'ఫుడ్ అనేది ఒక పోర్న్ అయితే... నేను పోర్న్ స్టార్‌ని'

భారతీయ స్ట్రీట్ ఫుడ్‌ని ఫైన్ డైనింగ్ వంటకాలుగా మారుస్తున్నారు చెఫ్ గగన్ ఆనంద్.
‘‘ఫుడ్ ఒక పోర్న్... నేను ఓ పోర్న్ స్టార్‌ని’’ అని తన గురించి అభివర్ణిస్తున్నారు బ్యాంకాక్‌లోని గగన్ రెస్టారెంట్ యజమాని, ఎగ్జిక్యూటివ్ చెఫ్ గగన్ ఆనంద్.
‘‘ఇక్కడికి వచ్చే ప్రతి అతిథీ బ్యాంకాక్‌లో ఆహారం గురించి ఓ అందమైన జ్ఞాపకంతో తిరిగి వెళ్లాలనేది నా తపన’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘మేం అన్ని అభినందనలూ అందుకున్నాం. దాదాపు అన్ని ఫుడ్ మీడియా అవార్డుల దృష్టినీ ఆకర్షించాం. కానీ జనం ఇక్కడికి ఆహారం కోసం వస్తారు. మీరు వచ్చేది రెస్టారెంట్‌కి కాదు. మీరు వచ్చేది మా ఇంటికి’’ అని గగన్ చెప్పారు.

భారతీయ ఫుడ్ అంటే.. అంతా కర్రీ హౌస్‌లేనని.. అయితే ‘‘నేను ఇండియన్‌ని. మిగతా వంటకాల కన్నా నా సొంత వంటకాలంటే ఎంతో గర్వం. ఎందుకంటే నేను పుట్టుకతో భారతీయుడిని. కర్రీ అనే సరిహద్దులకు ఆవలి భారతీయ వంటకాలను అందించాలన్నది నా కోరిక’’ అని గగన్ తెలిపారు.
2018లో ఆసియాలో అత్యుత్తమ 50 రెస్టారెంట్ల జాబితాలో గగన్ అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా నాలుగో ఏడాది కూడా. రెండు మిష్లిన్ స్టార్లు కూడా సంపాదించిందీ రెస్టారెంట్.

‘‘మీరు వంట తినటానికి ముందుగానే చవులూరించే ఘుమఘుమలు, అందమైన రూపం మీ ముందుకు వస్తాయి. ఈ వంటలను చేతులతో తినాలని మేం జనానికి చెప్తాం’’ అని గగన్ పేర్కొన్నారు.
‘‘చేతితో ఎందుకంటే? భారతీయుడిననే నా గర్వం దానికి కారణం. ఆ వంటను స్పర్శతో ఆస్వాదించాలి. అది వేడిగా ఉందా, చల్లగా ఉందా, మృదువుగా ఉందా, గట్టిగా ఉందా అనేది అనుభవించాలి. దానిని చేతితో తాకినపుడు మాత్రమే అది మనకు అనుభవమవుతుంది’’ అని వివరించారు.

ప్రతి రోజూ 90 శాతం మంది మా మీద తీర్పు ఇవ్వటానికి ఇక్కడికొస్తారని.. ఈ సంవత్సరం చాలా కఠినంగా ఉందని.. తాను ఇంకా కష్టపడి పని చేస్తున్నాని గగన్ చెప్పారు.
‘‘నాకు సాధ్యమైనదంతా నేను ఒక రెస్టారెంట్ ద్వారా సాధించాను. ఇప్పుడు నా చాలెంజ్ ఏమిటంటే నన్ను నేనే ఓడించటం’’ అని పేర్కొన్నారు.

2020లో గగన్‌ను మూసివేయాలన్నది ఆయన ప్రణాళిక. అయితే ‘‘వంట చేయటం నేను మానను. ఫీనిక్స్‌లా రూపాంతరం చెందాలన్నది నా కోరిక’’ అని స్పష్టం చేశారు.
‘‘ముందు కాలిపోనిదే పునరుద్ధానం ఉండదు కదా. వండు... చనిపోయేవరకూ వండు...’’ అన్నది తన అభిమతంగా చెప్పారు.
మొత్తానికి ఆయన 'ఫుడ్ అనేది ఒక పోర్న్ అయితే... నేను పోర్న్ స్టార్‌ని' అని చెప్పుకొచ్చారు.
- ఈ వీడియో చూస్తే ఇక ఎన్నడూ ఆహారం వృధా చేయరు!
- బ్రేక్‌ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా?
- ఎన్ఐఎన్: హైదరాబాద్ ఆహారంలో ఎక్కువగా ‘పురుగు మందులు’, పిల్లలపై అధిక ప్రభావం
- అన్నం ఎక్కువగా తింటే ముందుగానే మెనోపాజ్..!
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటి? పాటించకపోతే ఏమవుతుంది?
- ఇవి తింటే.. మీ జుట్టు భద్రం!
- చైనా ఎందుకు ఏటా 600 కోట్ల బొద్దింకలను ఉత్పత్తి చేస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









