కాటలోనియా రిఫరెండం ఉద్విగ్న క్షణాలు

కాటలోనియాలో ఆదివారం నిర్వహించిన రిఫరెండంలో ఓటు వేసేందుకు ప్రజలు పెద్దఎత్తున వచ్చారు. కానీ, రిఫరెండం చట్ట విరుద్ధమని కోర్టు చెప్పడంతో ఓటింగ్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. వారిని ప్రజలు అడ్డుకోవడంతో ఘర్షణలు జరిగాయి.

మహిళను తరలిస్తున్న స్పెయిన్ పోలీసులు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, బార్సిలోనాలో ఒక పాఠశాల గుమిగూడిన వారిని తొలగించే క్రమంలో మహిళను అక్కడి నుంచి తరలిస్తున్న స్పెయిన్ పోలీసులు
పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు వచ్చిన ప్రజలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, బార్సిలోనాలోని ఒక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు
కౌగిలించుకున్న కుటుంబ సభ్యులు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, గిరోనాలో ఓటేసిన తరువాత ఉద్వేగానికి లోనైన ఓ కుటుంబ సభ్యులు
ప్రజల్ని అడ్డుకుంటున్న పోలీసులు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఈ ఘర్షణల్లో ప్రజలతో పాటు కనీసం 12 మంది పోలీసు అధికారులు గాయపడ్డారు
పోలీసుతో వాగ్వాదానికి దిగిన మహిళ

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఈ ఘర్షణల్లో వందలాది మంది పోలీసులు గాయపడ్డారని బార్సిలోనా మేయర్ చెప్పారు
వాహనంలో ప్రయాణిస్తున్న మహిళ

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, పోలీసులు సామరస్యంగా వ్యవహరించారని స్పెయిన్ ఉప ప్రధానమంత్రి చెప్పారు
పోలీసులకు పూలు ఇచ్చి నిరసన తెలుపుతున్న ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రిఫరెండంలో పాల్గొనకుండా అడ్డుకుంటున్న పోలీసులకు ప్రజలు తమ నిరసన తెలిపారు
ఖాళీగా ఉన్న స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యచ్ ఆడుతున్న క్రీడాకారులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఎఫ్‌సీ బార్సిలోనా, లాస్ పాల్మస్‌ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్‌కు చివరి నిమిషంలో ప్రేక్షకుల్ని అనుమతించలేదు