ఉత్తర కొరియాలో అణు పరీక్షలే కాదు.. ‘మందు’ పరీక్షలూ చేస్తారు..!

ఫొటో సోర్స్, PA
ఉత్తర కొరియా క్షిపణులు, అణ్వాయుధాలనే కాదు.. హ్యాంగ్ఓవర్ లేని మద్యాన్ని కూడా కనుగొంది..!
క్షిపణులను కనుగొన్నపుడు, వాటిని ప్రయోగించినపుడు మాత్రమే ఉత్తర కొరియా ఇతర దేశాల మీడియాకు సమాచారం అందిస్తుంది.
ఉత్తర కొరియాలోని స్థానిక మీడియాను ఓసారి గమనిస్తే మరో విషయం కూడా అర్థమవుతుంది.
స్థానిక మీడియాలో.. ఉత్తర కొరియా శాస్త్రవేత్తలు సాధించిన ఎన్నో విజయాలు తెలుస్తాయి. వారి ఆవిష్కరణలు ఆకట్టుకునేలా ఉంటాయి..
కానీ అవి ఎంతవరకూ నిజం అన్నది తేల్చుకోవడం చాలా కష్టం.
ప్రపంచానికి చాలా తక్కువగా తెలిసిన ఉత్తర కొరియా ఆవిష్కరణలను ఓసారి చూసొద్దాం రాండి..

ఫొటో సోర్స్, AFP/Getty Images
ఉత్తర కొరియాకు చెందిన ప్యోన్యాంగ్ టైమ్స్ పత్రిక గత సంవత్సరం ఓ వార్తను ప్రచురించింది. ఆ దేశ శాస్త్రవేత్తలు.. హ్యాంగ్‌ఓవర్ లేని వైన్‌ను కనుగొన్నట్టు ఆ పత్రిక పేర్కొంది.
ఈ వైన్‌ను స్థానికంగా పండించే బియ్యం, కొన్ని ఔషధ మూలికలతో తయారు చేస్తారు. ఇందులో ఆల్కహాల్ శాతం 30 - 40% ఉంటుంది.
ఈ వైన్ తయారీలో ఉపయోగించే 'జిన్సెన్' అనే ఔషధ మూలిక.. హ్యాంగ్ఓవర్‌ను దూరం చేస్తుందని స్థానిక మీడియా పేర్కొంది.

ఫొటో సోర్స్, Reuters
ధూమపానాన్ని నియంత్రించేందుకు ఉత్తర కొరియా శాస్త్రవేత్తలు 2011లో కొత్త రకం మాత్రలు కనుగొన్నారు.
ఈ మాత్రలు సిగరెట్ అలవాటును దూరం చేయడమే కాకుండా, శరీరంలోని విషపూరిత మలినాలను సైతం శుభ్రం చేస్తాయి.
ఈ మాత్రల తయారీలో 'జిన్సెన్'తోపాటుగా కేన్సర్‌తో పోరాడే మరికొన్ని రకాల డ్రగ్స్‌ను కూడా వాడారు.

ఫొటో సోర్స్, Getty Images
కిడ్నీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రతిభావంతమైన ఔషధాన్ని కనుగొన్నట్టు ఉత్తర కొరియాలోని ఓ వార్తా సంస్థ పేర్కొంది.
ఈ డ్రగ్‌లో జంతు రక్తంతో తయారు చేసే ప్రొటోపోర్ఫిన్ అనే మెడిసిన్‌ను వాడారు. ఈ ఔషధంతో హెపటైటిస్, లివర్ సిర్రోసిస్ లాంటి రోగాలనూ నయం చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, BEHROUZ MEHRI/AFP/Getty Images
ఉత్తర కొరియాలోని ఆపిల్, స్ట్రాబెర్రీ పానీయాలు మెదడులోని కణాల పని తీరును మెరుగుపరిచి, వేగంగా పని చేసేలా, జ్ఞాపక శక్తి మరింత పెరిగేలా ఈ పానీయాలు దోహదపడతాయని స్థానిక మీడియా పేర్కొంది.
అంతేకాక.. ఈ పానీయాలు గుండెపోటును నియంత్రిస్తూ.. మొహంపై ముడతలకు, మొటిమలకు మంచి మందుగా పనిచేస్తుందని కూడా వార్తలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Joe Raedle/Getty Images
ఉత్తర కొరియా ఓ చిత్రపటాన్ని విడుదల చేసింది. అయితే.. ఈ ఆవిష్కరణ మాత్రం ఆరోగ్యానికి సంబంధించినది కాదు..
శత్రుభూభాగంలోని ఉత్తర కొరియా యుద్ధ వాహనాల నుంచి శత్రువుల చూపు మరల్చడానికే ఈ చిత్రపటాన్ని విడుదల చేశారు.
అయితే ఉత్తర కొరియా వ్యూహానికి చెందిన వివరాలు దక్షిణ కొరియా మీడియాకు చేరిపోయాయి.
ఈ పెయింటింగ్.. ఉత్తర కొరియా యుద్ధ వాహనాలను, ఆయుధాలను దాచడం మాత్రమే కాకుండా.. ఇందులో మరిన్ని రహస్యాలున్నాయన్న వాదనలూ ఉన్నాయి.
శత్రువుల దృష్టిని మరల్చడానికి, యుద్ధ వాహనాల కదలికలను అనునయించడానికి ఈ చిత్రపటాన్ని వాడతారు.

ఫొటో సోర్స్, TANG CHHIN SOTHY/AFP/Getty Images
ఉత్తర కొరియా ఓ టాబ్లెట్‌ను రూపొందించింది. ఇది ఆండ్రాయిడ్ 4 ఓ.ఎస్.లో మాత్రమే పనిచేస్తుంది. ఇది కేవలం ఉత్తర కొరియా ఇంటర్నెట్‌తో మాత్రమే అనుసంధానం అవుతుంది.
ఇందులో ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ, ప్రధాన వార్తా పత్రిక, అధికారిక టెలివిజన్ అప్లికేషన్లను పొందుపరిచి ఉంటారు.
ఉత్తర కొరియాలో ఇంటర్నెట్ వాడకంపై నిషేధమున్న నేపథ్యంలో.. ఈ టాబ్లెట్ కేవలం అధికారిక టెలివిజన్ ఛానెల్ ప్రసారాలను మాత్రమే అందిస్తుంది.
ఇందులో యూట్యూబ్, జీ మెయిల్‌ను కూడా బ్రౌజ్ చేయొచ్చు.. అది కూడా కేవలం ‘యాంగ్రీ బర్డ్స్’ గేమ్ ఆడటం కోసం మాత్రమే!
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








