#BBCArchives: ఆకాశంలో ఎగిరే పళ్లాలు నిజంగానే ఉన్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
ఇతర గ్రహాల నుంచి ఎగిరే పళ్లాలు కనిపించినట్లు దశాబ్దాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, ఇంతవరకూ ఏదీ శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. అయితే, 1967లో ఒక రాత్రి స్కై వాచర్స్ అనే ఒక బృందం గ్రహాంతర అద్భుతాలు ఏమైనా కనిపిస్తాయేమోని పరిశీలించింది. వారితో కలిసి ఆ అద్భుతాల కోసం బీబీసీ కూడా ఎదురు చూసింది. ఆ సందర్భంగా అందించిన ఆసక్తికర కథనం.. బీబీసీ ఆర్కైవ్స్ నుంచి.
ఆకాశంలో గుర్తించలేని ఎగిరే వస్తువు (అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ - యూఎఫ్‌వో)లను కనుగొని ఏదైనా ఒక యూఎఫ్‌వోను స్పష్టంగా గుర్తించాలని స్కై వాచర్స్ బృందం సొంతంగా ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది.
ఈ బృందం సభ్యులు గ్రహాంతర వాసులు నిజంగానే ఉన్నారని నమ్మారు. కొంతమందైతే అటువంటి వారిని చూశామని కూడా చెప్పారు.
‘‘ఎస్సెక్స్‌కు పశ్చిమాన ఆరు నిమిషాల కిందట ఒక సిగార్ ఆకారంలో ఉన్న వస్తువు కనిపించింది’’ అని కొలిన్ మెక్ కార్తీ చెప్పారు.
కొలిన్ మెక్ కార్తీ ఆస్ట్రేలియాకు చెందిన ఒక ఎలక్ట్రానిక్ ఇంజినీర్. ఆయన తాను యూఎఫ్‌వోలు ఉన్నాయని ఎందుకు నమ్ముతారో ఇలా చెప్పారు.
‘‘చాలా ఏళ్ళ పాటు నేను వీటిని నమ్మే వాడిని కాదు. కానీ, నాసాతో పని చేసిన తరువాత, నేనొక నిర్ధరణకు వచ్చాను. యూఎఫ్‌వోలు నిజంగానే ఉన్నాయి, ఎందుకంటే మనం తల తిప్పుకోలేని విషయాలున్న కొన్ని ఫైళ్లను నేను చదివాను. గత పది పదిహేనేళ్లకు సంబంధించిన సమాచారం ఈ ఫైళ్లలో ఉంది. ఈ నివేదికలన్నీ శాస్త్రీయంగా విశ్లేషించినవే’’ అని కొలిన్ మెక్ కార్తీ అన్నారు.
కొలిన్ మెక్ కార్తీ ఒక యూఎఫ్‌వో డిటెక్టర్‌ను కూడా కనిపెట్టి, దాన్ని విక్రయించేవారు. యూఎఫ్‌వోలు నిజంగానే ఉన్నాయన్న నమ్మకం ఈరోజుకి అలానే ఉంది.
వైజ్ఞానిక కల్పనను ఒక వాస్తవంగా నిరూపించడానికి గంటల కొద్దీ అలా కూర్చుని యూఎఫ్‌వోలకు సంబంధించి ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని ఎదురు చూడడం.. ఈ స్కై వాచర్స్ బృందానికి చాలా ఉత్తేజకరమైన అనుభవం.
ఇవి కూడా చదవండి:
- ఇంతకీ ఆ అంతరిక్ష కేంద్రం ఎక్కడ పడుతోందంటే..!
- అంతరిక్షంలో పిజ్జా.. తయారైందిలా
- అంతరిక్షంలో వినిపిస్తున్న ఒకేఒక్క భారతీయ గీతం
- అంతరిక్షంలో ఏడాది గడిపితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- మేఘాల పైకెళ్లి మెరుపులు చూద్దామా!
- అమెరికా అంతరిక్ష సైనిక వ్యవస్థ సాధ్యమయ్యే పనేనా?
- మల్టీప్లెక్స్: సినిమా టికెట్ రూ.150, పాప్‌కార్న్ రూ.270 ఎందుకిలా?
- పాకిస్తాన్ ఎన్నికలు: హిందూ మహిళలకు గుర్తింపు కార్డులు ఇవ్వట్లేదు
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
- Exclusive: అమెరికా యుద్ధ విమానాల నుంచి చిత్రీకరించినట్లు చెబుతున్న ఈ వీడియోలో ఎగురుతున్నది ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









