‘గూగుల్ క్యాంపస్ మాకొద్దు’: బెర్లిన్‌లో ఆందోళనలు.. వెనక్కు తగ్గిన ఇంటర్నెట్ దిగ్గజం

ఫొటో సోర్స్, Getty Images
జర్మనీ రాజధాని నగరం బెర్లిన్‌లో ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఒక భారీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే, స్థానికులు పెద్ద ఎత్తున ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో గూగుల్ వెనక్కు తగ్గింది.
అమెరికాకు చెందిన గూగుల్ సంస్థకు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆరు క్యాంపస్‌లు.. లండన్, టెల్ అవీవ్, సోల్, మాడ్రిడ్, సాఓ పాలో, వార్సా నగరాల్లో ఉన్నాయి. ప్రతిపాదిత బెర్లిన్ క్యాంపస్ ఏడోది.
బెర్లిన్ నగరం, జిల్లాలో భాగమైన క్రాజ్‌బెర్గ్ ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేయాలని గూగుల్ భావించింది. అయితే, స్థానిక ఉద్యమకారులు గూగుల్ ఇక్కడ క్యాంపస్ ఏర్పాటు చేయటాన్ని వ్యతిరేకిస్తున్నారు.
సెప్టెంబర్‌లో ఉద్యమకారులంతా ఈ క్యాంపస్ ఏర్పాటు చేయదలచిన ప్రదేశంలో కొన్ని గంటలపాటు నిరసన తెలిపారు.
‘గుడ్ బై గూగుల్’, ‘గూగుల్ మంచి నైబర్ (పొరుగు) కాదు’ అంటూ వాల్ పోస్టర్లను కూడా అంటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఇంతకూ గూగుల్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
క్రూజ్‌బెర్గ్ ప్రాంతంలో అలజడుల సంస్కృతి ఎక్కువ. తాము మిగతా వాళ్లకు భిన్నమని స్థానికులు భావిస్తుంటారు.
గూగుల్ పన్నులు ఎగ్గొట్టడం, వ్యక్తిగత సమాచారాన్ని అనైతికంగా వాడుకోవటం వంటి దుష్ట పద్ధతులు అవలంబిస్తోందని కొందరు చెబుతున్నారు.
ఇంకొందరేమో గూగుల్ ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే తలెత్తే సమస్యలను ప్రస్తావిస్తున్నారు. అందులో ఒకటి ఈ ప్రాంత పునరుద్ధరణను పట్టించుకోకపోవడమని వారు చెబుతున్నారు.
నైట్ ఫాక్స్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చెప్పిన వివరాల ప్రకారం 2016-17 సంవత్సరాల మధ్య ఇళ్ల ధరలు బెర్లిన్‌లో 20 శాతం పెరిగితే క్రూజ్‌బెర్గ్‌లో 71 శాతం పెరిగాయి.

ఫొటో సోర్స్, AFP
గూగుల్ ఏమంటోంది?
బెర్లిన్ క్యాంపస్ ఏర్పాటు విషయంలో గూగుల్ వెనక్కు తగ్గింది. ఈ ప్రతిపాదనను విరమించుకుంది. క్యాంపస్ ఏర్పాటు చేద్దామని భావించిన ప్రాంతాన్ని స్థానిక మానవతా బృందాలకు అప్పగిస్తామని తెలిపింది.
ఈ నిర్ణయానికి ప్రధాన కారణం స్థానికంగా వచ్చిన వ్యతిరేకతేనా? అన్న ప్రశ్నకు మాత్రం గూగుల్ నేరుగా స్పందించలేదు.
‘‘ఆందోళనలు మా కార్యకలాపాలను నిర్ణయించలేవు’’ అని గూగుల్ అధికార ప్రతినిధి రాల్ఫ్ బ్రెమెర్ బెర్లినర్ జీటుంగ్ పత్రికతో అన్నారు. స్థానిక మానవతా బృందాలతో చర్చలు జరిపిన తర్వాత, ఈ ప్రాంతాన్ని వాటికి ఇవ్వటమే ఉత్తమమని కంపెనీ భావించిందని ఆయన తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
గూగుల్ కోసం పనిచేసే స్టార్టప్‌లకు చెందిన రోవన్ బెన్నెట్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతం ఇకపై ‘‘సామాజిక కార్యకలాపాల కేంద్రం’’ అవుతుందని, ఈ నిర్ణయం పట్ల సంస్థ సంతృప్తిగా ఉందని తెలిపారు.
గూగుల్ నిర్ణయంతో లబ్ధి పొందుతున్న మానవతా బృందాలు- ఆన్‌లైన్ డొనేషన్లకు వేదిక అయిన ‘బెటర్ ప్లేస్’, చిన్నారులకు సహాయ సహకారాలు అందించే ‘కరుణ’.
ఇవి కూడా చదవండి:
- చికాకు పెట్టే ప్రకటనలకు గూగుల్ చెక్!
- గూగుల్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇలా డిలీట్ చెయ్యండి!
- అభిప్రాయం: బెంగాల్ గెజిట్ - భారతదేశపు మొట్టమొదటి వార్తాపత్రిక
- పటేల్ విగ్రహానికి రూ.2989 కోట్లు.. స్థానిక రైతులకు నీళ్లు కరువు
- జంతువులతో ఆటాడుకున్న భారతీయ రింగ్ మాస్టర్
- డేజా వూ: ‘ఎక్కడో చూసినట్టుందే’ అని మీరు అనుకోవడానికి 8 కారణాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








