ఇవి చైనా సృష్టించిన కృత్రిమ దీవులు
దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్యం కోసం చైనా తహతహలాడుతోంది. పొరుగు దేశాలు, మిత్ర పక్షాలు అభ్యంతరం చెబుతున్నా పట్టించుకోవడం లేదు. సముద్రంలో కృత్రిమంగా ద్వీపాలను నిర్మిస్తూ వాటిని మిలటరీ స్థావరాలుగా మారుస్తోంది. ఈ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించేందుకు సిద్ధమవుతోంది. అయితే, అమెరికా మాత్రం చైనా ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని చెబుతోం
ఇది చైనా నౌకాదళం, ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అమెరికా నావికా దళానికి సున్నితంగా చెబుతోంది.
(నాన్‌షా దీవులపై చైనాకు హక్కు ఉంది)
దక్షిణ చైనా సముద్రంలో చాలా దూరం వెళ్లిన తర్వాత చైనా కొత్తగా నిర్మించిన ద్వీపాలను మేం చేరుకోగలిగాం.
మనం ఇక్కడ ఉండటం వారికి ఇష్టం లేదనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది.
"మన మధ్య అపార్థాలు రాకుండా ఉండాలంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి. దూరంగా వెళ్లండి."
ఈ యూఎస్ నౌకాదళం పీ8 నిఘా విమానంలోని సిబ్బంది రోజూ ఈ హెచ్చరికల్ని ఎదుర్కొంటూనే ఉంటారు.

అమెరికా నౌవికా దళ పైలట్: ఈ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు రోజు మేం ఎదుర్కొనే సంఘటనలే ఇవి. వారి మా దగ్గరకు రాగానే సరైన రీతిలో స్పందించి మేం వెనక్కి వెళ్లిపోతాం. మేం చేసే ఆపరేషన్ పై ఈ హెచ్చరికల ప్రభావం ఏ మాత్రం పడదు.
కోట్లాది టన్నుల ఇసకతో కృత్రిమ దీవి
మేం వారికి 12 నాటికల్ మైళ్లు సమీపంలోకి వెళ్లినట్లయితే, అక్కడ చైనా భారీ ఎత్తున చేపట్టిన అభివృద్ధి పనుల్ని చూడవచ్చు.
ఈ ప్రాంతాన్ని రెండున్నరేళ్ల కిందట మిస్‌చీఫ్ రీఫ్ అని ఈ ప్రాంతాన్ని పిలిచే వారు.
కోట్లాది టన్నుల ఇసుకతో నింపి దీన్ని కృత్రిమ దీవిగా మార్చారు.
ఇక్కడ రన్ వే ను మాత్రమే నిర్మించారు. భవన నిర్మాణాలేం జరగలేదు.
ఇప్పుడు అదే ప్రాంతాన్ని చూడండి. రాడార్ డోములు, ఏయిర్ క్రాఫ్ట్ లంగర్లు, బహుశా క్షిపణి ప్రయోగ నిర్మాణాలు కూడా వచ్చినట్టున్నాయి.

విమానంలోని అత్యాధునిక కెమెరాను ఉపయోగించి అక్కడ రైన్ వే పై తిరుగుతున్న వాహనాలను చూశాం.
1,2,3,4,5,6,7,8,9,--- 9 వాహనాలు వెళ్తున్నాయి. కానీ రవ్ వే మీద ఏం లేనట్లే కనిపిస్తోంది. ప్రస్తుతానికి అక్కడ ఏయిర్ క్రాఫ్ట్‌లు లేవు.
ఇక్కడున్న విమానాలు కేవలం నిఘా కోసమే పెట్టినవి కాదని అమెరికా చెబుతోంది.
"విస్తృత కోణంలో చూస్తే ఇంటర్నేషనల్ ఏయిర్ స్పేస్‌లో మిలటరీ ఏయిర్ క్రాఫ్ట్‌లతో ప్రయాణించే హక్కు మాకు ఉంది. ఇక్కడ మా ఉనికిని కొనసాగిస్తునే ఉంటాం. వారిక్కడ నిర్మాణాలు చేపడుతున్నారనే ఆందోళన మాకు లేదు. దక్షిణ చైనా సముద్రంలో మా నిఘా కొనసాగుతుంది."
చైనా నావిక దళం తన పక్కనే ఉన్న బలహీన దేశం ఫిలిప్పీన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ సిబ్బందితో ఎలా మాట్లాడుతుందో చూస్తే ఆ దేశం ఇక్కడ ఎలా ఆధిపత్యం సాధిస్తుందో చూడొచ్చు.
"ఫిలిప్పీన్స్ మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్ సిబ్బందిని మళ్లీ హెచ్చరిస్తున్నాం. ఇక్కడి నుంచి వెంటనే వెళ్లండి లేదా జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాలి."
ఈ స్థావరాలతో దక్షిణ చైనా సముద్రంపై చైనా పట్టు సాధిస్తోంది. ఇక్కడి భౌగోళిక ముఖచిత్రాన్ని విజయవంతంగా మార్చేస్తోంది.
చైనా పొరుగు దేశాలకు అమెరికా అండదండలు ఉన్నప్పటికీ బీజింగ్ కూడా బలమైన శక్తిగా ఎదుగుతోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









