ఎలిజబెత్ రాణి, ప్రిన్స్ ఫిలిప్స్‌ల 70వ వివాహ వార్షికోత్సవం

ఎలిజబెత్ రాణి, ప్రిన్స్ ఫిలిప్స్‌

ఫొటో సోర్స్, MATT HOLYOAK/CAMERA PRESS

ఎలిజబెత్ రాణి, ప్రిన్స్ ఫిలిప్స్‌ల 70వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారిద్దరూ కలిసి ఉన్న కొత్త ఫొటో విడుదలైంది. ఆ ఫొటోను తీసే ఛాన్స్ సెలిబ్రిటీ ఫొటోగ్రాఫర్ మ్యాట్ హోలియోక్‌కు దక్కింది.

రాచ కుటుంబం నుంచి 70వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న మొదటి దంపతులు వీరే.

విండ్సర్ క్యాసిల్‌లో వీరిద్దరూ తమ కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహ వార్షికోత్సవ వేడుకలను జరుపుకొంటారు.

ఎలిజబెత్ రాణి, ప్రిన్స్ ఫిలిప్స్‌

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, రాయల్ మెయిల్ విడుదల చేసిన స్టాంపులు

ఎలిజబెత్ రాణి, ఫిలిప్స్‌లకు నవంబర్ 20, 1947న వివాహం జరిగింది.

వివాహ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని వారికి వివాహం జరిగిన వెస్ట్ మినిస్టర్ అబే చర్చిలో ప్రత్యేకంగా గంటలను మోగించి, ప్రార్థనలు నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా రాయల్ మెయిల్ వివాహ వేడుకలకు సంబంధించిన ఆరు స్టాంపులను విడుదల చేసింది.

ఎలిజబెత్ రాణి, ప్రిన్స్ ఫిలిప్స్‌

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఎలిజబెత్ రాణి, ప్రిన్స్ ఫిలిప్స్‌

వివాహం జరిగినప్పుడు రాకుమారి ఎలిజబెత్‌కు 21 ఏళ్లు కాగా, లెఫ్టినెంట్ ఫిలిప్ మౌంట్‌బాటన్‌కు 26 ఏళ్లు.

ఎలిజబెత్ రాణి, ప్రిన్స్ ఫిలిప్స్‌

ఫొటో సోర్స్, PA

మ్యాట్ హోలియోక్‌ తీసిన ఫొటోలో ఎలిజబెత్ రాణి తన పర్సనల్ అసిస్టెంట్, డ్రెస్ మేకర్ అయిన ఏంజెలా కెల్లీ డిజైన్ చేసిన క్రీమ్ కలర్ డ్రెస్‌ ధరించారు. కెంపు, వజ్రాలతో చేసిన పతకాన్ని ధరించారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)