బీబీసీ ప్రత్యేకం: రాజస్థాన్ నుంచి లండన్‌కి వెండి బిందెల్లో గంగాజల ప్రయాణం
ఎవరైనా విదేశాలకు వెళ్తే బట్టలో, స్థానిక వంటకాలో తీసుకెళ్తారు. కానీ ఒకాయన ఏకంగా 350 కిలోల బరువున్న వెండి బిందెల్లో వేల లీటర్ల గంగా జలాన్ని తీసుకెళ్లారు. దీనిపై బీబీసీ ప్రత్యేక యానిమేషన్ కథనం.
20వ దశాబ్దం తొలి నాళ్లలో జైపూర్‌కి చెందిన ఓ మహారాజుకి లండన్‌లో జరిగే కింగ్ ఎడ్వర్డ్ 7 పట్టాభిషేకానికి రావల్సిందిగా ఆహ్వానం అందింది. దానికి ఆయన తనతో పాటు భారీ వెండి బిందెల్లో గంగానది నీటిని తీసుకెళ్లారు. అక్కడ తాగడానికీ, స్నానానికీ వాటినే ఉపయోగించారు.
దాదాపు పద్నాలుగు వేల వెండి నాణాలను కరిగించి ఒక్కో బిందెని తయారు చేశారు. ఇప్పటిదాకా వెండితో తయారు చేసిన అతిపెద్ద వస్తువులు ఆ బిందెలేనని చెబుతారు. ఇప్పటికీ ఆ బిందెలు జైపూర్ ప్యాలెస్‌లో సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)