అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విటర్ ఖాతా మాయం

ఫొటో సోర్స్, Twitter
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతా గురువారం అకస్మాత్తుగా మాయమైపోయింది. అయితే, కొద్ది నిమిషాల్లోనే మళ్లీ ఆయన ఖాతాను పునరుద్ధరించినట్లు ట్విటర్ వెల్లడించింది.
ట్విటర్ కస్టమర్ సపోర్ట్ కేంద్రం ఉద్యోగి ఒకరు ట్రంప్ ఖాతాను డీయాక్టివేట్ చేశారని ట్విటర్ వెల్లడించింది. ఈ పనిచేసిన ఉద్యోగికి సంస్థలో అదే చివరి రోజని, ఆ రోజున ఇలా ఎందుకు చేశారో దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపింది. కాగా మొత్తం 11 నిమిషాల పాటు ఈ అకౌంట్ డీయాక్టివేట్ అయినట్లు గుర్తించారు.
@realdonaldtrump పేరిట ఉన్న ఈ అకౌంట్ రద్దయిన సమయంలో ''క్షమించండి. ఈ పేజీ లేదు'' అన్న సందేశం మాత్రమే కనిపించింది.

ఫొటో సోర్స్, Twitter
ట్విటర్‌లో నిత్యం చురుగ్గా ఉండే ట్రంప్‌కు 4.17 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అకౌంట్ మళ్లీ యాక్టివేట్ కాగానే ట్రంప్ తన ట్వీట్లు మొదలుపెట్టారు. అయితే, అకౌంట్ డీయాక్టివేషన్‌పై మాత్రం ఆయనేమీ స్పందించలేదు. పన్నులను తగ్గించే ప్రణాళికలపై ట్వీట్ చేశారు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడి అధికారిక ట్విటర్ అకౌంట్ @POTUSపై ఎలాంటి ప్రభావమూ పడలేదు. ఇది ఎప్పటిలానే మనుగడలో ఉంది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)




