కెనడాలో కాల్పులు: దేశంలో దడ పుట్టిస్తున్న గన్ కల్చర్

కాల్పుల మృతులకు నివాళి

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, రాబిన్ లెవిన్సన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వేసవిలో జరిగిన వరస తుపాకీ కాల్పుల ఘటనలు కెనడా వాసుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. టొరంటోలో ఈ ఏడాది ఎండాకాలం చాలా చోట్ల తుపాకీ కాల్పుల ఘటనలు జరిగాయి.

తాజాగా శుక్రవారం న్యూ బ్రన్‌స్విక్‌లోని ఫ్రెడెరిక్టన్ నగరంలో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు.

కాల్పులు జరిపిన నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. వీరిని సారాబర్న్స్, రాబ్ కాస్టిల్లోగా గుర్తించారు.

చనిపోయిన ఇద్దరు పౌరుల్లో ఒక మహిళ, పురుషుడు ఉన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఉదయం 7 గంటల తర్వాత కాల్పుల శబ్దం వినిపించినట్టు స్థానిక టీవీ విలేకరి తెలిపారు.

నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు గాయపడ్డ అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతని పేరు ప్రకటించలేదు. ఈ కేసును కెనెడా ఫెడరల్ పోలీస్ ఫోర్స్ దర్యాప్తు చేస్తోంది.

కాల్పులు జరిగిన ప్రదేశం
ఫొటో క్యాప్షన్, ఫ్రెడరిక్టన్‌లో కాల్పులు జరిగిన ప్రదేశం

కెనడాలో పెరిగిన కాల్పుల సంస్కృతి

ఈ ఏడాది మే నుంచి టొరంటోలో 109 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిలో గత ఆదివారం డాన్‌ఫోర్త్ అవెన్యూపై జరిగిన దాడి కూడా ఉంది. ఈ దాడిలో తుపాకీతో వచ్చిన ఓ వ్యక్తి జనంపై విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు, ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు.

కెనెడాలో తుపాకీ హింస పెరుగుతోంది అనడానికి తాజా ఘటనలే సంకేతం అని చాలామంది భావిస్తున్నారు.

"నగరంలో తుపాకీ కాల్పుల ఘటనల సమస్య మాకు అంతకంతకూ పెరుగుతోంది" అని టొరంటో సిటీ కౌన్సిలర్ జో క్రెస్సీ బీబీసీకి చెప్పారు.

కాల్పుల ఘటన జరిగిన తర్వాత రోజు నగర పరిధిలో, హ్యాండ్ గన్స్, తూటాల అమ్మకాలపై నిషేధం విధించాలని క్రెస్సీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక తీర్మానం ప్రతిపాదించారు. అది 41-4 ఓట్ల తేడాతో ఆమోదం కూడా పొందింది.

క్రెస్సీకి ముందు గన్ కంట్రోల్ నిబంధనలు మరింత కఠినం చేయాలంటూ మార్చిలో లిబరల్ ప్రభుత్వం బిల్లు పెట్టింది. టొరంటో సిటీ కౌన్సిల్ ఓటింగుకు స్పందించిన మంత్రి నగర పరిధిలో నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తానని కూడా వారికి హామీ ఇచ్చారు.

కానీ ఈ నిషేధం వల్ల నగర పరిధిలోని పరిమితి ఉన్న తుపాకులు, సెమీ ఆటోమేటిక్ ఆయుధాల అమ్మకాలపై మాత్రమే ప్రభావం ఉంటుంది. పౌరులు వేరే ప్రాంతాలకు వెళ్లి తుపాకులు కొనే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాల్పుల మృతులు

కాల్పుల్లో పెరిగిన మృతుల సంఖ్య

అమెరికా, కెనడాలో తుపాకీ వాడకంపై అదుపు ఉండాలని జరుగుతున్న చర్చ ఎక్కువగా అసాల్ట్ రైఫిల్స్, సెమీ ఆటోమేటిక్ ఆయుధాలు, హ్యాండ్ గన్స్ చుట్టూనే తిరుగుతోంది. కాల్పుల ఘటనల్లో ఎక్కువగా వీటినే ఉపయోగించారు.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం కెనెడాలో తుపాకీ కాల్పుల ఘటనలు 2013 నుంచి పెరుగుతున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. 2016లో ఆయుధాలతో సంబంధం ఉన్న ఘటనల్లో 223 మంది చనిపోయారు. 2005 తర్వాత ఈ సంఖ్య మరింతగా పెరిగింది.

వీటిలో సగానికి పైగా హత్యలు గ్యాంగుల మధ్య గొడవల వల్లే జరుగుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన వార్షిక హత్యల నివేదిక ప్రకారం, వీటిలో ఎక్కువ మరణాలు టొరంటో, వాంకోవర్‌లలో జరిగాయి.

పోలీసుల గణాంకాల ప్రకారం 2018లో ఇప్పటివరకూ ఒక్క టొరంటోలోనే 228 కాల్పుల ఘటనలు జరిగాయి. 2017లో ఏడాదంతా కలిపి ఇవి 205 మాత్రమే జరిగాయి.

నగరంలో జరిగిన తుపాకీ కాల్పుల్లో 2017లో 17 మంది చనిపోతే, 2018లో ఇప్పటికే 28 మంది మరణించారు.

పొరుగు దేశాలతో పోల్చుకోవడం మాని, ప్రభుత్వం దేశంలో తుపాకీ కాల్పులను నియంత్రించాలని కెనడాలోని కొంతమంది న్యాయవాదులు వాదిస్తున్నారు.

బ్రిటన్, ఆస్ట్రేలియాతో పోలిస్తే కెనడాలో తుపాకీ హింస ఎక్కువ. ఈ దేశంలో ఉన్న తుపాకీ చట్టాలు, అక్కడ వాటి ప్రాబల్యం పెరిగేలా చేస్తోంది.

కెనెడాలో కాల్పులు

ఫొటో సోర్స్, KEV BOURQUE/VIA REUTERS

ఫొటో క్యాప్షన్, ఫ్రెడెరిక్టన్‌లో కాల్పులు జరిగిన ప్రాంతం

కెనడాలో తుపాకీ కొనడం ఎంత కష్టం?

కెనడా తుపాకీ చట్టాలు అమెరికా చట్టాలతో పోల్చితే కఠినంగా ఉంటాయి. తుపాకీ కలిగి ఉండడాన్ని కెనడా ప్రభుత్వం చట్టబద్ధం చేసింది. తుపాకులను పరిమితి ఉన్నవి, పరిమితి లేనివి, నిషేధించినవిగా విభజించారు..

హ్యాండ్ గన్స్, సెమీ ఆటోమేటిక్ ఆయుధాలు ఎక్కువగా పరిమిత శ్రేణిలో వస్తాయి. చట్టప్రకారం తుపాకీని తమ దగ్గర ఉంచుకోవాలంటే దాన్ని వాడేవారు, కచ్చితంగా సేఫ్టీ పరీక్షలు పాస్ అయ్యుండాలి. దానికి దరఖాస్తు చేసుకునేవారి నేర చరిత్ర, మానసిక ఆరోగ్యం, నేపథ్యం కూడా పరిశీలించాలి.

తుపాకీ ఉన్న వారికి ఒక షూటింగ్ పరిధి కూడా ఉంటుంది. తుపాకీని తమతోపాటూ తీసుకెళ్లడానికి ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్ కూడా ఉండాలి.

ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్‌ ఉన్న వ్యక్తి ఎప్పుడండే అప్పుడు తనతో తుపాకీ తీసుకెళ్లడం కుదరదు. దానిని ఇంటి నుంచి షూటింగ్ పరిధి వరకు తుపాకీ ప్రదర్శన, తుపాకీ రిపేర్, పోలీస్ స్టేషన్, లేదా సరిహద్దు వరకూ మాత్రమే తీసుకెళ్లచ్చు.

వివిధ దేశాల్లో మృతుల సంఖ్య

ఈ తుపాకీలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి?

కెనడాలో కాల్పుల ఘటనలకు కారణమవుతున్న తుపాకీలు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది తెలుసుకోవడం కష్టంగా మారింది.

దేశంలో తుపాకీల యజమానులపై ఆంక్షలు ఉన్నా, గత దశాబ్దం నుంచీ పరిమితి ఉన్న తుపాకీలు కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2004లో దేశంలో వీటి సంఖ్య దాదాపు 4 లక్షలే ఉండగా, 2016 కల్లా వాటి సంఖ్య 8 లక్షలకు పైగా పెరిగింది.

ఈ గణాంకాల్లో అక్రమంగా కొనుగోలు చేసినవి, దేశంలోకి అక్రమ రవాణా అయిన తుపాకులు లేవు. ఆదివారం టొరంటోలో జరిగిన తుపాకీ కాల్పుల్లో నిందితుడు ఫైజల్ హుస్సేన్ ఉపయోగించిన హ్యాండ్ గన్‌ అమెరికా నుంచి కెనెడాకు అక్రమ రవాణా ద్వారా తీసుకొచ్చారు.

అమెరికా నుంచి వచ్చి కెనడాలో నివసిస్తున్న వారు కూడా ఆ దేశంలో తుపాకీ సంస్కృతి చూసి ఆశ్చర్యపోతున్నారు.

"కెనడాలో తుపాకీ దొరకడం అసాధ్యం అనుకున్నా, కానీ అది నిజం కాదు" అని జూయాంగ్ లీ అన్నారు. టొరంటో యూనివర్సిటీకి చెందిన ఈ సోషియాలజీ ప్రొఫెసర్ తుపాకీ హింస మూలాలపై స్పెషలైజేషన్ చేశారు.

"సమాజం ప్రమాదంలో ఉందని చెప్పడానికి మేం తుపాకీ హింసను కూడా ఒక లక్షణంగా చూస్తాం అని లీ తెలిపారు. హ్యాండ్ గన్స్ నిషేధించాలనే టొరంటో నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. కానీ ప్రజలు విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాల కంటే, తుపాకీ హింస వైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారనే విషయంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని లీ భావిస్తున్నారు.

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)