతో ప్రయత్నించారు. కానీ ఫలితం దక్కలేదు. భుజంలోనుంచి బుల్లెట్లు దూసుకెళ్లడంతో అతడు ప్రాణాలొదిలాడు.
మిస్ట్రల్ పిజ్జా, శాండ్‌విచ్ షాపు దగ్గరకొచ్చిన హంతకుడు తాను చెప్పిన ఆహారం తీసుకురావడంలో కొద్దిగా ఆలస్యం కావడంతో, తన ఆవేశాన్ని నియంత్రించుకోలేకపోయాడని హత్యకు గురైన వెయిటర్‌తో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు పోలీసులకు తెలిపారు.
ఈ హత్య స్థానికంగా నివాసముంటున్న ప్రజలను, వ్యాపారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇది చాలా విచారకరమని 29ఏళ్ల ఓ మహిళ ఫ్రెంచ్ మీడియాతో చెప్పారు.
"ఈ రెస్టారెంట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి సమస్యలూ లేవు. కొన్ని నెలల ముందే ఇది ప్రారంభమైంది" అని ఆమె అన్నారు.
అయితే, ఈ ప్రాంతంలో ఇటీవల కొన్ని నెలల కాలంలో నేరాలు పెరిగాయని కొందరు స్థానికులు వెల్లడించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మద్యం సేవించినవారు వీధుల్లో సృష్టించే సమస్యలు గణనీయంగా పెరిగాయని వారంటున్నారు.
ఇవి కూడా చదవండి.
- ఉడుము దాడిలో తీవ్రంగా గాయపడ్డ వృద్ధ జంట
- వరదలో 12 ఏళ్ల బాలుడి సాహసం.. సోషల్ మీడియాలో వైరల్
- ఇది కుందేళ్ల 'దండయాత్ర', కుదేలైన ఆర్థిక వ్యవస్థ
- 124 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేయడం ఎంత కష్టమో వీరి కళ్లలోకి చూస్తే తెలుస్తుంది
- "కశ్మీర్ పరిస్థితి ఏ రాష్ట్రానికైనా రావొచ్చు.. కేంద్రం చర్యకు ప్రతిఘటన కొరవడటం ఆందోళనకరం"
- కశ్మీర్ విషయంలో నెహ్రూ పాత్రేమిటి.. విలన్ ఆయనేనా
- పింగళి వెంకయ్య: జాతీయ పతాక రూపకర్తకు తగిన గుర్తింపు దక్కలేదా
- షార్క్‌లు మనుషులపై ఎందుకు దాడులు చేస్తాయంటే...
- అత్యధిక పోషక విలువలున్న 25 ఆహార పదార్థాలు ఇవే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








