అలస్టర్ కుక్: కెరీర్ తొలి మ్యాచ్, ఆఖరి మ్యాచ్‌లోనూ అదే రికార్డు.. రెండూ భారత్‌పైనే

ఫొటో సోర్స్, Getty Images
ఇంగ్లండ్ ఆటగాడు అలస్టర్ కుక్ ప్రస్తుతం తన క్రికెట్ కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్నాడు. భారత్‌తో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 71 పరుగులు చేసిన కుక్, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ(109*) నమోదు చేశాడు. ఈ మ్యాచ్ తరువాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వనున్నట్లు కుక్ గతంలోనే ప్రకటించాడు.
కుక్ చివరి టెస్ట్ మ్యాచ్‌తో పాటు మొదటి మ్యాచ్‌లో ప్రత్యర్థి కూడా భారతే కావడం విశేషం. 2006లో నాగ్‌పూర్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌తో కుక్ టెస్ట్ క్రికెట్ కెరీర్ మొదలైంది. ఆ మ్యాచ్‌లో కూడా కుక్ తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం (60పరుగులు), రెండో ఇన్నింగ్స్‌లో శతకం (104 నాటౌట్) నమోదు చేశాడు.
ప్రస్తుత మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు విసిరిన ఓవర్ త్రో కారణంగా ఐదు పరుగులు రావడంతో కుక్ సెంచరీ పూర్తయింది. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయగానే స్టేడియంలో ప్రేక్షకులంతా చాలాసేపు నిల్చొని అతడికి చప్పట్లతో అభినందనలు తెలిపారు.
ఇంగ్లండ్ ఆల్‌టైం గ్రేట్ బ్యాట్స్‌మన్‌లలో కుక్ ఒకడని చెబుతారు. ఆ దేశం తరఫున అత్యధిక మ్యాచ్‌లకు(59టెస్టులు, 69వన్డేలు) కెప్టెన్సీ చేసిన ఘనత అతడిదే.

ఫొటో సోర్స్, Getty Images
కుక్ గురించి క్లుప్తంగా
ఇతర సెలెబ్రిటీలకు భిన్నంగా కుక్‌కు ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఎకౌంట్లు లేవు. ఇప్పటిదాకా అతడు ఎలాంటి వివాదాల్లోనూ చిక్కుకోలేదు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్నప్పటికీ కుక్ మొదట్నుంచీ 20-20 మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. నాలుగు మ్యాచ్‌లు ఆడిన అనంతరం ఆ ఫార్మాట్ తనకు సరిపడదని నిర్ణయించుకుని, స్వచ్ఛందంగా 20-20ల నుంచి తప్పుకున్నాడు.
క్రికెట్ ఆడని రోజుల్లో కుక్ వ్యవసాయం చేస్తాడు. గొర్రెల పెంపకం అతడికి ఎంతో ఇష్టమైన వ్యాపకం. ‘గొర్రెలు నన్ను క్రికెట్ గురించి ఏమీ అడగవు. అందుకే వాటితో సమయం గడపడం నాకెంతో ఇష్టం’ అంటాడు కుక్.
ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టులు ఆడింది(161) అత్యధిక టెస్టు పరుగులు చేసింది అతడే(12,254*). ఆ దేశం తరఫున అత్యధిక టెస్టు సెంచరీల రికార్డు(33*) కూడా కుక్ పేరిటే ఉంది.
ఇవి కూడా చదవండి
- క్రికెట్ 'ఉక్కు మనిషి' సీకే నాయుడు
- BBC SPECIAL: అంధులు క్రికెట్ ఎలా ఆడతారు?
- కాలు లేకపోయినా క్రికెట్‌లో సూపర్‌స్టార్
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
- క్రికెట్: ఇంగ్లండ్‌లో భారత జట్టు విజయాలను చేజార్చుకోవడానికి నాలుగు కారణాలు
- BBC exclusive: ‘టీం ఇండియా దశ, దిశ మార్చా.. నన్నే టీంలోంచి తీసేశారు’
- ద్రవిడ్ గురించి ఆయన భార్య విజేత ఏమన్నారు?
- బాల్ ట్యాంపరింగ్: పాకిస్తాన్ ఆటగాళ్లపైనే ఆరోపణలెక్కువ!
- ‘భాగస్వామిని ఆకట్టుకునే శృంగార కళను మర్చిపోతున్న భారతీయులు’
- పెట్రోలుపై పన్నులు ఏ రాష్ట్రంలో ఎంత? పొరుగు దేశాల్లో ధరలెలా ఉన్నాయి?
- ఫ్యాషన్ ప్రపంచంలో జుట్టు లేకుండా మోడలింగ్ చేయడం సాధ్యమా?
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








