ఈ ఫోటో మీ మానసిక ఒత్తిడిని చెప్పేస్తుందా? దీని ‘వెనుక’ నిజమేంటి?

ఫొటో సోర్స్, INSTAGRAM/YURYFROM
- రచయిత, అషిత నాగేష్
- హోదా, బీబీసీ-3 ప్రతినిధి
ఈమధ్యకాలంలో వాట్సాప్, ట్విటర్‌లలో ఇలాంటి చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. 'ఈ చిత్రం కదులుతున్నట్లు అనిపిస్తోందా? అస్సలు కదలడం లేదా?? మీకు అనిపించేది, కనిపించేదాన్నిబట్టి మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నారో తెలుసుకోండి' అంటూ చాలామంది ఈ ఫోటోను షేర్ చేశారు.
నిజంగా ఈ ఫోటో.. మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నారో చెబుతుందా?
చాలామందికి, ఈ ఫోటో కదులుతున్నట్లు కనిపిస్తుంది. కానీ ఇది అస్సలు కదలదు. ఈ ఫోటో ఎంత వేగంగా కదిలినట్లు అనిపిస్తే మీరు అంత ఎక్కువ ఒత్తిడిలో ఉన్నట్లు అర్థం అని సోషల్ మీడియాలో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది.

''ఈ స్టిల్ ఇమేజ్‌ను జపాన్‌కు చెందిన యమమోటో అనే ఒక న్యురాలజీ ప్రొఫెసర్ రూపొందించారు. ఈ ఫోటోలో ఎలాంటి కదలిక లేకపోయినా, లేదా కాస్త కదిలినట్లు కనిపించినా మీరు ఆరోగ్యంగా ఉన్నారని, బాగా నిద్రపోయారని అర్థం. ఈ బంతి నెమ్మదిగా కదులుతోందా.. మీరు ఒత్తిడిలో ఉన్నారని అర్థం. అలాకాకుండా బంతి వేగంగా కదులుతుంటే మాత్రం, మీకు ఒత్తిడి ఎక్కువగా ఉందని, ఇంకా మానసిక సమస్యలు కూడా ఉన్నాయని అర్థం!'' ఇదీ ఆ మెసేజ్ సారాంశం.
కానీ ఇది నిజం కాదు.
ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌ను ఉక్రెయిన్‌కు చెందిన 'యూరీ పరెపాదియా' అనే డిజైనర్ రూపొందించారు.
2016లో రూపొందించిన ఈ డిజైన్ వేయడానికి ఆయనకు 2 గంటల సమయం పట్టింది. ఈ బొమ్మకు, మీ ఆరోగ్యానికి ఎలాంటి సంబంధమూ లేదని 50ఏళ్ల యూరీ చెబుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘‘ఈ ఫేక్ న్యూస్‌ను నేను మొదటిసారిగా ఫేస్‌బుక్‌లో చూశాను. ఆ తర్వాత చాలా చోట్ల వార్త కనిపించింది'' అని యూరి 'బీబీసీ త్రీ'కి తెలిపారు.
''నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇది కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లే. సోషల్ మీడియాలో ఉంచిన ఈ పోస్ట్‌లను వెంటనే తొలగించాలని సదరు వ్యక్తులకు ఉత్తరాలు కూడా రాశాను''
ఈ పోస్టులను తొలగించడానికి ఓవైపు యూరీ ప్రయత్నిస్తుంటే, మరోవైపు ప్రజలు మాత్రం సోషల్ మీడియాలో ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. తమ ఆరోగ్య పరిస్థితి గురించి ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు.
ఈ ఫేక్ న్యూస్‌ను అడ్డుకోవడానికి యూరీ మరో అడుగు ముందుకేసి, తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఈ ఫోటోను పోస్ట్ చేసి, అసలు విషయాన్ని వెల్లడించారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
''ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌ను సెప్టెంబర్ 26, 2016న.. అడోబ్ ఇల్లస్ట్రేటర్‌లో వేశాను. దీన్ని రూపొందించడానికి 'అకియోషి కిటయోక' ఎఫెక్ట్‌ను వాడాను. రంగురంగుల బ్యాక్‌గ్రౌండ్‌పై నలుపు, తెలుపు రంగులతో గీయడంతో.. ఈ బొమ్మ కదులుతున్నట్లు కనిపిస్తుంది'' అని ఆ పోస్ట్ సారంశం.
ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాక ప్రజలకు అసలు విషయం తెలిసింది.. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది అని యూరీ అన్నారు.
''ఎప్పుడైతే ప్రజలకు ఈ ఫోటో రూపొందించింది నేనే అని తెలిసిందో, అప్పుడే నిజాన్ని వెలుగులోకి తేగలిగాను'' అని యూరీ అన్నారు.
మీరు ఒత్తిడిలో ఉన్నారా లేదా అనే విషయాన్ని ఒక ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటో ద్వారా తెలుసుకోవాలనుకోవడం సరి కాదు.
ఒకవేళ మీ మానసిక ఆరోగ్యం గురించి బెంగగా ఉంటే వెంటనే సరైన వైద్యులను సంప్రదించండి కానీ ఇలాంటి ఫోటోల జోలికి వెళ్లొద్దు.
ఇవి కూడా చదవండి
- జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ రద్దు: ఫ్యాక్స్ మెషీన్ ఇంత పనిచేసిందా?
- తెలంగాణ అసెంబ్లీ రద్దు వెనుక ఉన్నదేమిటి :ఎడిటర్స్ కామెంట్
- తెలంగాణలో 24 గంటల విద్యుత్ విజయమా? వ్యయమా?
- ‘క్రైస్తవ మత ప్రచారకుడిని చంపిన అండమాన్ ఆదిమజాతి ప్రజలు’
- శ్రీలంకలో శవాల దిబ్బ: మన్నార్ సమాధిలో 230 అస్థిపంజరాలు... అవి ఎవరివి? హంతకులెవరు?
- గజ తుపాను: నెలసరి సమయంలో ఇంటికి దూరంగా ఒక గుడిసెలో ఉన్న బాలిక మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








