ఆస్కార్ , నాసాల ‘బంగారు’ బంధం

ఫొటో సోర్స్, Getty Images
ఆస్కార్‌ను, నాసాను కలిపే బంధం ఏమిటో మీకు తెలుసా? దూరాన ఉన్న గెలాక్సీలను చూసేందుకు నాసా తన టెలిస్కోపులపై ఉపయోగించే బంగారు పూతే ఆస్కార్ ట్రోఫీపైనా ఉంటుంది.
గత మూడు దశాబ్దాలుగా ఆస్కార్ ట్రోఫీని రూపొందిస్తున్న పోలిచ్ టాలిక్స్ సంస్థ దానిని తగరంతో తయారు చేసి, దానిపై బంగారు పూత పూస్తోంది. అయితే ఆ పూత తొందరగా పోతుండడంతో ఆస్కార్ ప్రతిమలు వన్నె కోల్పోతున్నాయి.

ఫొటో సోర్స్, NASA
నాసాకు బంగారంతో పనేంటి?
అంతరిక్ష ప్రయోగాల కోసం నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను ప్రయోగించింది.
అంతరిక్షంలో బంగారం చాలా ఉపయోగం చాలా ఎక్కువ. ఎందుకంటే కాంతి ఇన్‌ఫ్రారెడ్ తరంగ దైర్ఘ్యాలను బంగారం బాగా పరావర్తనం చెందిస్తుంది. అంతే కాకుండా వేడిని గ్రహించడంలోనూ బంగారం బాగా ఉపయోగపడుతుంది. అందువల్లే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ టీమ్ 32 అడుగుల టెలిస్కోప్‌పై బంగారు పూత పూసింది.
ఇందుకోసం నాసా బ్లూక్లిన్‌లోని ఎప్నెర్ టెక్నాలజీ రూపొందించిన లేజర్ గోల్డ్ అనే ఎలెక్ట్రోప్లేటింగ్ టెక్నిక్‌ను ఉపయోగించుకొంది.
ఈ టెక్నిక్‌లో బంగారాన్ని వాయు రూపంలోకి మారేంత వరకు శూన్యంలో వేడి చేస్తారు. ఆ తర్వాత దానిని టెలిస్కోప్‌పై పూత పూస్తారు. శుద్ధమైన బంగారం కన్నా దీనికి మూడు రెట్లు ఎక్కువ కఠినత్వం ఉంటుంది.
దీని వల్ల టెలిస్కోప్‌ను శుభ్రం చేసే సమయంలో గోల్డ్ ప్లేటెడ్ ఇన్‌ఫ్రారెడ్ అద్దంపై ఎలాంటి మరకలూ పడవు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
నాసాకు తన సేవలు అందించే క్రమంలోనే నాటి నుంచి ఎప్నెర్ ఇతర క్లయింట్లకూ తన సేవలు అందిస్తోంది.
ఎప్నెర్ విషయం తెలిసి 2016లో అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కూడా, ఆ సంస్థను సంప్రదించింది. 30-35 ఏళ్ల పాటు నిలిచి ఉండే ఎలక్ట్రోకోటింగ్ టెక్నిక్ గురించి తెలుసుకుని తమ ట్రోఫీలకూ బంగారు పూత పూయాలని కోరింది.
రెండింటి మధ్యా కుదిరిన ఒప్పందం ప్రకారం ఎప్నెర్ సంస్థ ట్రోఫీలపై పూసిన బంగారు పూతలకు లైఫ్ టైమ్ గ్యారంటీ ఇవ్వడమే కాకుండా, ఏదైనా ట్రోఫీపై పూత పోతే ఉచితంగా మళ్లీ గోల్డ్ ప్లేటింగ్ చేసి ఇస్తుంది.
అందువల్ల ఇకపై ఆస్కార్ విజేతలు తమ ట్రోఫీలు వన్నె కోల్పోతాయని బెంగ పడక్కర్లేదు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








