'సచిన్ టెండూల్కర్ అందరికీ క్రికెట్ దేవుడు... నాకు మాత్రం కొడుకు లాంటి వాడు'

ఫొటో సోర్స్, SOLLY ADAM
- రచయిత, గగన్ సభర్వాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి, లండన్
భారత్‌లో నివసించిన ఆడం సోలీ యార్క్‌షైర్ మాజీ క్రికెటర్. ఇంగ్లండ్‌లో లీగ్ క్రికెట్ ఆడడానికి ఆయన ఎంతోమంది భారత, పాకిస్తానీ క్రికెటర్లకు సాయం చేశారు.
కానీ, సచిన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయన్ను ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కోసం ఆడిన మొదటి విదేశీ ఆటగాడు సచిన్. టెండూల్కర్‌కు ఆ ఛాన్స్ ఇప్పించింది ఆడమే.
అది 1992 నాటి విషయం. అప్పుడు యార్క్‌షైర్‌లో నివసించేవాళ్లకు మాత్రమే ఆ క్లబ్ కోసం క్రికెట్ ఆడే అవకాశం ఉండేది. కానీ, ఆడం సోలీ ప్రయత్నాలతో సచిన్ ఈ క్లబ్ కోసం ఆడిన తొలి బయటి ఆటగాడు అయ్యాడు.
బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆడం సోలీ... యార్క్‌షైర్‌లో ఉన్నప్పుడు సచిన్ తమతో ఎలా ఉండేవాడో గుర్తుచేసుకున్నారు.
ఆడం, సచిన్ మధ్య మంచి స్నేహం ఉంది. సచిన్ మిగతా అందరికీ క్రికెట్ దేవుడు కావచ్చేమో కానీ, నాకు మాత్రం నా కొడుకు లాంటివాడు అంటారు ఆడం సోలీ.
చాలామంది గొప్ప క్రికెటర్లు అయ్యారు. కానీ, సచిన్ వారందరికంటే చాలా భిన్నం అంటారు ఆడమ్.
క్రికెటర్లలో రెండు రకాలు ఉంటారు. వారిలో గాడ్ గిఫ్టెడ్ అయినవారు కష్టపడరు, రెండో వారు కష్టపడేవారు. సచిన్ దగ్గర గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ ఉన్నా, అతడు చాలా కష్టపడతాడు. అందుకే భారత్ క్రికెట్ అభిమానులు అతడిని క్రికెట్ దేవుడు అంటారు.

ఫొటో సోర్స్, SOLLY ADAM
మీరు సచిన్‌ను యార్క్‌షైర్ తీసుకురావాలని ఎప్పుడు నిర్ణయించారు.
యార్క్‌షైర్‌లో ఆడే అవకాశం అంత సులభంగా రాదు. చాలా గొప్పలు చెప్పుకోవాల్సి ఉంటుంది. నేను క్లబ్ వాళ్లతో చాలాసార్లు కలిశాను. వారితో చాలా గొడవ చేయాల్సొచ్చింది. చివరికి వాళ్లు ఒప్పుకున్నారు. తర్వాత నేను సచిన్ టెండూల్కర్ పేరు ప్రస్తావించాను.
మొదటిసారి సచిన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడ ఉండేవారు
సచిన్ నాతో "సోలీ భాయ్ నాకు వేరే ఇల్లు ఇవ్వండి. కానీ , డ్యూజ్‌బరీలోనే ఉంటాను" అన్నాడు. అతడికి తిండికి, బట్టలు ఉతుక్కోడానికి ఎలాంటి కష్టం రాలేదు. ఎందుకంటే అతడికి అవి చేయడమే రాదు.
సచిన్ బట్టలు మా వదిన లేదంటే నా భార్య ఉతికేది. ఇంట్లో ఏది చేస్తే అది తినేవాడు. ప్రత్యేకంగా ఏదీ కావాలని అడిగేవాడు కాదు.
సచిన్‌కు పిజ్జా అంటే చాలా ఇష్టం. మేం రాత్రి రెండు పిజ్జాలు తెప్పించేవాళ్లం. ఒకటి అతనిచ్చి, ఒకటి మేం ఆరుగురం తినేవాళ్లం.

ఫొటో సోర్స్, SOLLY ADAM
మీరు సచిన్‌ను బ్లాక్‌పూల్ తీసుకెళ్లారా
అది చాలా అందంగా ఉంటుంది. అక్కడ మేం చాలా సరదాగా గడిపాం. అన్ని రైడ్లూ ఎక్కాం. సచిన్ కూడా ఏ రైడూ వదల్లేదు.
మేం బిలియర్డ్స్ ఆడేవాళ్లం. తను అది అంతకు ముందెప్పుడూ ఆడలేదు. కానీ సచిన్ ఆట ప్రారంభించిన పది నిమిషాల్లోనే మిగతా అందరికంటే బాగా ఆడ్డం మొదలెట్టాడు.
వినోద్ కాంబ్లీ సచిన్‌కు చాలా మంచి ఫ్రెండ్. అతని క్రికెట్ కెరియర్ ఎందుకు విఫలమైంది
వినోద్ రెండేళ్లు నా కెప్టెన్‌షిప్‌లో ఆడాడు. తను చాలా టాలెంట్ ఉన్న క్రికెటర్. కానీ కష్టపడేవాడు కాదు. సచిన్ చాలా కష్టపడేవాడు. క్రికెట్ కష్టం కోరుకుంటుంది.
మీకు సచిన్ యార్క్‌షైర్‌లో ఆడిన తొలి మ్యాచ్ చూశారా
మేం కలిసే వెళ్లాం. చాలా ప్రాక్టీస్ చేశాం. సచిన్ నాతో "సోలీ భాయ్ నేనొక పనిచేయాలి. సెంచరీ చేయాలి" అన్నాడు. నేను సరే అన్నా. మొదట తను 50 రన్స్ చేశాడు అలా 80 వరకూ వెళ్లాడు. కానీ 86లో ఔట్ అయిపోయాడు.
సెంచరీ చేయలేకపోయానని చాలా నిరాశకు గురయ్యాడు. 86 చేశాననే సంతోషం కంటే ఔట్ అయిపోననే బాధ కనిపించింది.
డ్యూస్‌బరీలో సచిన్ చివరి రాత్రి ఎలా గడిచింది.
రాత్రి 11-11.30 అయ్యింది. ఎవరో తలుపు తట్టారు. నేను తెరిచాను. బయట సచిన్ ఉన్నాడు. నేను ఏమైంది అన్నాను.
సచిన్ నాతో "సోలీ భాయ్ వెళ్తున్నా. మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చా" అన్నాడు. నేను ముగ్గురు, నలుగురు క్రికెటర్లను లండన్ పిలిపించా. కానీ, వెళ్లే ముందు నాకూ, నా భార్య కాళ్లకూ నమస్కరించిన ఒకే ఒక క్రికెటర్ సచిన్.
ఇవి కూడా చదవండి:
- 'ఆడదానివి... ఆటో నడుపుతావా?' అని హేళన చేశారు!
- క్రికెట్: బౌలింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన హైదరాబాదీ
- సెల్ఫోన్లు ఎందుకు పేలుతున్నాయి?
- మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా, కాలేదా.. ఈ 7 సంకేతాలే చెబుతాయి!
- ఫోన్ స్కామ్: మొబైల్ ఫోన్లు హ్యాక్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నారు
- అమ్మాయిలు స్మార్ట్ ఫోన్లు వాడితే ప్రేమలో పడతారా?
- కరెంట్ లేనప్పుడు సెల్‌ఫోన్ చార్జ్ చేయడమెలా?
- ఐఫోన్ అంత స్మార్ట్ ఎలా అయ్యింది?
- సిమ్ కార్డు లేకుండా కాల్స్ చేసుకోవచ్చు.. డేటా వాడుకోవచ్చు!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








