మనకు వచ్చిన జ్వరం డెంగీ అని ఎలా తెలుస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?

వీడియో క్యాప్షన్, మనకు వచ్చిన జ్వరం డెంగీ అని ఎలా తెలుస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?

చినుకుల కాలం మొదలవగానే ఒకపక్క పచ్చదనం కొత్త ప్రాణం పోసుకుంటున్నా, మరోపక్క మనల్ని ముంచేందుకు రోగాలు పొంచి ఉంటాయి.

ఎంత కాపాడుకున్నా బడికెళ్లే పిల్లల్లో రొంప, ఫ్లూ జ్వరాలు వచ్చే తీరతాయి. ప్రాణాంతకం కాకపోయినా ఓ వారం పది రోజులు పిల్లల్ని అతలాకుతలం చేస్తాయి.

ఇవి కాకుండా కొత్త నీరు వల్ల, ఆరని తేమతో ముసిరే కీటకాల వల్ల టైఫాయిడ్- అతిసారం వంటి రోగాలూ ఈ కాలంలో సర్వసాధారణం.

ఈరోజుల్లో సకాలంలో దొరికే వైద్యం, అందుబాటులో ఉన్న రోగనిర్ధారణ పరీక్షలు, అత్యవసర మందుల పట్ల మనందరికీ ఉన్న అవగాహన వల్ల ఈ జబ్బులకు కూడా అంతా భయపడాల్సిన పనిలేదు.

కానీ.. ముఖ్యమైనది గ్రామీణ-పట్టణ ప్రాంతాలన్న తేడా లేకుండా చిన్న- పెద్ద అందరిని భయపెట్టేది 'దోమ... చిన్న దోమ… అది తెచ్చే పెద్ద తంటా'. అదే డెంగీ జ్వరం.

డెంగీ అంటే నిజంగానే అంత భయపడాలా? అంటే ఒక విధంగా అవుననే చెప్పాలి. ఏడీస్ అనే ఒక రకమైన దోమల వల్ల వ్యాప్తి చెందే వైరల్ ఇన్ఫెక్షన్ ఈ డెంగీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)