బిగ్‌బాస్ పెద్దన్న 'బిగ్ బ్రదర్' ఇక కనిపించడు

బిగ్ బ్రదర్ షో

ఫొటో సోర్స్, channel 5

తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం బిగ్‌బాస్ రెండో సీజన్ కొనసాగుతోంది. బాహ్య ప్రపంచానికి దూరంగా ఒక ఇంట్లో కొందరు సెలబ్రిటీలను ఉంచి వారానికి ఒకరిని ప్రజల ఆన్‌లైన్ ఓట్ల ప్రాతిపదికన బయటకు పంపే ఈ టీవీ షోను నిత్యం వేలాది మంది చూస్తున్నారు.

ఎంతో డ్రామా, మరెన్నో వివాదాలు, వినోదంతో రక్తికట్టిస్తూ వివిధ భారతీయ భాషల్లో ప్రసారమవుతున్న ఇలాంటి షోలకు మాతృక బ్రిటన్‌కు చెందిన ఇంగ్లిష్ చానల్ 'చానల్ 5'లో వచ్చే బిగ్ బ్రదర్.

ఇప్పుడా బిగ్ బ్రదర్ షోను ఆపేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. శుక్రవారం రాత్రి నుంచి బిగ్ బ్రదర్ 19వ సీజన్ మొదలవుతుండగా.. ఇదే చివరి సీజన్ అని.. ఇది ముగిశాక ఇక బిగ్ బ్రదర్ వచ్చే ఏడాది నుంచి ఉండదని ట్విటర్ వేదికగా చానల్ 5 ప్రకటించింది. దీంతోపాటుగా సెలబ్రిటీ బిగ్‌బ్రదర్ షో కూడా నిలిపివేయనున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

బిగ్ బ్రదర్ షో మొట్టమొదట 2000 సంవత్సరంలో మొదలైనప్పుడు విపరీతమైన జనాదరణ పొందింది.

కానీ, ఇటీవల కాలంలో వీక్షకులు తగ్గారని గణాంకాలు చెబుతున్నాయి.

తొలుత ఈ షో చానల్ 4లో ప్రసారమయ్యేది. 2010 నుంచి చానల్ 5కి మారింది.

మరిన్ని కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)